మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

"భారత్ లోనే ఉండండి భారత్ లోనే చదువుకోండి" గురించి మేథోమథన సమావేశం నిర్వహించిన కేంద్ర హెచ్ఆర్ డి మంత్రి

ఈ దిశగా అత్యధికంగా విద్యార్థులు భారత్ లోనే ఉండి భారత్ లోనే చదువుకునే లా చేపట్టాల్సిన చర్యలు, మార్గదర్శకాలను రూపొందించే కమిటీ కి నేతృత్వం వహిస్తున్న యూజీసీ చైర్మన్; పక్షం రోజుల్లో నివేదిక సమర్పించనున్న కమిటీ

Posted On: 24 JUL 2020 4:37PM by PIB Hyderabad

కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఈ రోజు న్యూ ఢిల్లీలో ఎంహెచ్‌ఆర్‌డికి సంబంధించిన సీనియర్ అధికారులు, అటానమస్ / టెక్నికల్ ఆర్గనైజేషన్స్ అధిపతులతో “ భారత్ లోనే ఉండండి భారత్ లోనే చదువుకోండి” గురించి మేథోమథనం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డి సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మోస్ కూడా హాజరయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ ఖరే, యుజిసి చైర్మన్, శ్రీ డి.పి. సింగ్, ఛైర్మన్, ఎఐసిటిఇ, శ్రీ అనిల్ సహస్రబుధే, జాయింట్ సెక్రటరీ (ఐసిసి) శ్రీమతి. నీతా ప్రసాద్ సెక్రటరీ జనరల్, ఎఐయు, శ్రీమతి. పంకజ్ మిట్టల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ, కోవిడ్-19 పరిస్థితి కారణంగా విదేశాలలో చదువుకోవాలనుకునే చాలా మంది విద్యార్థులు భారతదేశంలోనే ఉండి భారతదేశంలోనే చదువుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. చదువు పూర్తి చేయాలనే ఆందోళనతో భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఆయన తెలిపారు. ఈ రెండు వర్గాల విద్యార్థుల అవసరాలను పరిశీలించడానికి హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ పరిస్థితి ఆందోళన కలిగించే రెండు క్లిష్టమైన సమస్యలను ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.

1. విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థుల అవసరాలను తీర్చడం

                  భారతదేశంలోని ప్రధాన సంస్థలలో విద్యకు తగిన అవకాశాలను కల్పించడం ద్వారా వారిని నిలుపుకోవటానికి అవసరమైన కార్యక్రమాలు

 
           2. విదేశాల నుండి తిరిగి వచ్చే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం

    ఈ విద్యార్థులను వారి ప్రోగ్రాం పూర్తి చేయడానికి మద్దతు ఇవ్వడం 

ఈ సమస్యలకు వారి ప్రస్తుత, భవిష్యత్తు విద్యా అవసరాలు, కెరీర్ ప్రణాళికలపై సమగ్ర అవగాహన అవసరం, వీటివిషయంలో సకాలంలో జోక్యం చేసుకోవాలి. పైన పేర్కొన్న ప్రతి పరిస్థితుల్లోనూ వివిధ రకాల అవకాశాలూ ఉన్నాయి, సవాళ్లు ఉన్నాయి. అని కేంద్ర మంత్రి శ్రీ పొక్రియాల అన్నారు. 

2019 సంవత్సరంలో సుమారు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులు తమ చదువు కోసం విదేశాలకు వెళ్లారని, ఈ విలువైన విదేశీ మారకద్రవ్యం భారతదేశం నుంచి వెళ్లిపోవడంతో పాటు చాలా మంది తెలివైన  విద్యార్థులు విదేశాలకు వెళ్లారని మంత్రి చెప్పారు. అటువంటి విద్యార్థులకు భారతదేశంలో విద్యను అభ్యసించడానికి మనం అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. అలాగే, ఈ ప్రభుత్వ మ్యానిఫెస్టో ప్రకారం మనం 2024 నాటికి అన్ని ప్రధాన సంస్థలలో సీట్ల సామర్థ్యాన్ని 50% పెంచాలి, 2024 నాటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ 50 కి పెంచాలి అని కేంద్ర హెచ్ఆర్ డి మంత్రి వెల్లడించారు. 

