గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ప్ర‌భుత్వ నిధుల‌తో నిర్మించి ప్ర‌స్తుతం ఖా‌ళీగా ఉన్న ఇళ్ళ‌ను పిపిపి ప‌ద్ధ‌తిలో వాడ‌డం ద్వారా అమ‌లుకానున్న ‌ఎఆర్‌హెచ్‌సి

క్రెడాయ్‌- ఆవాస్ యాప్ కు సంబంధించిన మొబైల్ అప్లికేష‌న్ , ఎన్‌.ఎ.ఆర్‌.ఎ.డి.సి.ఒ కు చెందిన ఈ- కామ‌ర్సు పోర్ట‌ల్‌ను ఆవిష్క‌రించిన కేంద్ర మంత్రి హ‌ర్దీప్ పూరి

ఎఆర్‌హెచ్‌సి నాల‌డ్జ్ ప్యాక్ విడుద‌ల‌

Posted On: 31 JUL 2020 4:05PM by PIB Hyderabad

కేంద్ర గృహ నిర్మాణ‌‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ  స‌హాయ మంత్రి (ఇంఛార్జ్‌), శ్రీ‌హ‌ర్దీప్ సింగ్ పూరి, ఎఆర్‌హెచ్‌సి వారి నాలెడ్జ్ ప్యాక్ (ఎకెపి)ని వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ ‌వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ దుర్గా శంక‌ర్ మిశ్రా అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ కార్యక్ర‌మంతో  ప‌లు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌తినిధులు, ఎన్‌.ఎ.ఆర్‌.ఇ.డి.సి.ఒ, క్రెడాయ్‌, ఫిక్కి, సిఐఐ, అసోచామ్ సంస్థ‌ల ప్ర‌తినిదులు వెబినార్ ద్వారా అనుసంధాన‌మ‌య్యారు.
కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో పెద్ద ఎత్తున వ‌ల‌స కార్మికులు, ప‌ట్ట‌ణ పేద‌లు తిరిగి  త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లారు. గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ శంఖారావానికి అనుగుణంగా ,కేంద్ర కేబినెట్ 2020 జూలై 8 న చౌక అద్దె ఇళ్ళ కాంప్లెక్సుల (ఎఆర్‌హెచ్‌సి) ప‌థ‌కాన్ని ఆమోదించింది. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ‌(అర్బ‌న్‌)కు ఉప ప‌థ‌కంగా ప‌ట్ట‌ణ పేద వ‌ల‌స కార్మికుల సుల‌భ‌త‌ర జీవ‌నానికి దీనిని ఆమోదించింది.

ఎఆర్ హెచ్ సి ని రెండు న‌మూనాల‌లో అమ‌లు చేస్తారు:
న‌మూనా -1:
 ప్ర‌భుత్వ నిధుల‌తో చేప‌ట్టి ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న ఇళ్ళ‌ను ఎఆర్ హెచ్‌సి ఇళ్ళుగా 25 ఏళ్ల కాలానికి మార్చేందుకు ఉప‌యోగిస్తారు. దీనిని ప‌బ్లిక్‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యం లేదా ప‌బ్లిక్ ఏజ‌న్సీల ద్వారా చేప‌డ‌తారు.
1.అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు కేంద్ర రాష్ట్రాల‌కు చెందిన వివిధ ప‌థ‌కాల కింద నిర్మించి త‌మ వ‌ద్ద ఖాళీగా ఉన్న ఇళ్ల‌ను ఎఆర్‌హెచ్‌సిలుగా మార్చేందుకు  ఈ ప‌థ‌కం అవ‌కాశం క‌ల్పిస్తుంది.
2.ఇందుకు సంబంధించి ఒక న‌మూనా ఆర్.ఎఫ్‌.పి ని త‌గినవిధంగా వాడుకోవ‌డానికి , క‌న్సెష‌నెయిర్ ఎంపిక‌కు జారీ చేయ‌డానికి అన్ని రాష్ట్రాలకు పంప‌డం జ‌రిగింది.

న‌మూనా -2:
 ప‌బ్లిక్‌, ప్రైవేటు సంస్థ‌‌లు త‌మ‌కు అందుబాటులో ఉన్న స్వంత స్థ‌లాల‌లో 25 సంవ‌త్స‌రాల కాలానికి  ఎఆర్‌హెచ్‌సి ల నిర్మాణం, కార్యాచ‌ర‌ణ‌,నిర్వ‌హ‌ణ చేప‌ట్ట‌డం.

 1.ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య సంఘాలు, త‌యారీ కంపెనీలు, విద్య‌, ఆరోగ్య సంస్థ‌లు, అభివృద్ధి అథారిటీలు, గృహ‌నిర్మాణ బోర్డులు, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ అండ‌ర్ టేకింగ్‌లు (పిఎస్‌యు), ఇలాంటి ఇత‌ర సంస్థ‌ల వ‌ద్ద ఎలాంటి కార్య‌క‌లాపాల‌కూ ఉప‌యోగించ‌కుండా ఉన్న భూమి చాలా వ‌ర‌కు ఉంది.  వీటికి త‌గిన విధాన‌ప‌ర‌మైన మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా, త‌గిన ప్రొవిజ‌న్లు, ప్రోత్సాహ‌కాల ద్వారా ఉప‌యోగించ‌కుండా ఉన్న ఈ భూముల‌ను పేద‌, వ‌లకూలీల‌కోసం చౌక గృహ నిర్మాణాన్ని అభివృద్ధి చేయ‌డానికి వినియోగించ‌వ‌చ్చు.
2. దీనికితోడు, త‌మ స్వంత ఖాళీ భూమిలో ఎఆర్‌హెచ్‌సిల‌ నిర్మాణం, కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం, నిర్వ‌హ‌ణ కు యుఎల్‌బిల చేత సంస్థ‌ల ఎంపిక‌కు  గృహ‌నిర్మాణ ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారా‌ల మంత్రిత్వ‌శాఖ ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌ను జారీ చేస్తుంది.

ఎఆర్‌హెచ్‌సిల నాలెడ్జ్‌ప్యాక్‌లో కింది డాక్యుమెంట్లు ఉంటాయి:

ఎ.  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు  సంత‌కం చేయ‌నున్న మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్( ఎం.ఒ.ఎ)
బి.  ఎఆర్‌హెచ్‌సిల నిర్వ‌హ‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు
సి,  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పట్ట‌ణ స్థానిక సంస్థ‌లు  నమూనా -1 కింద క‌న్సెష‌నెయిర్
       ఎంపిక‌కు న‌మూనా అభ్య‌ర్థ‌న ప్ర‌తిపాద‌న (ఆర్‌.ఎఫ్‌.పి)
డి.  న‌మూనా -2 కింద సంస్థ‌ల షార్ట్ లిస్టింగ్‌కు ఆసక్తి వ్య‌క్తీక‌ర‌ణ (ఇఒఐ)
ఇ.  త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌లు (ఎఫ్‌.ఎ.క్యు)

ఎఆర్‌హెచ్‌సి ప‌థ‌కాన్ని సంబంధిత‌ కేంద్ర మంత్రిత్వశాఖ‌లు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ఇత‌ర ప్రైవేటు, ప‌బ్లిక్ స్గేక్‌హోల్డ‌ర్లతో ప‌లు ద‌ఫాలుగా సంప్ర‌దించిన అనంత‌రం రూపొందించ‌డం జ‌రిగింది. ఎఆర్‌హెచ్‌సిని అమ‌లు చేయ‌డంలో స్టేక్‌హోల్డ‌ర్లందరికీ మ‌ద్ద‌తు ఇచ్చేవిధంగా ఎకెపిని రూపొందించారు. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డానికి అందించే నిరంత‌ర స‌హ‌కారం , ప‌ట్ట‌ణ వ‌ల‌స‌దారులు, పేద‌ల‌కు అవ‌స‌ర స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డ‌డ‌మే కాకుండా, ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్‌ను వేగ‌వంతం చేయ‌డం, అద్దె గృహా ల మార్కెట్లో పెట్టుబ‌డుల‌కు , త‌ద్వారా ఆర్ధిక వ్య‌వ‌స్థ పుంజుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. ఇది అంద‌రికీ  ఉప‌యోగ‌ప‌డే న‌మూనా.

