బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా ఉద్యోగి ఎవరు కోవిడ్ -19 తో మరణించినా , దానిని ప్రమాద మరణంగా పరిగణన: కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారికి అన్ని ప్రయోజనాలూ వర్తింపు
Posted On:
30 JUL 2020 7:32PM by PIB Hyderabad
కోల్ ఇండియా ఉద్యోగులు ఎవరైనా, కరోనా మహమ్మారితో మరణిస్తే అలాంటి మరణాలను ప్రమాద మరణాలు గా పరిగణించి , ఉద్యోగి కుటుంబ సభ్యులకు , ఉద్యోగి విధినిర్వహణలో ప్రమాదంలో మరణిస్తే లభించే అన్ని రకాల ఆర్ధికప్రయోజనాలను వర్తింపచేయనున్నట్టు కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు. జార్ఖండ్‌లో ఒకరోజు పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం వల్ల కోల్ ఇండియాలో పనిచేస్తున్న 4 లక్షలమంది రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు.
+ ప్రాణాలు పణంగా పెట్టి కోల్ ఇండియా సిబ్బంది, కోవిడ్‌మహమ్మారి సమయంలో అద్భుతమైన పనితీరు కనబరిచారు. వారు అలుపెరగకుండా అద్భుత కృషి చేస్తున్నారు.అందువల్ల నేను గర్వంగా వారిని బొగ్గు యోధులు అని అంటాను.వారు దేశానికి అందిస్తున్న వెలకట్టలేని సేవలకు గుర్తింపుగా ఈ ప్రయోజనాన్ని ప్రకటించడం జరిగింది+ అని శ్రీ జోషి తెలిపారు.
రాగల సంవత్సరాలలో వాణిజ్యపరమైన బొగ్గు మైనింగ్, జార్ఖండ్‌లో అభివృద్ధికి దోహదపడనున్నట్టు మంత్రి తెలిపారు.జార్ఖండ్‌లో 09 బొగ్గు గనుల వేలం కింద రాష్ట్రం ఏడాదిలో, 3,200 కోట్ల రూపాయలకు పైగా రాబడి ఆర్జించనుందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి అదనపపు ఉపాధి కలగనుందని, అదనంగా, డిఎంఎఫ్ కు జార్ఖండ్ కంట్రిబ్యూషన్ రూ 17 కోట్ల వరకూ ఉండనుందని ఆయన తెలిపారు. ఇది బొగ్గు గనుల చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.
"వాణిజ్య మైనింగ్ వేలానికి మంచి స్పందన ఉంది. ప్రత్యేకించి జార్ఖండ్‌లో వేలానికి నిర్ణయించిన గనులన్నింటికీ 5 నుంచి 10 మంది వరకు వేలంలో పాల్గొనే వారు ఉన్నారు. దీనివల్ల రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది.ఇది రాష్ట ప్రగతిలో కొత్త అధ్యాయం కానుంది." అని శ్రీ జోషి అన్నారు.
రాంచీ సందర్శన సందర్భంగా శ్రీ ప్రహ్లాద్ జోషి, జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరేన్‌ను కలుసుకుని ,గనులకు సంబంధించిన పలు విషయాలను ఆయనతో చర్చించారు. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సిసిఎల్), భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్),ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇసిఎల్) కంపెనీల పనితీరును ఆయన సమీక్షించారు., బొగ్గు యోధులు గత కొన్ని నెలలుగా కోవిడ్ మహమ్మారి సమయంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించేందుకు చేసిన అద్భుత కృషిని ఆయన ప్రశంసించారు.
వాణిజ్య మైనింగ్ ప్రారంభం గురించి ప్రస్తావిస్తూ ఆయన, ఇండియా తన వార్షిక బొగ్గు అవసరాల్లో ఐదో వంతును దిగుమతి చేసుకుంటున్నదని చెప్పారు. ఒకసారి వాణిజ్య మైనింగ్ పుంజుకుంటే, స్వతంత్రథర్మల్ ప్లాంట్లు, కాప్టివ్ పవర్ ప్లాంట్లు దిగుమతులు చేసుకునే అవసరం ఉండదన్నారు. దీనివల్ల ఏటా సుమారు 30, 000 కోట్ల రూపాయల దిగుమతుల బిల్లు ఆదా అవుతుందని ఆయన చెప్పారు.ఇది ప్రత్యక్షంగా , పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందన్నారు.
జార్ఖండ్‌కు మైనింగ్ ఎంత ప్రాధాన్యత కలిగినదో వివరిస్తూ శ్రీ జోషి, జార్ఖండ్‌కు మైనింగ్ జీవన రేఖ వంటిందని, జార్ఖండ్ అభివృద్ధిలో ఇది కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు.
ఖనిజాలు పుష్కలంగా గల నేల నుంచి, ఏక కాలంలో 3 బొగ్గు కంపెనీలు బొగ్గును వెలికితీస్తున్న రాష్ట్రం దేశంలో జార్ఖండ్ ఒక్కటే నని ఆయన చెప్పారు. బొగ్గు కంపెనీలు సిసిఎల్, బిసిసిఎల్, ఇసిఎల్ లు రాగల 4 సంవత్సరాలలో 742 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయనున్నాయని , రాబడి 18,889 కోట్ల రూపాయలు చెల్లించనున్నాయని మంత్రి చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రం ఏటా దాదాపు 4 ,000 కోట్ల రూపాయల వంతున 16,000 కోట్ల రూపాయలు ఆర్జించిందని జోషి చెప్పారు. ఈ బొగ్గు కంపెనీల హోల్డింగ్ కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) జార్ఖండ్ ఒక్కదానికే తన మొత్తం రాయల్టీలో 30 శాతం వరకు చెల్లిస్తుందని తెలిపారు. ఉత్పత్తిలో జార్ఖండ్ వాడా 20 శాతం వరకు ఉందన్నారు.
జార్ఖండ్ ప్రగతి సాధించాలని, తద్వారా అది దేశ ఆర్ధిక ప్రగతికి దోహదపడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని శ్రీప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న బొగ్గు కంపెనీలు దశాబ్దాలుగా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అలా అవి జార్ఖండ్ నేల నుంచి బొగ్గును తవ్వితీసి , రాష్ట్ర అభివృద్ధికి రాబడిని చెల్లిస్తున్నాయని ఆయన అన్నారు. సిఎంఎస్‌పి చట్టం కింద కేటాయించిన బొగ్గు గనుల వల్ల జార్ఖండ్ ప్రభుత్వానికి సంవత్సరానికి రూ 6,564 కోట్ల రూపాయలు రానున్నట్లు ఆయన చెప్పారు. దీనికి తోడు, సిఐఎల్, జార్ఖండ్ లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి 2023-24 నాటికి 34 ,000 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నదని కూడా ఆయన చెప్పారు.
***
(Release ID: 1642501)
Visitor Counter : 218