రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు
Posted On:
23 JUL 2020 3:01PM by PIB Hyderabad
భారత సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ (పీసీ) మంజూరు చేయడానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రభుత్వ అనుమతి లేఖను విడుదల చేసింది. సైన్యంలో మహిళలు పెద్ద పాత్రలను పోషించడానికి మహిళా అధికారులకు అధికారం ఇవ్వడాన్ని ఇది సుగమం చేయనుంది. భారత సైన్యంలోని మొత్తం పది విభాగాలలో షార్ట్ సర్వీస్ కమీషన్డ్ (ఎస్‌ఎస్‌సీ) మహిళా అధికారులకు పీసీ మంజూరు చేయాలని ఈ ఉత్తర్వులో పేర్కొంది. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ), సిగ్నల్స్, ఇంజినీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఈఎంఈ), ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఏఎస్‌సీ), ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ)తో పాటుగా ఇప్పడున్న జడ్జి అండ్ అడ్వకేట్ జనరల్ (జాగ్) మరియు ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ (ఏఈసీ) కు అదనంగా ఆర్మీ ఇంటెలీజెన్స్ కార్ప్స్ లో కూడా మహిళలకు మరింత మెరుగైన పాత్రను పోషించి సేవలందించే అవకాశం లభించనుంది. దీనికి తోడు ఆర్మీ ప్రధాన కార్యాలయం బాధిత మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ సెలక్షన్ బోర్డును ఏర్పాటు చేసి నిర్వహించడానికి అనేక సన్నాహక చర్యలను ప్రారంభించింది. సంబంధిత ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులు అందరూ తమ ఆప్షన్‌ను వినియోగించుకుని, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసిన వెంటనే సెలక్షన్ బోర్డు షెడ్యూల్ చేయబడుతుంది. మహిళా అధికారులతో సహా అందరికీ సమాన అవకాశాలను కల్పించడానికి భారత సైన్యం కట్టుబడి ఉంది.
****
(Release ID: 1640768)
Visitor Counter : 235