రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 సంబంధిత ఇబ్బందులు ఎన్నిఉన్నప్పటికీ గత ఏడాదికి మించి అద్భుత స్థాయిలో సరకు రవాణా చేస్తున్న రైల్వే
2020 జూలై 27న 3.13 మెట్రిక్ టన్నుల సరకును లోడ్ చేసిన రైల్వే. గత ఏడాది ఇదే రోజులోడింగ్‌తో పోల్చి చూసినపుడు ఇది ఎక్కువ.
2020 జూలై 27 న సరకు రవాణా రైళ్ళ సగటువేగం ,గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.
జూలై నెలలో సరకు రవాణా రైళ్ళ సగటు వేగం గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే రెట్టింపు.
Posted On:
28 JUL 2020 5:26PM by PIB Hyderabad
కోవిడ్ -19 కు సంబంధించి ఎన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ భారతీయ రైల్వే, ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి గత ఏడాదికి మించి సరకు రవాణాను చేపట్టి చెప్పుకోదగిన మైలురాయిని సాధించింది. 2020 జూలై 27న 3.13 మెట్రిక్ టన్నుల సరకును లోడింగ్ చేసింది. ఇది గత ఏడాది ఇదే రోజు జరిపిన లోడింగ్ కంటే ఎక్కువ.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లాక్‌డౌన్ సమయంలో దీర్ఘకాలిక, భారీ లక్ష్యాలను సాధించే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా భారతీయ రైల్వే లాక్‌డౌన్ సమయంలో సుమారు 200 మౌలికసదుపాయాల ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇప్పుడు సరకు రవాణా విషయంలోనూ రైల్వే మైలురాయిని అధిగమించింది.
2020 జూలై 27న సరకు రవాణా రైళ్ళ సగటు వేగం గంటకు 46.16 కిలోమీటర్లు. ఇది గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే రెట్టింపు . గత ఏడాది ఇదే రోజు సరకు రవాణా రైళ్ల సగటు వేగం గంటకు 22.52 కిలోమీటర్లు. జూలై నెలలో సరకు రవాణా రైళ్ళ సగటు వేగం గంటకు 45.03 కిలోమీటర్లు. గత సంవత్సరం ఇదే రోజు నాటి వేగం కంటేసుమారు రెట్టింపు (23.22 కె.ఎం.పి.హెచ్). పశ్చిమ మధ్య రైల్వే లో సగటు వేగం 54.23 కిలోమీటర్లు. ఈశాన్య సరిహద్దు రైల్వేలో సరకు రవాణా రైళ్ళ సగటు వేగం గంటకు 51 కిలోమీటర్లు కాగా, తూర్పు మధ్య రైల్వేలో ఈ వేగం గంటకు 50.24 కిలోమీటర్లు, ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఇది గంటకు 41.78 కిలోమీటర్లు,ఆగ్నేయ మధ్య రైల్వేలో గంటలకు 42.83 కిలోమీటర్లు, ఆగ్నేయ రైల్వేలో గంటకు 43.24 కిలోమీటర్లు, పశ్చిమ రైల్వేలో గంటకు 44.4 కిలోమీటర్లు గా ఉంది.
2020 జూలై 27న మొత్తం సరకు లోడింగ్ 3.13 టన్నులు. ఇది గత ఏడాది ఇదే రోజు లోడింగ్ చేసిన సరకు పరిమాణం కంటే ఎక్కువ. 27 జూలై 2020 న మొత్తం 1039 రేక్ ల సరకు ను భారతీయ రైల్వే లోడ్ చేసింది. ఇందులో 76 రేక్‌ల ఆహారధాన్యాలు . 49 రేక్‌ల స్టీలు, 113 రేక్‌ల సిమెంట్, 113 రేక్‌ల ఇనుప ఖనిజం, 363 రేక్‌ల బొగ్గు ఉన్నాయి.
సరకురవాణాలో ఈ మెరుగుదలను సంస్థాగతం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న జోరో బేస్‌డ్ టైమ్‌టేబుల్ లో దీనిని చేరుస్తారు. ఈ చర్యలు చెప్పుకోదగిన స్థాయిలో సరకు రవాణా చేపట్టడానికి, రైల్వేకి రాబడి తీసుకురావడానికి ఉపకరిస్తాయి. అలాగే మొత్తం దేశానికి తక్కు వ ఖర్చుతో సరకు రవాణా సదుపాయాలు కలుగుతాయి.
భారతీయ రైల్వేలో సరకు రవాణాను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోదగినది
అన్నిరకాలుగా సామర్ధ్యాన్ని , పనితీరును మెరుగు పరుచుకునేందుకు భారతీయ రైల్వే కోవిడ్ 19ను ఒక అవకాశంగా మలుచుకుంది.
*****
(Release ID: 1641892)
Visitor Counter : 267