మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్సు యొక్క కనీస ప్రమాణాలు, నిబంధనలు-2020 ని ప్రారంభించిన - కేంద్ర విద్యాశాఖ మంత్రి.

Posted On: 11 AUG 2020 4:40PM by PIB Hyderabad

విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన, విద్యా సంస్కరణల కొనసాగింపుగా "ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్సు యొక్క కనీస ప్రమాణాలు-2020" ని, కేంద్ర విద్యా మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఈ రోజు ఇక్కడ ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా హాజరయ్యారు.  కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ హబీబ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారినుద్దేశించి శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ, భారతదేశం యొక్క అపూర్వమైన నిర్మాణ సౌందర్యం, దాని స్మారక చిహ్నాలు మరియు దేవాలయాల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ఆర్కిటెక్చర్ యొక్క ప్రస్తుత మరియు గత వైభవం నుండి సి.ఓ.ఏ. ప్రేరణ పొందాలనే భారతదేశాన్ని మళ్లీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆర్కిటెక్చర్ రంగంలో ఒక నమూనా మార్పు తీసుకురావాలని ఆయన అన్నారు.  ఆర్కిటెక్చర్ కౌన్సిల్ నిపుణులు తయారుచేసిన ఈ నిబంధనలు, దేశంలో మానవ ఆవాసాలు మరియు నిర్మాణ రంగంలో ఉన్న ప్రధాన ఆందోళనలు మరియు సవాళ్లను పరిష్కరించగలవనీ,  ఆవిష్కరణ మరియు నైపుణ్యాల అభివృద్ధి రంగాలలో భారతదేశాన్ని కొత్త ఎత్తుకు నడిపించగలవనీ,  మంత్రి ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ నిర్మాణం దాని చరిత్ర, సంస్కృతి మరియు మతంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు.

జాతీయ విద్యా విధానం 2020 ను ప్రారంభించడంతో, కొత్త, శక్తివంతమైన భారతదేశం కోసం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి 21 వ శతాబ్దపు సవాళ్లకు సిద్ధం కావాల్సిన విద్యార్థులపై ఆధారపడి ఉంటుందని మంత్రి అన్నారు. ఎన్.ఈ.పి. అనేక భారీ సంస్కరణలను ప్రతిపాదించింది. వాటిని అమలు చేయడానికి అందరి సహకారం అవసరం.  మరియు ఈ నిబంధనలు ఖచ్చితంగా ఆ దిశలో ఒక ముఖ్యమైన దశ, ఇది ప్రతిపాదిత ఎన్.ఈ.పి. నుండి అనేక ఆలోచనలు మరియు ఆలోచనలను తెస్తుంది.  ఈ నిబంధనలను ప్రారంభించినందుకు ఆర్కిటెక్చర్  కౌన్సిల్  ను,  కౌన్సిల్ అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ హబీబ్ ఖాన్ ను ఆయన అభినందించారు. భవిష్యత్తు కోసం  కౌన్సిల్ చెసే ప్రయత్నాలు అన్ని విధాలా ఫలించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ ధోత్రే మాట్లాడుతూ, ఈ నిబంధనలు రూపొందించడానికి చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయనీ,  1983 లో చేసిన మునుపటి నిబంధనల అనంతరం చాలా కాలం వేచి ఉన్న తరువాత చివరికి ఈ రోజు ఇవి వెలుగులోకి వచ్చాయనీ చెప్పారు.  అప్పటి నుండి, విద్యా రంగం ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులకు గురైంది. అందువల్ల, ఈ రంగంలో ఇటీవలి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, దేశంలో ఆర్కిటెక్చరల్ విద్యతో వ్యవహరించే నిబంధనలు కూడా  సవరించాల్సిన సమయం ఆసన్నమైంది.  పురాతన నగరాలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు, భవనాలు మొదలైనవన్నీ అద్భుతమైన భారతీయ సాంస్కృతిక వారసత్వానికీ, విస్మయం కలిగించే ఆర్కిటెక్చర్ కు ప్రతీకలుగా నిలిచాయి.  ఆధునిక భారతీయ ఆర్కిటెక్చర్ కు ప్రపంచంలో అత్యుత్తమమైన వాటితో పోటీపడే సామర్ధ్యం ఉంది. 

విద్యార్థులు వారి నైపుణ్యాలను మరింత మెరుగైన పద్ధతిలో నేర్చుకోవడానికి, అభివృద్ధి చేయడానికి, 21వ శతాబ్దపు సవాళ్లను స్వీకరించడానికి, ఈ నిబంధనల యొక్క విద్యార్థి-కేంద్రీకృత విధానం, వీలు కల్పిస్తుందని శ్రీ ధోత్రే భావించారు.

ఆర్కిటెక్చరల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్సు యొక్క కనీస ప్రమాణాలు, నియమాలు, నిబంధనలు 2020 గురించిన సవివరమైన సమాచారం కోసం ఈ కింది లింకు పై "క్లిక్" చేయండి.  

 

*****


(Release ID: 1645191) Visitor Counter : 192