ప్రైవేటు, ప‌బ్లిక్ సంస్థ‌ల‌కు  ప్ర‌తిపాదిత ప్రోత్సాహ‌కాలు, రాయితీలు :
 వివిధ సంస్థ‌ల‌కు ఇది ఒక‌  ఆక‌ర్ష‌ణీయ‌మైన‌, అనుకూల‌మైన అవ‌కాశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అఫార్డ‌బుల్ హౌసింగ్ ఫండ్ (ఎ.హెచ్‌.ఎఫ్), ప్రాధాన్య‌తా రంగ రుణ‌స‌దుపాయం (పిఎస్ఎల్‌) కింద రాయితీతో కూడి ప్రాజెక్టు ఫైనాన్స్ , ఆదాయ‌ప‌న్ను, జిఎస్‌టిలో రాయితీ, ఎ.ఆర్‌.హెచ్ సి ల‌లోవినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానాల వాడ‌కాన్ని ప్రోత్స‌హించేందుకు టెక్నాల‌జీ ఇన్నొవేష‌న్ గ్రాంటును       అంద‌జేస్తుంది. దీనికి తోడు, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్ర‌భుత్వాలు  అనుమ‌తుల‌లో మార్పులకు అనుమ‌తించ‌డం,   ఉచితంగా 50 శాతం అ‌దన‌‌పు ఎఫ్‌.ఎ.ఆర్‌, ఎఫ్‌.ఎస్‌.ఐ,30 రోజుల‌లో ఏక‌గ‌వాక్ష విధానంలో అనుమ‌తి, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ స‌దుపాయం, రెసిడెన్షియ‌ల్ ఆస్తుల‌తో స‌మానంగా మునిసిప‌ల్ చార్జీలు వంటివి క‌ల్పిస్తాయి.
క్రెడాయి కి చెందిన ఒక మొబైల్ అప్లికేష‌న్ - ఆవాస్ యాప్‌, ఎన్‌.ఎ.ఆర్‌.ఇ.డి.సి.ఒ కు చెందిన ఈ -కామ‌ర్స్ పోర్ట‌ల్‌,- హౌసింగ్ ఫ‌ర్ ఆల్‌ను గృహ‌నిర్మాణ మంత్రి ఈ సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు.
ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేస్తాయి . సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం ద్వారా, మార్కెట్ విధానాల‌ను మార్చడంలో ఇళ్ళ‌ కొనుగోలుదారులకు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం క‌ల్పిస్తాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌ల ఇళ్ల కొనుగోలుదారుల‌కు ఇవి  గేట్‌వేగా ప‌నికి వ‌స్తాయి. డ‌వ‌ల‌ప‌ర్ల‌తో సంబంధం ఏర్ప‌ర‌చుకుని , రెరా రిజిస్ట‌ర్డ్ ప్రాజెక్టులనుంచి త‌మ క‌ల‌ల గృహాన్ని ఎంపిక చేసుకోవ‌డానికి ఇది వీలు క‌లిగిస్తుంది.
 ఈ ఈవెంట్‌లో  దేశ‌వ్యాప్తంగా , రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు రియ‌ల్ ఎస్టేట్ రంగ ప్ర‌ముఖులు, ఇండ‌స్ట్రీ ఛాంబ‌ర్సు ప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.  స్టేక్ హోల్డ‌ర్లు అంద‌రికీ ఎఆర్‌హెచ్‌సి గురించి ,  ఎకెపి రూపంలో దాని అమ‌లు ఉప‌క‌ర‌ణాల‌ను తెలియ‌జేయ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లు చేయ‌డానికి గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ఈ ప‌థ‌కం అమ‌లుకు సాధ్య‌మైన పూర్తి మ‌ద్ద‌తును  అందిస్తుంది.

***



(Release ID: 1642703) Visitor Counter : 159