హోం మంత్రిత్వ శాఖ
కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న జాతీయ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ (ఎన్ ఐ డి ఎం), భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి) సంయుక్తంగా "ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన మరియు పిడుగులు" అనే అంశంపై నిర్వహించిన వెబినార్ ను హోమ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ప్రారంభించారు.
Posted On:
05 AUG 2020 4:31PM by PIB Hyderabad
"జలం - వాతావరణ ప్రమాదాల ముప్పు తగ్గింపు" పై జాతీయ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ (ఎన్ ఐ డి ఎం), భారత వాతావరణ శాఖ సంయుక్తంగా వెబినార్ శ్రేణిని నిర్వహించింది. ఈ శ్రేణిలో భాగంగా ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన మరియు పిడుగులు, కుంభవృష్టి మరియు వరదలు, తుపానులు మరియు ఉప్పెనవల్ల వచ్చే జలప్రళయం మరియు వాతావరణ మార్పులు మరియు తీవ్రమైన వాతావరణ ఘటనలు వంటి అంశాలపై నాలుగు వెబినార్ లను నిర్వహిస్తోంది. జలం - వాతావరణ ప్రమాదాల ముప్పు గురించి మెరుగైన అవగాహనతో పాటు మానవ సామర్ధ్యం పెంపు మరియు సమర్ధవంతమైన సహకార చర్యల ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి ముప్పును తగ్గించడానికి ప్రధానమంత్రి 10 అంశాల అజెండా అమలును వెబినార్ శ్రేణి ప్రోత్సహిస్తుంది. తద్వారా వైపరీత్యాల వల్ల బాధితులైన ప్రజా సమూహాలు మరియు పరిసరాల క్షమతను పెంచడం వాటి ఉద్దేశం.
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ "ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన మరియు పిడుగులు" అనే అంశంపై ఏర్పాటు చేసిన మొదటి వెబినార్ ను ప్రారంభించారు. జలం - వాతావరణ ప్రమాదాలవల్ల కలిగే ముప్పును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ శాఖలు / సంస్థలు తీసుకున్న చర్యలను, ప్రధానంగా చేపట్టిన కార్యక్రమాలను గురించి శ్రీ రాయ్ తమ ప్రసంగంలో వివరించారు. ఈ విపత్తుల ప్రభావాన్ని, వాటివల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి సమన్వయంతో స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని కూడా ఆయన ఉద్గాటించారు
ఈ వెబినార్ శ్రేణిలో ప్రసంగించిన ప్రముఖులలో ఎన్ డి ఎం ఎ సభ్య కార్యదర్శి శ్రీ జి వి వి శర్మ, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవన్, ఎన్ డి ఎం ఎ అదనపు కార్యదర్శి డాక్టర్ వి. తిరుప్పుగళ్, ఎన్ ఐ డి ఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మనోజ్ కుమార్ బిందాల్, భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్, డాక్టర్ మ్యుత్యుంజయ మహాపాత్ర, ఎన్ డి ఆర్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్ ఎన్ ప్రధాన్ మరియు ఎన్ ఐ డి ఎంలో జి ఎం ఆర్ డి విభాగం అధిపతి ప్రొఫెసర్ సూర్య ప్రకాశ్ ఉన్నారు. ఇంకా వెబినార్ లలో ప్రసంగించిన పేరొందిన వక్తలలో డైరెక్టర్ (ఎఫ్ ఎఫ్ ఎం), సి డబ్ల్యు సి శ్రీ శరద్ చంద్ర , బొంబాయి ఐ ఐ టికి చెందిన ప్రొఫెసర్ కపిల్ గుప్తా, వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. కె. జనమని, భారత వాతావరణ శాఖలో జలవాతావరణ విభాగం అధిపతి శ్రీ బి.పి.యాదవ్, వాతావరణ శాస్త్రవేత్తలు డాక్టర్ డి. ఆర్ పట్టనేల్, డాక్టర్ సోమసేన్ రాయ్ మరియు సునీతా దేవి, ఇంకా ప్రపంచ బ్యాంకుకు చెందిన శ్రీ అనూప్ కారంత్ ఉన్నారు.
ఈ వెబినార్ శ్రేణికి సంబంధించిన కీలక విషయం ఏమిటంటే ప్రస్తుతం ఎదుర్కొంటున్న జల-వాతావరణ ఘటనల గురించి మన కేంద్ర సంస్థలు సరిగా అంచనా వేయగలుగుతున్నాయి. ఏ సమయంలో ఎక్కడ విపత్తుకు అవకాశం ఉందొ చెప్పగలుగుతున్నాయి. ముందు ముందు భారత వాతావరణ శాఖ (ఐ ఎం డి), జాతీయ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ (ఎన్ ఐ డి ఎం) తమ సామర్ధ్యాన్ని మరింత పెంచుకొని మరింత ఖచ్చితంగా జల-వాతావరణ విపత్తులను అంచనా వేయగలుగుతాయి. తద్వారా సంబంథిత భాగస్వామ్య పక్షాలకు, ప్రజా సమూహాలకు తగిన ముందు జాగ్రత్తలు, ఉపశమన చర్యలు తీసుకోవటానికి సహాయకారిగా ఉంటాయి.
*****
(Release ID: 1643604)
Visitor Counter : 179