రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎన్.ఎఫ్.ఎల్. మొత్తం ఎరువుల అమ్మకం 2020, ఏప్రిల్ నుండి జూలై వరకు 18.79 లక్షల మెట్రిక్ టన్నుల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Posted On:
07 AUG 2020 3:09PM by PIB Hyderabad
నేషనల్ ఫెర్టిలైజర్సు లిమిటెడ్ (ఎన్.ఎఫ్.ఎల్) 2020, ఏప్రిల్ నుండి నుండి జూలై వరకు మొత్తం ఎరువుల అమ్మకం 18.79 లక్షల మెట్రిక్ టన్నుల గరిష్ట స్థాయికి చేరింది. దీంతో, గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 15.64 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 20 శాతం కంటే ఎక్కువగా అమ్మకాలు వృద్ధి చెందినట్లయింది. ఈ కాలంలో యూరియా; డి.ఎ.పి; ఎమ్.ఓ.పి; ఎన్.పి.కె; ఎస్.ఎస్.పి; బెంటోనైట్ సల్ఫర్ అమ్మకాలు కూడా ఇందులో ఉన్నాయి.


వీటిలో, కంపెనీ ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న యూరియా నమోదు చేసిన 15.87 లక్షల మెట్రిక్ టన్నుల మేర అమ్మకాలు కూడా ఉన్నాయనీ, ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదు చేసిన అమ్మకాల కంటే 17 శాతం ఎక్కువనీ, ఎన్.ఎఫ్.ఎల్. ఒక ప్రకటనలో తెలియజేసింది.
అమ్మకపు గణాంకాల పట్ల, చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.ఎన్. దత్ సంతోషం వ్యక్తం చేస్తూ, కోవిడ్-19 వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘కిసాన్’ ఎరువులను రికార్డు స్థాయిలో విజయవంతంగా పంపిణీ చేసినందుకు మార్కెటింగ్ బృందాన్ని అభినందించారు.
ఎన్.ఎఫ్.ఎల్ మొత్తం ఐదు యూరియా తయారీ కర్మాగారాలను నిర్వహిస్తోంది. ఇవి పంజాబ్ లోని నంగల్ మరియు బథిండా లలో ఒక్కొక్కటీ, హర్యానా లోని పానీపట్ లో ఒకటి, మధ్యప్రదేశ్ లోని విజయ్ పూర్ లో రెండు చొప్పున ఉన్నాయి. ఈ కంపెనీకి సంవత్సరానికి 35.68 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. యూరియా, జీవ సంబంధమైన ఎరువులు, బెంటోనైట్ సల్ఫర్ వంటి సొంత ఉత్పత్తులతో పాటు, వివిధ రకాల ఎరువులను ఒకే చోట రైతులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ వివిధ కాంప్లెక్సు ఎరువులను కూడా విక్రయిస్తుంది.
*****
(Release ID: 1644161)
Visitor Counter : 157