వ్యవసాయ మంత్రిత్వ శాఖ

బిహద్ - చంబల్ విశాలమైన ప్రాంతాన్ని వ్యవసాయం కిందకు తెచ్చేందుకు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయినా కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

ప్రాథమిక నివేదిక నెలలో సమర్పిస్తారు

ప్రస్తుతం సాగు చేయలేని గరుకైన భూమిలో 3 లక్షల హెక్టార్లలో వ్యవసాయ అభివృద్ధి గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని బిహాద్ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 26 JUL 2020 10:58AM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ 2020 జూలై 25 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, గ్వాలియర్ - రాజమాత విజయరాజే సింధియా కృషి విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్, గ్వాలియర్, ఇతర వాటాదారులతో  చంబల్ ప్రాంతంలోని పెద్ద బిహాద్ ప్రాంతాన్ని వ్యవసాయం కిందకు తీసుకురావడంపై చర్చలు జరిపారు. 

ప్రపంచ బ్యాంకు సహకారంతో, ఈ ప్రాజెక్టును సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముందే ఒక సమావేశం జరిగింది. 

వ్యవసాయ మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం సాగు చేయలేని 3 లక్షల హెక్టార్ల గరుకైన భూమిలో వ్యవసాయ అభివృద్ధి చేస్తే గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని బిహాద్ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి జరుగుతుందని అన్నారు. అలాగే ఈ ప్రాంత ప్రజలకు సమృద్ధిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 

 

చంబల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరిగి,  ఈ ప్రాంతం గుండా వెళుతుంది, దీని ద్వారా ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి సాధ్యమవుతుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాధమిక నివేదికను సిద్ధం చేసిన తరువాత, తదుపరి చర్యల కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో తదుపరి సమావేశాలు జరుపుతామని అన్నారు. 

ప్రపంచ బ్యాంకు ప్రతినిధి శ్రీ ఆదర్శ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేయడానికి ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపుతోందన్నారు. కనీస బడ్జెట్ కేటాయింపులతో ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను ప్రారంభించడానికి ముందు సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, పెట్టుబడులు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ శ్రీ కె.కె సింగ్ మాట్లాడుతూ పాత ప్రాజెక్టు పునరుద్ధరించడం అయిందని, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రి  మార్గదర్శకత్వంలో చేపడుతామని చెప్పారు. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్. కె. రావు మాట్లాడుతూ ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ పనులు చేపట్టవచ్చని అన్నారు. 

***



(Release ID: 1641358) Visitor Counter : 169