ఆర్థిక మంత్రిత్వ శాఖ

దిల్లీ విమానాశ్రయంలో రూ.66 లక్షలకు పైగా విలువైన సిగరెట్లను పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

Posted On: 24 JUL 2020 7:28PM by PIB Hyderabad

చిత్ర హెచ్చరికలు లేకుండా విదేశీ సిగరెట్లను (3700 పెట్టెలు) అక్రమంగా రవాణా చేస్తున్న 13 మంది భారతీయులపై దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. వీరంతా, కొవిడ్‌ కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్నవారే. ఈనెల 23వ తేదీన ఉదయం 9.05 గంటలకు దుబాయ్‌ నుంచి దిల్లీకి ఈకే-510 విమానంలో వచ్చారు. గ్రీన్ ఛానల్ దాటిన తర్వాత, ఈ 13 మంది భారతీయ ప్రయాణీకులను అధికారులు పట్టుకున్నారు.

 

    కస్టమ్స్‌ చట్టం-1962లోని 110 సెక్షన్‌ ప్రకారం విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.66.60 లక్షలు.

    కస్టమ్స్‌ చట్టం-1962లోని 104 సెక్షన్‌ ప్రకారం, ఆ 13 మంది భారతీయులను అరెస్ట్‌ చేశారు. విచారణ కొనసాగుతోంది.

***
 


(Release ID: 1641033) Visitor Counter : 144