ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాజ్యసభకోసం కేటాయించిన స్థలం స్వాధీనానికి చర్యలు తీసుకోండి అధికారులకు ఉపరాష్ట్రపతి ఆదేశం

Posted On: 30 JUL 2020 5:40PM by PIB Hyderabad

రాజ్యసభ సచివాలయంకోసం కేటాయించిన 8,700 చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంలో జరుగుతున్న జాప్యంపట్ల రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు రోజు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని ఆర్.కె. పురంలో,.. 2003లో స్థల కేటాయింపు జరిగింది.

  రాజ్యసభ స్థలంపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు జరిగిన సమావేశంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. రాజ్యసభ సచివాలయం, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పట్టణ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుభూమి అభివృద్ధి కార్యాలయం సీనియర్ అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కేటాయింపు జరిగిన స్థలానికి ఆక్రమణలనుంచి విముక్తి కలిగించేందుకు అధికారులు సత్వరం తగిన చర్యలను తీసుకోవాలని వెంకయ్యనాయుడు ఆదేశించారు.

    రాజ్యసభ సచివాలయంకోసం మొత్తం 8,700 చదరపు మీటర్ల స్థలాన్నికేటాయించగా, అందులో దాదాపు 4,384.25 చదరపు మీటర్ల స్థలాన్ని మూడు ప్రభుత్వేతర సంస్థలతో సహా వివిధ రకాల సంస్థలు ఆక్రమించాయి. దాదాపు 1,193.54 చదరపు మీటర్ల స్థలంలో అక్రమంగా మురికివాడలు వెలిశాయి.

  స్థలం స్వాధీనం చేసుకోవడంలో అసాధారణరీతిలో జాప్యం జరుగుతోందని, సుదీర్ఘకాలంగా మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని రాజ్యసభ చైర్మన్ చెప్పారు.

  స్థలం వ్యయంకింద, మురికివాడలు మరోచోటికి తరలించేందుకు రాజ్యసభకు కోటీ 25లక్షల రూపాయలు ఖర్చయిందని ఆయన అన్నారు. రాజ్యసభ టీవీ కోసం సంవత్సరానికి 30కోట్ల రూపాయలను అద్దెగా చెల్లించేవారమని, తాను విషయమై న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ తో సంప్రదించిన  తర్వాత ఇపుడు అద్దె 15కోట్ల రూపాయలకు తగ్గిందని ప్రస్తుత పరిస్థితుల్లో 15కోట్ల రూపాయలు కూడా బరువేనని, ఇది నివారించదగిన ఆర్థిక భారమేనని ఆయన అన్నారు.

  కేటాయించిన భూమిని అప్పగించిన పక్షంలో రాజ్యసభ టీవీకి, రాజ్యసభ సచివాలయం సిబ్బందికి నివాస గృహాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టేందుకు అవకాశం ఉంటుందని, అప్పుడే ఖజానాకు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని  అవుతుందని రాజ్యసభ చైర్మన్ అభిప్రాయపడ్డారు.

  స్థలానికి సంబంధించిన అన్ని సమస్యలనూ పరిష్కరించేందుకు సమగ్రమైన సమీక్ష నిర్వహించాలని, తగిన సమన్వయంతో పనిచేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శిని రాజ్యసభ చైర్మన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చట్టపరమైన అడ్డంకులన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు ఆదేశించారు.

****

 



(Release ID: 1642464) Visitor Counter : 154