మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎంహెచ్‌ఆర్‌డి మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేసిన ఉన్నత ప్రాధమిక దశ కోసం ఎన్‌సిఇఆర్‌టి ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడెమిక్ క్యాలెండర్‌ను కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి విడుదల చేశారు
పిల్లల అభ్యాసంలో పురోగతిని అంచనా వేయడానికి క్యాలెండర్ ఇతివృత్తాలను అభ్యాస ఫలితాలతో మ్యాప్ చేస్తుంది:
శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’
Posted On:
03 AUG 2020 7:09PM by PIB Hyderabad
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఎగువ ప్రాధమిక దశలో ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్‌ను వర్చ్యువల్ గా విడుదల చేశారు .కోవిడ్ -19 కారణంగా ఇంటి వద్ద విద్యార్థులు సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకోడానికి తమ తల్లి దండ్రుల సహాయంతో విద్యాకార్యకలాపాలను నిర్వహించాలి. ఇందుకు ఎంహెచ్‌ఆర్‌డి మార్గదర్శకత్వంలో ఎన్‌సిఇఆర్‌టి, ప్రాథమిక, ఉన్నత ప్రాధమిక దశలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్లను అభివృద్ధి చేసింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆన్‌లైన్ బోధన-అభ్యాస వనరులను ఉపయోగించి కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి సానుకూల మార్గాలను తెలుసుకోవడానికి క్యాలెండర్ మన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులకు మరింత బలం చేకూరుస్తుందని అన్నారు. పాఠశాల విద్యను పొందడం ద్వారా వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. ఇంట్లో. ఎగువ ప్రాధమిక దశలో (VI నుండి VIII తరగతులు) క్యాలెండర్ నాలుగు వారాల పాటు విడుదల చేసారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్నత ప్రాధమిక దశలో వచ్చే ఎనిమిది వారాల క్యాలెండర్ విడుదల చేసారని తెలిపారు. ఉల్లాసంగాను, ఆసక్తికరమైన మార్గాల్లోనూ విద్యను అందించడానికి అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, సోషల్ మీడియా సాధనాలపై క్యాలెండర్ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలను అందిస్తుందని, ఇది ఇంట్లో ఉన్నప్పుడు కూడా అభ్యాసకుడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.
మొబైల్ ఫోన్, రేడియో, టెలివిజన్, ఎస్ఎంఎస్ మరియు వివిధ సోషల్ మీడియా వంటి వివిధ రకాల మాధ్యమ సంధానాలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు శ్రీ పోఖ్రియాల్ చెప్పారు. మనలో చాలా మందికి మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవచ్చు లేదా వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ మొదలైన వివిధ సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించలేకపోవచ్చు, క్యాలెండర్ ఉపాధ్యాయులకు మరింత సహాయం చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. తల్లిదండ్రులు, విద్యార్థులు మొబైల్ ఫోన్లలో, వాయిస్ కాల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా. ఈ క్యాలెండర్ అమలు చేయడానికి ప్రాథమిక దశ విద్యార్థులకు తల్లిదండ్రులు సహాయ పడగలరని భావిస్తున్నారు.
ఈ క్యాలెండర్‌లో దివ్య్యాంగ్ పిల్లలు (ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలు) సహా అన్ని పిల్లల అవసరాలను తీర్చగలమని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. - ఆడియో పుస్తకాలు, రేడియో కార్యక్రమాలు, వీడియో ప్రోగ్రాం లింక్ చేర్చుతారు.
