రక్షణ మంత్రిత్వ శాఖ
74 వస్వాతంత్ర ్య దినోత్సవం సందర్భంగా సైనిక, నౌకాదళ, వాయుసేన కు చెందిన మిలటరీ బ్యాండ్‌ల సంగీత కార్యక్రమాలు
Posted On:
05 AUG 2020 11:16AM by PIB Hyderabad
దేశంలోని మిలటరీ బ్యాండ్‌లు తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర ్య దినోత్సవాలను పురస్కరించుకుని తమ ప్రదర్శనను ఇస్తున్నాయి. ఆగస్టు 1నుంచి 15 వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రాణాలకు తెగించి నిరంతరాయంగా కరోనాపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు కృతజ్ఞతా సూచకంగా, వారికి అభినందనలు తెలియజేస్తూఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆర్మీ, నేవీ, పోలీస్ విభాగాలకు చెందిన బ్యాండ్‌లు పోరుబందర్, హైదరాబాద్, బెంగళూరు, రాయ్‌పూర్, అమృత్‌సర్, గువాహతి, అలహాబాద్,కోల్‌కతాలలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాయి.
మిలటరీ, పోలీస్ బ్యాండ్లు ఈ మధ్యాహ్నం విశాఖపట్నం, నాగపూర్, గ్వాలియర్‌లలో కార్యక్రమం నిర్వహిస్తాయి. ఆగస్టు 7, 2020 న మిలటరీ బ్యాండ్‌లు శ్రీనగర్, కోల్‌కతాలలో కార్యక్రమాలు నిర్వహిస్తాయి. త్రివిధ దళాల బ్యాండ్ ఢిల్లీలో మూడు ప్రదర్శనలు ఇవ్వనుంది. అవి ఒకటి రెడ్‌ఫొర్ట్ వద్ద, మరొకటి రాజ్‌పథ్ ఇంకొకటి ఇండియా గేట్ వద్ద వరుసగా 2020 ఆగస్టు 8,9, 12 తేదీలలో ఇవ్వనుంది. మిలటరీ, పోలీస్ బ్యాండ్ ముంబాయి, అహ్మదాబాద్, సిమ్లా, అల్‌మోరాలలో ఆగస్ట్ 8న , చెన్నై ,నసీరాబాద్,అండమాన్ నికొబార్ కమాండ్ ఫ్లాగ్ పాయింట్ వద్ద, దండి లో ఆగస్ట్ 9న కార్యక్రమం నిర్వహించనుంది. ఇంపాల్, భోపాల్, ఝాన్సీలలో ఆగస్ట్ 12న కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సిరిస్‌లో తుది కార్యక్రమం 2020 ఆగస్టు 13న లక్నో, ఫైజాబాద్, షిల్లాంగ్, మదురై, చంపారన్ లలో నిర్వహిస్తారు.
.
(Release ID: 1643509)
Visitor Counter : 221