ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారతదేశంలో కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్) మరింత మెరుగుపడి, 2.25 శాతానికి తగ్గింది.

మొత్తం రికవరీల సంఖ్య పెరుగుదల కొనసాగుతూ ఈ రోజు 9.5 లక్షలు దాటింది.

నిన్న 35,000 రికవరీలు నమోదయ్యాయి.

Posted On: 28 JUL 2020 3:01PM by PIB Hyderabad

భారతదేశంలో కేసు మరణాల రేటు (సి.ఎఫ్.ఆర్) క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం ఇది 2.25 శాతానికి తగ్గింది.  ప్రపంచంలో అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశాల్లో ఒకటిగా భారతదేశం కొనసాగుతోంది.  సంపూర్ణ ప్రమాణాలతో కూడిన వైద్య పరిరక్షణ విధానం ఆధారంగా ఇంటింటికీ సర్వేలు, భారీ సంఖ్యలో పరీక్షలు మరియు ప్రామాణిక క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ లతో కలిపి కంటైన్మెంట్ వ్యూహం సమర్థవంతంగా అమలు చేయడంతో ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో, రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు తీవ్రమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మరణాలను తగ్గించడంపై దృష్టి సారించాయి.  దేశవ్యాప్తంగా సి.ఎఫ్.ఆర్.  తగ్గడానికి దారితీసే క్షేత్ర స్థాయి ఆరోగ్య సంరక్షణ కార్మికులను ఉపయోగించి అధిక-ప్రమాదం ఉన్న జనాభా సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.  ఫలితంగా, జూన్ మధ్యలో 3.33 శాతంగా ఉన్న సి.ఎఫ్.ఆర్. ఈ రోజు 2.25 శాతానికి తగ్గింది.

సకాలంలో, నిరంతరాయంగా రోగులకు వైద్య చికిత్సనందిచడంతో పాటు, మూడు అంచెల ఆసుపత్రి మౌలిక సదుపాయాల కారణంగా, రికవరీలలో స్థిరమైన పెరుగుదల సాధ్యమయ్యింది. భారతదేశంలో వరుసగా ఐదవ రోజున కూడా రోజుకు 30,000 మంది  కంటే ఎక్కువగా కోవిడ్ రోగులు డిశ్చార్జి అయ్యారు.  ఆసుపత్రిలో చేరిన కేసులకు సమర్థవంతమైన వైద్య చికిత్స మరియు కేంద్ర బృందాలు, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ నిపుణుల బృందాలు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించడంతో పాటు వ్యాధి సోకినవారిని ముందస్తుగా గుర్తించడం, వారిని ఐసోలేషన్ లో ఉంచడం వంటి వాటిపై కేంద్రప్రభుత్వం / రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉండడంతో సత్పలితాలు వస్తున్నాయి. రికవరీ రేటు రోజురోజుకూ మెరుగౌతోంది. 

ఫలితంగా జూన్ మధ్యలో 53 శాతంగా ఉన్న రికవరీ రేటు, ఈ రోజున 64 శాతం కంటే ఎక్కువగా పెరిగింది.  గత 24 గంటల్లో 35,176 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, ఇంతవరకు మొత్తం డిశ్చార్జి అయిన రోగుల సంఖ్య 9,52,743 కి పెరిగింది. 

రోజువారీ రికవరీ సంఖ్య పెరుగుతూ ఉండడంతో, కోలుకున్న కేసులు & క్రియాశీల కేసుల మధ్య అంతరం కూడా నిరంతరం పెరుగుతోంది.  ప్రస్తుతం ఇది 4,55,755 గా ఉంది.  అంటే, క్రియాశీల కేసుల సంఖ్య ప్రస్తుతం 4,96,988 గా ఉంది. ఇవన్నీ వైద్య పర్యవేక్షణలో ఉన్నాయి.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలు,

సలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం

 వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

 https://www.mohfw.gov.in/   మరియు  @MoHFW_INDIA.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను

దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు : 

 technicalquery.covid19[at]gov[dot]in 

ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న

 మెయిల్ ను సంప్రదించడం  ద్వారా పొందవచ్చు  :  

 ncov2019[at]gov[dot]in   మరియు   @CovidIndiaSeva .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనా,

ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన 

ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  

లేదా  1075  టోల్ ఫ్రీ ను సంప్రదించవచ్చు.

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన

కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి :

 https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

*****



(Release ID: 1641837) Visitor Counter : 232