ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అధిక క్రియాశీలక కేసులు ఉన్న తొమ్మిది రాష్ట్రాలలో కోవిడ్-19 నిర్వహణ అంశాన్ని సమీక్షించిన కేబినెట్ సెక్రటరీ
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో అత్యవసరంగా పరీక్షలు వేగవంతం చేయాలని కేంద్రం సలహా
- నియంత్రణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచండి మరియు సమర్థవంతమైన క్లినికల్ నిర్వహణను నిర్ధారించాలని సూచన
Posted On:
24 JUL 2020 8:21PM by PIB Hyderabad
కోవిడ్-19 విషయమై కేంద్రం మరియు రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య మేటి నిర్వహణ, చురుకైన, ప్రగతిశీల మరియు సమన్వయ వ్యూహం ఫలితంగా దేశంలో మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు మరింత పెరుగుతూ వస్తోంది. ఫలితంగా కోవిడ్ మరణాల రేటు తగ్గుతుంది. ఏదేమైనా, ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాలలో రోజువారీ క్రియాశీల కేసులలో నమోదు అధికంగా ఉంటోంది. కోవిడ్ నిర్వహణ దృక్కోణం నుండి ఆందోళన ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశంలో కోవిడ్-19 మహమ్మారిని సమర్థవంతంగా నియంత్రించడానికి మరియు నిర్వహించేందుకు గాను కేంద్ర-రాష్ట్ర సమన్వయ వ్యూహంలో భాగంగా అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్న తొమ్మిది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు మరియు ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతస్థాయి వర్చువల్ సమీక్షా సమావేశం జరిగింది.
వీసీలో పాల్గొన్న తొమ్మిది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, కర్ణాటక, జార్ఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి.
ఈ సమావేశంలో రాష్ట్ర నిర్దిష్ట కోవిడ్ ప్రతిస్పందన వ్యూహంతో పాటు ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రాల్లో కేస్-లోడ్ పెరగడానికి కారణమవుతున్న అంశాలపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్యాబినెట్ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శులు మరియు ఇతర రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. “టెస్ట్ ట్రాక్ ట్రీట్” వ్యూహానికి అనుగుణంగా, కట్టడి జోన్లపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
తక్కువ పరీక్షలపై ఆందోళన..
కొన్ని రాష్ట్రాల్లో తక్కువ పరీక్షలకు సంబంధించిన అంశంపై ఆందోళన చెందుతున్న అంశం ఈ సమావేశంలో హైలైట్ చేయబడ్డాయి. కేసులను ముందుగా గుర్తించడానికి మరియు సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి నిరంతర మరియు దూకుడుగా పరీక్షలు నిర్వహించడం చాలా ముఖ్యమైనదని పునరుద్ఘాటించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క మార్గదర్శకాల ప్రకారం కట్టడి జోన్ల యొక్క సత్వర మరియు సరైన వర్ణన యొక్క అవసరాన్ని కేబినెట్ కార్యదర్శి నొక్కి చెప్పారు; ఇంటెన్సివ్ కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి చురుకైన కేసుశోధన, తద్వారా ప్రసార గొలుసును సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసేందుకు ఇది దోహదం చేయనుంది. కట్టడి జోన్ల వెలుపల బఫర్ జోన్లు గుర్తించడం మరియు ఎస్ఏఆర్ఐ/ ఐఎల్ఐ కేసులపై నిరంతర నిఘా చేపట్టడం అవసరం.
సూచించిన నాణ్యమైన సంరక్షణ మరియు నిరంతరాయంగా రోగి నిర్వహణకు భరోసా ఇచ్చే క్లినికల్ ప్రోటోకాల్‌ల అమలుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన సంఖ్యలో పడకలు, ఆక్సిజన్ మరియు వెంటిలేటర్లతో సహా ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల లభ్యతపైనా రాష్ట్రాలు స్పష్టమైన దృష్టి పెట్టాలని సూచించారు.
అధిక-ప్రమాదం పొంచివున్న జనాభా మ్యాపింగ్ చేయాలి..
సున్నా తిరస్కరణ రేటుతో సమర్థవంతమైన అంబులెన్స్ నిర్వహణ ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో హైలైట్ చేయబడింది. మరణాల రేటును తక్కువగా ఉంచాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ కార్యదర్శి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇందుకోసం, అధిక-ప్రమాదం పొంచివున్న జనాభాను మ్యాపింగ్ చేయాలని ముఖ్యంగా వృద్ధులు మరియు వయో వృద్ధులు మరియు సహ-అనారోగ్యాలు ఉన్నవారిపై ప్రధానంగా దృష్టి పెడుతూ మ్యాపింగ్ చేయాలని సూచించారు. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు గాను వ్యాధిని ముందస్తుగా గుర్తించడం మరియు సకాలంలో క్లినికల్ మేనేజ్‌మెంట్ కీలకం అనే వాస్తవం రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది.
కోవిడ్-19కు సంబంధిత సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు మరియు సలహాలు మరియు ఇతర అన్ని ప్రామాణికమైన మరియు నవీకరించబడిన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా ఈ లింక్‌ను సందర్శించండి: https://www.mohfw.gov.in/ మరియు @MoHFW_INDIA.
కోవిడ్-19 కి సంబంధించిన సాంకేతిక ప్రశ్నలను technquery.covid19[at]gov[dot]in మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in మరియు ovCovidIndiaSeva కు పంపవచ్చు.
కోవిడ్-19 పై ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నెం.: + 91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) వద్ద కాల్ చేయండి. కోవిడ్-19 లోని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ సంఖ్యల జాబితా https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లో అందుబాటులో ఉంది.
****
(Release ID: 1641111)
Visitor Counter : 268
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada