రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే డిజిటల్ సరఫరా చెయిన్ ను జిఇఎంతో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వ ఈ - మార్కెట్ జిఇఎం ద్వారా రైల్వే తనకు అవసరమైన వస్తు సేవలు పొందనుంది.
రైల్వే సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలకు పైగా వస్తు సేవలను అందుకుంటుంది..
రైల్వే ప్రోక్యూర్‌మెంట్ ప్రక్రియలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలను సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీపియూష్ గోయల్..
భారతీయ రైల్వేలో మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహణ.
మిషన్ ఆత్మనిర్భర భారత్‌కు సన్నద్ధమైన భారతీయ రైల్వే.
ఐఆర్ ఇ పి ఎస్ , జిఇఎంతో అనుసంధానం కానున్న భారతీయ రైల్వే ఈ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థ
స్వావలంబిత భారత్ దిశగా ప్రగతిపథంలో పురోగమించడానికి వీలుగా పరిశ్రమ వర్గాలతో మాట్లాడి , పరిశ్రమ సామర్ధ్యం ,సమర్థత పెంచాల్సిందిగా అధికారులకు ఆదేశం.
తయారీ రంగంతో సహా భారతీయ ఆర్ధిక వనరులకు వీలైనంత ఎక్కువ అవకాశం కల్పించేట్టు చూడాల్సిందిగా ఆదేశం
స్థానిక వెండర్లు, సరఫరాదారులనుంచి మరిన్ని బిడ్లు వచ్చేందుకు అవకాశం ఇచ్చేలా, స్థానిక కంటెంట్ క్లాజును ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలలో చేర్చాల్సిన అవసరం గుర్తింపు
Posted On:
25 JUL 2020 4:44PM by PIB Hyderabad
భారత ప్రభుత్వవిభాగాలలో, భారతీయ రైల్వేలోని ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతీయ రైల్వేలలో అవినీతి రహిత, పారదర్శక ప్రొక్యూర్‌మెంట్ విధానం ఉన్నదన్న విశ్వాసం పరిశ్రమ వర్గాలలో కల్పించాలని సూచించారు.
ప్రోక్యూర్‌మెంట్ ప్రక్రియలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులును ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షిస్తూ ఆయన, ప్రోక్యూర్ మెంట్ ప్రక్రియలో స్థానిక వెండర్లు పాల్గొనడాన్ని పెంచేలా చూడాలని నొక్కి చెప్పారు. స్థానిక వెండర్లు, సరఫరా దారుల నుంచి మరిన్ని బిడ్లు వచ్చే విధంగా ప్రొక్యూర్ మెంట్ నిబంధనలలో స్థానిక కంటెంట్ క్లాజు ఉండాలని నిర్ణయించారు.ఇది ఆత్మనిర్భర్‌భారత్ మిషన్‌కు మరింత ఊపు నివ్వనుంది. ఈ దిశగా భారతీయ రైల్వే కృషి చేసేందుకు వీలుగా అవసరమైతే డిపిఐఐటిని విధానపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా కోరి దాని మద్దతు తీసుకోవాలని అన్నారు.
స్థానికంగా తయారయ్యే వస్తువులను ఎవరు ఎక్కువగా సరఫరాచేయగలుగుతారో అలాంటి వెండర్లకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై వెండర్లకు స్సష్టత వచ్చేందుకు హెల్ప్ లైన్ నెంబర్, తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాల సెక్షన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగింది.
మేక్ ఇన్ ఇండియాను పెంపొందించడం, జిఇఎం ద్వారా వివిధ ఉత్పత్తులు సేకరించడానికి తీసుకుంటున్న చర్యలు ,ఈ దిశగా జరిగిన పురోగతి తదితర విషయాలపై రైల్వే బోర్డు మెటీరియల్స్ మేనేజ్ మెంట్ సబ్యుడు సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి రైల్వేశాఖ సహాయమంత్రి శ్రీ సురేష్ సి అంగడి, రైల్వేబోర్డు సభ్యులు, సిఇఒ, జిఇఎం, వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన డిపిఐఐటి ప్రతినిధులు హాజరయ్యారు.
సర్వీసులు అందించే భారతీయ సంస్థలు, తయారీదారులు ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలో మరింత గా పాల్గొనేలా చేసేందుకు తగిన వ్యూహాలను రూపొందించాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో గుర్తించారు.
అంతర్జాతీయంగా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విషయంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జిఇఎం) అనేది అత్యంత వినూత్న ఆలోచన. రైల్వే సరుకులు, సేవల ప్రొక్యూర్ మెంట్ కు సంబంధించి సుమారు 70 వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్ మెంట్‌ను జిఇఎం ప్లాట్‌ఫారమ్ పై చేయాల్సిన అవసరాన్ని శ్రీ పియూష్ గోయల్ నొక్కి చెప్పారు. ప్రత్యేకించి ఎం.ఎస్.ఎం.ఇలతోపాటు , దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలోని పరిశ్రమలకు సైతం జిఇఎం ప్లాట్‌ఫారం ద్వారా మార్కెట్‌కు తలుపులు తెరవాలని ఆయన అన్నారు.
భారతీయ రైల్వే, భారత ప్రభుత్వంలోని ఒక అతిపెద్ద ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ. ఇది జిఇఎం పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు, రైల్వే ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను జిఇఎం తో అనుసంధానం చేస్తున్నది. జిఇఎంతో రైల్వే ఈ ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను సమీకృతం చేయడానికి భారతీయ రైల్వే కాలపట్టిక ను రూపొందించింది. వ్యక్తుల ప్రమేయం లేకుండా ఈ రెండు వ్యవస్జలూ ఒకదానికొకటి ఎలాంటి ఆటంకాలూ లేకుండా అనుసంధానత కలిగిఉండాల్సిన అవసరాన్ని రైల్వే శాఖ నొక్కి చెప్పింది. రైల్వేకి చెందిన ఐ.ఆర్.ఇ.పి.ఎస్, అలాగే జిఇఎం ల రెండింటి బలాన్ని సమర్ధంగా వినియోగించుకుని రైల్వే ప్రొక్యూర్‌మెంట్ ను జిఇఎం పూర్తి సామర్ధ్యానికి తీసుకువెళ్ళే విధంగా నిర్ణయించారు. జిఇఎం తో అనుసంధానత అనంతరం ఇది భారత ప్రభుత్వానికి చెందిన అన్ని ఏజెన్సీలకు ఏకైక పబ్లిక్ ప్రోక్యూర్‌మెంట్‌పోర్టల్ గా రూపొందించే దిశగా ముందుకు సాగాల్సి ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.
, ఇండియాలో అవినీతి రహిత పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ వాతావరణాన్నిరూపొందించేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇందులో ప్రత్యేకించి రైల్వే మంత్రిత్వశాఖ డిపిఐఐటి, జిఇఎంలకు కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. భారతీయ రైల్వే ప్రగతి ప్రస్థానంలో పాల్గొనే విధంగా మరింత ఎక్కువమంది దేశీయ వెండర్లను అభివృద్ధి చేసేందుకు పరిశ్రమ వర్గాలతోడ్పాటు తీసుకోవాలని ప్రత్యేకంగా ఈ చర్చల సందర్భంగా ప్రస్తావించారు.
ఈ సమావేశంలో ప్రజెంటేషన్ల సందర్భంగా, రైల్వేలు , అన్ని కార్యకలాపాలకు కలిపి ఒకేదశ వెండర్ వెబ్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను తీసుకువచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. వెబ్‌సైట్ పారదర్శకంగా ఉండి, ఆసక్తిగల వెండర్లకు భారతీయ రైల్వేతో వ్యాపారం చేయడానికి స్పష్టమైన అవగాహన కల్పించేదిగా ఉండాలని నిర్ణయించారు. అవినీతి రహిత, పారదర్శక వాతావరణం రైల్వేలలో న్నదన్న విశ్వాసం కల్పించేవిధంగా వెబ్‌సైట్‌లో అవసరమైన సమాచారం అంతా ఉండాలని నిర్ణయించారు.
***
(Release ID: 1641276)
Visitor Counter : 257