విద్యుత్తు మంత్రిత్వ శాఖ
2021 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి పన్ను అనంతర లాభం(పిఏటి) రు.2,048కోట్లుగా ప్రకటించిన పవర్ గ్రిడ్
5% అనగా రు.9,817కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం
प्रविष्टि तिथि:
11 AUG 2020 2:10PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ’మహారత్న’ కంపెనీ మరియు ’సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(సిటియు)’ అయిన పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(పవర్ గ్రిడ్) 2021 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికానికి తన పన్ను అనంతర ఆదాయాన్ని రు. 2,048 కోట్లు మరియు మొత్తం ఆదాయం రు.9,817 కోట్లుగా పోస్టు చేసింది. పవర్ గ్రిడ్ కంపెనీ యొక్క 2021 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికానికి పన్ను అనంతర ఆదాయం మరియు మొత్తం ఆదాయం వరుసగా రు.1,979 కోట్లు మరియు రు.9,620కోట్లు. ఈ త్రైమాసికంలో అసాధారణంగా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల డిస్కంలు/ విద్యుత్ విభాగాలు రు.1,075కోట్ల కన్సాలిడేటెడ్ రిబేటును ప్రకటించాయి. కోవిడ్-19 సందర్భంగా ఏప్రిల్ 20 మరియు మే 20 వరకు బిల్లింగ్ చెల్లింపులను ప్రజలు ఒక్కసారి వాయిదావేయడానికి అనుమతినిచ్చాయి. ఈ రిబేటు ప్రభావం త్రోసివేయగా కంపెనీ లాభం గత 2019-20ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంతో పోలిస్తే 18%నికి పెరిగింది.
ఏకీకృతంగా ఈ త్రైమాసికానికి కంపెనీ మూలధనవ్యయం రు.1,906 కోట్ల వరకు ఉండగా మూల ఆస్థులు రు.1,184కోట్ల వరకు (ఎఫ్ఇఆర్వి మినహాయించగా) ఉంటుందని పవర్ గ్రిడ్ విడుల చేసిన ప్రకటనలో పేర్కొంది. 30,జూన్ 2020 నాటికి స్థూల స్థిర ఆస్థిలు రు.2,28,856 కోట్లు ఉంటాయని తెలిపింది.
హరియూర్-మైసూర్ లైన్ 400 కెవి డి/సి మరియు మీరట్, కోటేశ్వర్ మరియు బాలిపరాల్లో ఐసిటిల వంటి భారీ ట్రాన్మిషన్లను పవర్ గ్రిడ్ ఈ త్రైమాసికంలో చేపట్టింది. జులై 2020లో చాలా కాలంగా నిలిచిపోయిఉన్న రాజార్హట్-గోర్ఖానా 400కెడి డి/సి ట్రాన్మిషన్ లైనును చేపట్టనుంది. 30, జూన్ 2020 ఆఖరుకు 8 టిబిసిబి సహాయక కార్యక్రమాలు జరుగుతుండగా 11 టిబిసిబి సహాయక కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. సాంకేతికత, ఆటోమేషన్ మరియు డిజిటైజేషన్, 2021 ఆర్థిక సంవత్సరపు త్రైమాసికానికి పవర్ గ్రిడ్ సగటు సరఫరా 99.83% ఉంది. ఈ త్రైమాసింకం కడపటికి పవర్ గ్రిడ్ ట్రాన్మిషన్ ఆస్థుల మొత్తం మరియు వాటి సహాయకాలు 163,695 సికెయం ట్రాన్మిషన్ లైన్లు, 248 సబ్ స్టేషన్లు మరియు 413,950 ఎంవిఏ పైగా ట్రాన్ఫర్మేషన్ సామర్థ్యం కలవి ఉన్నాయి.
***
(रिलीज़ आईडी: 1645139)
आगंतुक पटल : 219