విద్యుత్తు మంత్రిత్వ శాఖ

రికార్డు స్థాయిలో 977.07 మిలియన్‌ యూనిట్ల రోజువారీ ఉత్పత్తిని సాధించిన ఎన్‌టీపీసీ

Posted On: 29 JUL 2020 2:16PM by PIB Hyderabad

    దేశంలోనే అతి పెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ అయిన "నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌" మరో ఘనతను సాధించింది. ఆ సంస్థ ప్రకటన ప్రకారం, 977.07 మిలియన్‌ యూనిట్ల రోజువారీ ఉత్పత్తితో రికార్డు సృష్టించింది. ఈనెల 28వ తేదీన ఇది సాధ్యమైంది. తన అనుబంధ సంస్థలు, జేవీల ఉత్పత్తిని కూడా కలుపుకుని 977.07 మిలియన్‌ యూనిట్ల రోజువారీ ఉత్పత్తిని ఎన్‌టీపీసీ సాధించింది. 

    చత్తీస్‌ఘడ్‌లోని తన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలైన కోర్బా, సిపత్‌, లారా; ఒడిశాలోని తాల్చేర్‌ కనిహా, హిమాచల్‌ప్రదేశ్‌లోని కోల్దామ్‌ హైడ్రో అత్యద్భుతంగా పని చేశాయని, వంద శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాయని ఎన్‌టీపీసీ వెల్లడించింది. ఈ సంస్థ గత రికార్డు 935.46 మిలియన్‌ యూనిట్లు. 2019 మార్చి 12వ తేదీన ఆ ఘనత సాధించింది.

    ఎన్‌టీపీసీ వ్యవస్థాగత సామర్థ్యం 62,910 మెగావాట్లు. ఈ గ్రూపులో 24 బొగ్గు, 7 గ్యాస్‌/లిక్విడ్‌, ఒక జల విద్యుత్‌ కేంద్రం, 13 పునరుత్పాదక, 25 అనుబంధ, 7 జేవీ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి.



(Release ID: 1642097) Visitor Counter : 155