వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఆర్జనలో కీలక మలుపుగా మారనున్న ప్రభుత్వ ఇ-మార్కెటింగ్(జిఇఎం)లో ఎక్కువ మంది కొనుగోలు మరియు అమ్మకందారులను పాల్గొనవలసిందిగా

ఆహ్వానించిన శ్రీ పీయూష్ గోయల్; ఈ ప్రభుత్వ ఇ-మార్కెటింగ్లో త్వరలో భాగస్వామి కానున్న భారతీయ రైల్వే;

ప్రభుత్వ సార్వజనీన సంగ్రహణ సమావేశాల నాలుగవ సంకలనం ప్రారంభం

Posted On: 09 AUG 2020 2:31PM by PIB Hyderabad

ప్రభుత్వ ఇ-మార్కెటింగ్ ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఇ-మార్కెటింగ్(జిఇఎం) మరియు భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ)  వారి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సమావేశంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మరియు రైల్వే మంత్రి వర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు  ఈ రోజు ఆన్లైనో ప్రభుత్వ సార్వజనీన సంగ్రహణ సమావేశాల నాలుగవ సంకలనా(ఎన్పిపిసి)న్ని ప్రారంభించారు. ఎన్పిపిసి యొక్క  ఇతివృత్తం సామర్థ్యం, పారదర్శకత మరియు కలయిక-దిశగా - సాంకేతికతతో కూడిన ప్రభుత్వ సేకరణ

ప్రభుత్వ మార్కెటింగ్ సేకరణలో కీలకంగా మారిన జిఇఎం పద్దతిలో ఎక్కువ మంది కొనుగోలుదారులు మరియు అమ్మకందారులు పాల్గొనాలని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ద్రవ్య రక్షణతో దేశాభివృద్ధిలో జిఇఎం కీలక పాత్రపోషిస్తున్నది. అవసరమైన సమాచారమంతా ఒక చోట పారదర్శకతతో త్వరిత సామర్థ్యంతో సులభంగా లభ్యమవడమే కాక ఎవరైనా ఈ పద్దతిలో మోసపుచ్చడానికి ప్రయత్నించిన వారిని వెంటనే గుర్తించగల సాంకేతికత కలదని  శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. అదే విధంగా అమ్మకందారులెవరైనా నాణ్యత లేని వస్తువులను ఎక్కువ ధరకు అమ్మజూపినట్లైతే వారిని  జిఇఎం వ్యవహార నిషిద్ధుల జాబితాలో పెట్టడమే కాకుండా  మొత్తం ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు.

భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) వారు జిఇఎంను దేశం నలుమూలలా విస్తరించడానికి చేసిన ప్రతిపాదనను ఆయన ఆహ్వానించారు.  ఎక్కువ మంది అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు ఇందులో భాగస్వాములు కావడం వలన నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయని ఆయన అన్నారు.

ఎన్నో ఏళ్ళ నుండి సౌకర్యాలు లేని వర్గాల వారికి తగిన సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం తన వంతు తీవ్ర కృషి చేస్తోందని ప్రభుత్వ సంగ్రహణ భారీగా మరియు సమర్థవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఒక రూపాయి పొదుపు అంటే ఒక రూపాయి సంపాదించినట్లని  ప్రభుత్వ ద్రవ్యాన్ని కాపాడినట్లైతే అది ప్రజల సంక్షేమానికి వినియోగించబడుతుందని, పోటీ తత్వం పెరిగినట్లైతే సామర్థ్యంతోపాటు ప్రభుత్వం ద్రవ్యం పరిరక్షించడుతుందని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. అవినీతి నుండి పరిశుభ్ర ప్రభుత్వం వైపుగా మరలామని సాంకేతికత వలన పారదర్శకత తద్వారా నమ్మకం పెరిగి దేశంలో మార్పువస్తుందని అన్నారు.  ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని అందువలన దేశీయంగా మరియు అంతర్జాతీయంగా వాణిజ్యం ఊపందుకుందని ఆయన వివరించారు.

ప్రసార మాధ్యమాల విజయాన్ని టిఆర్పి రేటింగుల్లో కొలిస్తే జిఇఎం విజయాన్ని ప్రజలకు ప్రభుత్వ సేకరణపై గల నమ్మకంతో కొలుస్తామన్నారు, నియమిత సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను వీలైనంత తక్కువ ధరకు సరఫరా చేసి నమ్మకాన్ని  మరియు దేశ(ప్రజల) సుసంపన్నతను పెంచే దిశగా ప్రభుత్వ ఇ-ప్రాసెస్ విధానంలో పనిచేస్తోందన్నారు. 

