ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్‌ మరణం పట్ల సంతాపం ప్రకటించిన ఉప రాష్ట్రపతి

Posted On: 01 AUG 2020 7:06PM by PIB Hyderabad

రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్‌ మరణం పట్ల ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ శ్రీ ఎం.వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. అమర్‌ సింగ్‌ వయస్సు 64 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆఖరి శ్వాస విడిచారు.

    అమర్‌ సింగ్‌ చికిత్స గురించి, సింగపూర్‌లోని భారత హై కమిషనర్‌తో శ్రీ వెంకయ్య నాయుడు తరచూ మాట్లాడేవారు. వైద్యం విషయంలో అవసరమైన సాయం అందించాలని ఎప్పటికప్పుడు సూచిస్తుండేవారు.

    అమర్‌ సింగ్‌తోనూ వెంకయ్య నాయుడు తరచూ మాట్లాడుతూ, ఆరోగ్యం గురించి ఆరా తీసేవారు. అమర్‌ సింగ్‌ కోలుకుని త్వరలోనే భారత్‌ తిరిగి వస్తారని ఆశించారు.

    అమర్‌ సింగ్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్‌, సమర్థుడైన పార్లమెంటు సభ్యుడిని కోల్పోయామన్నారు. "శ్రీ సింగ్ రాజకీయ రంగంలో ప్రముఖుడు; అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించారు" అని వ్యాఖ్యానించారు. అమర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
అమర్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

***
 



(Release ID: 1643043) Visitor Counter : 126