ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వ్యక్తిగతేతర డాటా ఫ్రేమ్‌వర్కుపై ప్రజలనుంచి అభిప్రాయాలను కోరిన నిపుణుల కమిటీ
Posted On:
23 JUL 2020 5:50PM by PIB Hyderabad
వ్యక్తిగతేతర డాటా గవర్నెన్సు ఫ్రేమ్‌వర్కుకు సంబంధించిన నిపుణుల కమిటీ డాటా గవర్నెన్సుకు సంబంధించిన వివిధ అంశాలపై వర్చువల్ కాన్ఫరెన్సు ద్వారా మీడియా సమావేశం నిర్వహించింది. కమిటీకి సంబంధించిన ఇతర సభ్యుల సమక్షంలో ఈ సమావేశానికి శ్రీ క్రిస్ గోపాల కృష్ణన్ అధ్యక్షత వహించారు. వ్యక్తిగతేతర సమాచారానికి సంబంధించి అభివృద్ది చెందుతున్న,పలు వినూత్న ఆలోచనలను, కొత్త భావనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వ్యక్తిగతేతర డాటాకు సంబంధించిన నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నించడం, కమ్యూనిటీ డాటా అంశం, డాటాపై తగిన హక్కులు, అధికారాలు,పబ్లిక్,కమ్యూనిటీ, ప్రైవేటుకు సంబంధించి న నిర్వచనాలు, కొత్తగా డాటా బిజినెస్ భావన,ఒపెన్ యాక్సెస్ మెటా డాటా రిజిస్టర్లు, డాటా అనానిమైజేషన్‌కు అంగీకారం, వ్యక్తిగతేతర సమాచార సున్నితత్వం, సార్వభౌమాధికార అవసరంగా డాటా భాగస్వామ్యం, కీలక ప్రజా ప్రయోజనాలు, ఆర్ధిక ప్రయోజనాలు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మీడియా నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు. ముడి సమాచారం , నిర్వచిత సమాచారాన్ని పంచుకోవడం, వ్యక్తిగతేతర డాటా కు సంబంధించిన రెగ్యులేటరీ అంశాలు, డాటా ఆర్థిక విలువ, డిజిటల్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్కుకు సంబంధించిన వివిధ చట్టపరమైన అంశాలను భారతీయ ప్రజలకు , సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా వాడడం , వ్యక్తిగతేతర డాటాను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం తదితర అంశాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.
ముసాయిదా నివేదికపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులలో మరింత మంది స్టేక్ హోల్డర్లు పాల్గొనేలా ప్రోత్సహించాల్సిందిగా నిపుణుల కమిటీ మీడియాను కోరింది. ముసాయిదా నివేదికపై అభిప్రాయాలు తెలిపేందుకు చివరి తేదీ2020 ఆగస్టు 13
https://www.mygov.in/task/share-your-inputs-draft-non-personal-data-governance-framework/
(Release ID: 1640741)
Visitor Counter : 181