త్వరలోనే జిఇఎం మరియు భారతీయ రైల్వే కలిసి పనిచేస్తాయని శ్రీ గోయల్ తెలిపారు. ఇప్పటి వరకు రైల్వేలు సంవత్సరానికి రు.70,000కోట్లు ప్రొక్యూర్మెట్లపై  ఖర్చుచేస్తోందని  జిఇఎంతో కలవడం వలన కనీసం 10-15% అనగా రు.10,000కోట్లు పొదుపు చేయబడతాయని, డబ్బు పొదుపు చేయబడడంతోపాటు మానవవనరులు, శ్రమశక్తి కూడా పొదుపుచేయబడుతుందని మరియు వ్యవస్థలో పారదర్శకత మరియు సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.

అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు ఒకరికొకరు పరిచయానికి ఈ సమావేశం తగిన అవకాశాల్ని కలిగిస్తుందని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల సహాయ మంత్రి శ్రీ సోంప్రకాశ్ అన్నారు. మహిళా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, పారిశ్రామికుతు, చేనేతకారులు, స్వయం సహాయక బృందాలు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు ఈ వేదిక మంచి అవకాశాల్ని కలిగిస్తుందని అన్నారు.  ప్రభుత్వాలు జిఇఎం ద్వారా కొనుగోళ్ళు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కొనుగోలు దారుల ద్రవ్యానికి సరియైన విలువను అందించే విధంగా జిఇఎం సార్వజనీన సేకరణలో సామర్థ్యం, పారదర్శకత, కలయికలను మెరుగుపరుస్తూ  ఉత్పత్తులను నేరుగా సేకరించడం, ఇ-బిడ్డింగ్ మరియు వేలంను నిలిపిపెట్టడం వంటి ఉపకరణాలను కూడా సమకూరుస్తోంది అని జిఇఎం సిఇఓ శ్రీ తల్లీన్ కుమార్ అన్నారు. జిఇఎంలో ఎంఎస్ఎంఇలను చేర్చడం ద్వారా 57% సంచిత స్థూల వాణిజ్యం జరుగుతోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ’ఆత్మనిర్భర్ భారత్’ దృష్టితో ’వోకల్ ఫర్ లోకల్’ ద్వారా స్థానిక వస్తువులకు ప్రోత్సాహాన్ని కల్పించడానికి  వస్తువు తయారీ అయిన దేశంను నమోదు సమయంలోనే చేర్చడాన్ని ప్రభుత్వం  రానున్న రెండు నెలల్లో తప్పనిసరి చేయనుందని, ఏకీకృత సేకరణ పద్దతిలో జిఇఎం4.0 ప్రారంభమవుతుదంని శ్రీ తల్లీన్ కుమార్ అన్నారు.

ఈ సంవత్సరం జిఇఎం ఆన్లైన్ సమావేశాల్లోని కీలకాంశాలపై విస్తృత సమీక్ష జరిగింది.  సార్వజనీన సంగ్రహణలో  జిఇఎం క్రొత్త వర్షన్ జిఇఎం 4.0, ఎంస్ఎంఇ పాత్రపై వర్చువల్  సభ్యమండలిలో చర్చ, అంకురాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, చేనేతకారులు, పారిశ్రామీకులు, సమాచార సాంకేతికత, రక్షణ మరియు రైల్వేల పాత్రపై చర్చ జరిగింది. ఎన్పిపిసి2020లో ప్రభుత్వ అమ్మకం మరియు కొనుగోలుదారుల మధ్య బి2బి మరియు బి2జి సమావేశాలు,  జిఇఎంలో ఇతర కీలకాంశాలు, శిక్షణాకార్యక్రమాలు, సాంకేతిక తరగతులు, క్రొత్త అభివృద్ధికార్యక్రమాలు, వర్చువల్ జిఇఎం స్టాల్, అమ్మకందారులు మరియు కొనుగోలుదారుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు, వారి పేర్ల నమోదు మరియు సేవల గురించి ప్రత్యేక చర్చ వంటివి సమీక్షించబడ్డాయి. ఈ సందర్భంగా  సిఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ కూడా ఈ వేదికలో మాట్లాడారు.



(Release ID: 1644586) Visitor Counter : 119