రాష్ట్రప‌తి స‌చివాల‌యం

శ్రీకృష్ట జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 11 AUG 2020 5:22PM by PIB Hyderabad

శ్రీకృష్ట జన్మాష్టమి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం ఇచ్చారు.

    "పవిత్రమైన జన్మాష్టమి సందర్భంగా, దేశంలో, వెలుపల ఉన్న భారతీయులందరికీ హార్థిక శుభాకాంక్షలు. న్యాయం, సున్నితత్వం, దయతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు మనందరికీ స్ఫూర్తి. హక్కుల కంటే బాధ్యతలపై దృష్టి పెట్టాలన్నదే కృష్ణుడు చెప్పిన 'కర్మయోగ' సందేశం ఇస్తున్న పిలుపు. కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న మన కరోనా యోధులందరిలో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తమ జీవనం, మానవత్వం కోసం కృష్ణ భగవానుడు చెప్పిన సార్వత్రిక బోధనలను పాటిద్దామని ఈ పండుగ సందర్భంగా మనమందరం సంకల్పించుకుందాం”.

రాష్ట్రపతి సందేశాన్ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


(रिलीज़ आईडी: 1645171) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Manipuri , Punjabi , Odia , Tamil