హోం మంత్రిత్వ శాఖ

82వ రైజింగ్ డే సందర్భంగా 'సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్' సిబ్బంది మరియు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా

- సీఆర్‌పీఎఫ్ శౌర్యం, ధైర్యం మరియు త్యాగానికి పర్యాయపదంగా నిలుస్తోంది; సీఆర్‌పీఎఫ్ దేశాన్ని గర్వించేలా చేసిందన్న‌ కేంద్ర హోంమంత్రి

- కోవిడ్‌-19 సమయంలో సమాజానికి సేవ చేయడంలో సీఆర్‌పీఎఫ్ యొక్క అంకితభావం అసమానమైనదన్న‌ శ్రీ అమిత్ షా

Posted On: 27 JUL 2020 3:52PM by PIB Hyderabad

 

82వ రైజింగ్ డే సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి ఒక ట్వీట్‌లో “82వ రైజింగ్ డే సంద‌ర్భంగా ధైర్య‌వంతులైన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి మ‌రియు వారి కుటుంబ స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ల‌క్ష‌లాది మందిలో నేను కూడా చేరుతున్నా.


సీఆర్‌పీఎఫ్‌ శౌర్యం, ధైర్యం మరియు త్యాగానికి పర్యాయపదంగా ఉంది. సీఆర్‌పీఎఫ్‌ దేశాన్ని గర్వించేలా చేసింది”. "కోవిడ్‌-19 సమయంలోనూ సమాజానికి సేవ చేయ‌డంలో సీఆర్‌పీఎఫ్ క‌న‌బ‌రిచిన అంకితభావం అసమానమైనది" అని శ్రీ అమిత్ షా అన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జూలై 27, 1939 న క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసుగా ఉనికిలోకి వచ్చింది. ఇది డిసెంబర్ 28, 1949 న సీఆర్‌పీఎఫ్‌ చట్టాన్ని అమలులోకి తేవ‌డంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మారింది. ఇది ఈ రోజు 82 సంవత్సరాల అద్భుతమైన చరిత్రను పూర్తి చేసుకుంది.

***


(Release ID: 1641620) Visitor Counter : 254