ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యవర్గమండలి బ్యూరోకు అధ్యక్షత వహించిన డాక్టర్ హర్షవర్ధన్

వ్యాధులపై సమన్వయంతో కూడిన ప్రపంచ స్పందనకోసం

కొత్త సవాళ్లను మరింత దీటుగా, సమైక్యంగా ఎదుర్కోవాలని పిలుపు

Posted On: 31 JUL 2020 6:39PM by PIB Hyderabad

  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.) కార్యవర్గ మండలి బ్యూరో సమావేశానికి కేంద్ర ఆరోగ్, కు  టుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అధ్యక్షత వహించారు. బ్యూరో చైర్మన్ హోదాలో ఆయన ఆన్ లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. బ్యూరో వైస్ చైర్మన్, డబ్ల్యు.హెచ్.. డైరెక్టర్ జనరల్, పరిశీలక భాగస్వాములు, డబ్ల్యు.హెచ్.. ప్రధాన కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు కూడా  సమావేశానికి హాజరయ్యారు.

  32 సమావేశం, బడ్జెట్, పరిపాలనా కమిటీ (పి.బి..సి.), 73 ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం (డబ్ల్యు.హెచ్. 73), 73 ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం కొనసాగింపు, 147వకార్యవర్గ మండలి సమావేశం నిర్వహణ తదితర అంశాలు చర్చనీయాంశాలుగా సమావేశం నిర్వహిచారు..

  సమావేశం ప్రారంభంలో డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ,..కార్యవర్గ మండలి బ్యూరో తొలి సమావేశానికి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. కోవిడ్-19 సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో వారంతా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్-19 వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారిపట్ల ఆయన తీవ్ర సంతాపం, ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్ వైరస్ పై ముందువరుసలో సాహసోపేతంగా పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

  కోవిడ్-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి దాదాపు నాలుగు నెలలైందని, దాదాపు కోటీ 70లక్షలమంది కోవిడ్ వైరస్ బారినపడ్డారని, 6లక్షల 62వేలమందికిపైగా జనం తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని డాక్టర్ డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కోవిడ్ సంక్షోభంతో వ్రపంచ ఆర్థికవ్యవస్థకు తీవ్రమైన విఘాతం కలిగిందన్నారు. ప్రస్తుత తరుణంలో ఆరోగ్యానికి గల ప్రాముఖ్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుందని, అసంఖ్యాకమైన అంటువ్యాధులు, ఇతర వ్యాధుల వ్యాప్తితో ఎదురయ్యే ముప్పును, దుష్ప్రభావాలను ఎదుర్కొనడానికి వివిధ దేశాల మధ్య మరింత సహకారం అసరమని గుర్తించారని కేంద్రమంత్రి అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో,..ప్రపంచం భారీ సంఖ్యలో మానవాళికి నిలయమైనప్పటికీ, వ్యాధి వ్యాప్తి అవకాశాలు, సవాళ్లు మరింతగా పెరిగాయని, దేశాల ఎల్లలను కూడా వ్యాధి లెక్కచేయడంలేదన్నారు.

    సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలకు ఒక విజ్ఞప్తి చేశారు. అంటువ్యాధులు, ఇతర వ్యాధులపై మరింత దీటుగా పోరాటం జరిపేందుకు ప్రపంచ స్థాయి స్పందనను కూడగట్టడానికి బహుముఖ రంగాల ద్వారా సమైక్యం కావాలని ఆయన సూచించారుమహమ్మారి వ్యాపించిన ప్రస్తుత తరుణంలో ముప్పును ఎదుర్కొనేందుకు సృజనాత్మక మార్గాలకోసం అన్వేషణ జరపాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

  సకాలంలో సమన్వయంతో కూడిన ప్రపంచస్థాయి స్పందనకోసం కొత్త సవాళ్లను మరింత దీటుగా, సమైక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.    డాక్టర్ హర్షవర్ధన్ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గెబ్రియేసస్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం భాగస్వామ్య ప్రతినిధులకోసం ఆయన సమావేశాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

****

 



(Release ID: 1642707) Visitor Counter : 223