సిలబస్ లేదా పాఠ్య పుస్తకం నుండి తీసుకున్న థీమ్ / అధ్యాయానికి సంబంధించి, క్యాలెండర్లో ఆసక్తికరమైన మరియు సవాలుతో కూడిన కార్యకలాపాల వారం వారీ ప్రణాళిక ఉందని శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు. ముఖ్యంగా, ఇది ఇతివృత్తాలను అభ్యాస ఫలితాలతో మ్యాప్ చేస్తుంది. అభ్యాస ఫలితాలతో ఇతివృత్తాల మ్యాపింగ్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఉపాధ్యాయులు / తల్లిదండ్రులు పిల్లల అభ్యాసంలో పురోగతిని అంచనా వేయడానికి, పాఠ్యపుస్తకాలకు మించి వెళ్లడం. క్యాలెండర్‌లో ఇవ్వబడిన కార్యకలాపాలు అభ్యాస ఫలితాలపై దృష్టి పెడతాయి అందువల్ల పిల్లలు వారి రాష్ట్రంలో లేదా యుటిలో ఉపయోగిస్తున్న పాఠ్యపుస్తకాలతో సహా ఏదైనా వనరు ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
ఇది ఆర్ట్స్ ఎడ్యుకేషన్, శారీరక వ్యాయామాలు, యోగా, పూర్వ వృత్తి నైపుణ్యాలు వంటి అనుభవపూర్వక అభ్యాస కార్యకలాపాలకు కూడా వర్తిస్తుంది. ఈ క్యాలెండర్‌లో తరగతి వారీగా, విషయ వారీగా కార్యకలాపాలు పట్టిక రూపాల్లో ఉంటాయి. ఈ క్యాలెండర్‌లో నాలుగు భాషలకు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నాయి, అంటే హిందీ ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం. ఈ క్యాలెండర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులలో ఒత్తిడి, ఆందోళనను తగ్గించే వ్యూహాలకు కూడా అవకాశం ఇస్తుంది. క్యాలెండర్లో ఈ-పాఠశాలా, ఎన్ఆర్ఓఈఆర్, కేంద్ర ప్రభుత్వ పోర్టల్ దీక్ష లో లభించే చాప్టర్ వారీగా ఈ-కంటెంట్ కోసం లింక్ ఉంటుంది.
ఇచ్చిన అన్ని కార్యకలాపాలు సూచనా ప్రవృత్తితోనే ఉంటాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కార్యకలాపాలను సందర్భోచితంగా ఎంచుకోవచ్చు. క్రమంతో సంబంధం లేకుండా విద్యార్థి ఆసక్తి చూపే అంశాలను అభ్యాసం చేయవచ్చు.
టీవీ ఛానల్ స్వయంప్రభా (కిషోర్ మంచ్) (ఉచిత డిటిహెచ్ ఛానల్ 128, డిష్ టివి ఛానల్ # 950, సన్‌డైరెక్ట్ # 793, జియో టివి, టాటాస్కై # 756, ఎయిర్‌టెల్ # 440, వీడియోకాన్ ఛానల్ # 477 ఛానల్) ద్వారా ఎన్‌సిఇఆర్‌టి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రత్యక్ష ఇంటరాక్టివ్ సెషన్‌లు ప్రారంభించింది. కిషోర్ మంచ్ యాప్ (ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు), యూట్యూబ్ లైవ్ (ఎన్‌సిఇఆర్టి అఫీషియల్ ఛానల్)లో కూడా అందుబాటులో ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు రోజూ ఈ సెషన్లు సెకండరీకి ఉదయం 9:00 నుండి 10:30 వరకు, ప్రాథమిక తరగతులకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, ఉన్నత ప్రాధమిక తరగతులకు మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, హైయర్ సెకండరీకి తరగతులు మధ్యాహ్నం 2:30 నుండి 4:00 వరకు ప్రసారం చేస్తారు. వీక్షకుడితో సంభాషించడంతో పాటు, అంశాల బోధన కార్యకలాపాలు ఈ ప్రత్యక్ష సెషన్లలో ప్రదర్శిస్తాయి. ఈ క్యాలెండర్ ఎన్‌సిఇఆర్టి లు / ఎస్ఐఈలు, డైరెక్టరేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి, సిబిఎస్ఈ, రాష్ట్ర పాఠశాల విద్యా బోర్డులు ద్వారా అందరికి అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేశారు.
****
(Release ID: 1643308)
Visitor Counter : 385