ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, బోర్డు గవర్నర్ల 5వ వార్షిక సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
Posted On:
28 JUL 2020 6:24PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ , ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) బోర్డు గవర్నర్ల 5 వ వార్షిక సమావేశానికి వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు.
బ్యాంకు భవిష్యత్‌పై ప్రభావం చూపే కీలక నిర్ణయాలను బ్యాంకు వార్షిక సమావేశంలో జరిగే బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సమావేశంలో తీసుకుంటూ ఉంటారు. ఈ సమావేశంలో ఎఐఐబి అధ్యక్షుడి ఎన్నిక,‘ ఎఐఐబి-2030- రాగల దశాబ్దంలో ఆసియా అభివృద్ధికి మద్దతు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ చర్చ ఇతర అధికారిక కార్యకలాపాలు చేపట్టడం జరిగింది.
***
(Release ID: 1641861)
Visitor Counter : 247