ఈ సందర్భంగా సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే మాట్లాడుతూ విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి మూలకారణాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని అన్నారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు భారతదేశంలో ఉండటానికి వీలుగా సంస్థలలో భారతదేశంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.

ఉన్నత విద్య కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే మాట్లాడుతూ మూల కారణాలు చాలా ఉన్నాయని, సమస్యలను పరిష్కరించడానికి మనం అడుగడుగునా చర్యలు తీసుకోవాలని, స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అంతర్జాతీయ విద్యార్థులను భారతదేశానికి ఆకర్షించాలని అన్నారు. 

యుజిసి చైర్మన్ శ్రీ డి.పి.సింగ్ మాట్లాడుతూ మరిన్ని ట్వినింగ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీలను సృష్టించాలని, భారతదేశానికి తిరిగి రావాలనుకునే విద్యార్థులకు సరైన పరిశోధన సౌకర్యాలు కల్పించేలా చూడాలని అన్నారు.

ఎఐసిటిఇ చైర్మన్ శ్రీ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ, మొత్తం దృష్టాంతాన్ని అధ్యయనం చేసిన తరువాత తీసుకోవలసిన చర్యలకు సంబంధించి ఎఐసిటిఇ త్వరలో శ్వేతపత్రాన్ని తీసుకువస్తుందని చెప్పారు

 

సమావేశంలో తీసుకున్న మరి కొన్ని నిర్ణయాలు:

1. భారతదేశంలో అధ్యయనం కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడే ఉండేలా మార్గదర్శకాలు, చర్యలను సిద్ధం చేయడానికి చైర్మన్ యుజిసి ఒక కమిటీకి నేతృత్వం వహిస్తారు. బాగా పనిచేసే విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల చేరికలు పెంచడానికి ఒక విధానం రూపొందిస్తారు. విభిన్న అంశాల్లో వినూత్న కార్యక్రమాలు, జంట, ఉమ్మడి డిగ్రీ కార్యక్రమాలు, విదేశాలలో ప్రముఖ అధ్యాపకుల ఆన్‌లైన్ ఉపన్యాసాలను సులభతరం చేయడం, అకాడెమియా పరిశ్రమల మధ్య అనుసంధానం, జాయింట్ డిగ్రీ వెంచర్లను సులభతరం చేయడం భారతీయ ఉన్నత విద్య సంస్థల్లో లాటరల్ ఎంట్రీ అవకాశాలు, కొత్త విధానాలలో రూపొందించేలా చర్యలు చేపడతారు. 

2. ఛైర్మన్ ఎ.ఐ.సి.టి.ఇ సాంకేతిక సంస్థలకు సంబంధించిన సమస్యలను పర్యవేక్షిస్టారు. 

3. ఛైర్మన్ యుజిసి మరియు ఛైర్మన్ ఎఐసిటిఇలకు సహాయపడేలా ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, సిఓఎ కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో కూడిన ప్రత్యేక ఉప కమిటీలను ఏర్పాటు చేస్తారు.

4. చైర్మన్ ఎన్‌టిఎ, ఛైర్మన్ సిబిఎస్‌ఇలను విద్యారంగంలో వారి అనుభవాన్ని చూసే ఇన్‌పుట్‌ల కోసం కూడా పిలుస్తారు. సంయుక్త కార్యదర్శి (అంతర్జాతీయ సహకారం) ఎంహెచ్ఆర్ డి  వైపు నుండి సమన్వయం చేస్తారు. కమిటీ పక్షం రోజుల్లో నివేదికను సమర్పించనుంది.

*****


(Release ID: 1640975) Visitor Counter : 239