రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సీఎంవీఆర్ క్రింద టైర్లు, సేఫ్టీ గ్లాస్, బాహ్య అంచనాలు మొదలైన వాటి నిబంధనలను నోటిఫై చేసిన ఎంఆర్‌టీహెచ్
Posted On:
22 JUL 2020 12:16PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్‌టీహెచ్) జూలై 20, 2020 నాటి జీఎస్ఆర్ 457(ఈ) ద్వారా సీఎంవీఆర్ 1989లో ఈ కింద పేర్కొన్న సవరణలను చేసిందిః
- గరిష్ఠంగా 3.5 టన్నుల వరకు బరువు ఉన్న వాహనాలకు 'వాహన టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్' (టీపీఎంఎస్) యొక్క స్పెసిఫికేషన్ తెలియజేయబడింది. ఇది టైర్‌లో గాలితో నింపిన ఒత్తిడిని లేదా వాటిలోని వైవిధ్యాన్ని పర్యవేక్షిస్తుంది. వాహనం నడుస్తున్నప్పుడు మరియు ఇతర సమయాల్లోనూ టైర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇది డ్రైవర్‌కు తెలియజేస్తుంది. ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. వాహనంలో దీనిని అమర్చినట్లయితే డ్రైవర్ మరియు రహదారి భద్రతను మెరుగుపరిచే విధంగా ఇది తోడ్పడుతుంది.
సూచించబడిన టైర్ రిపేర్ కిట్: టైర్ పంక్చర్ (ట్యూబ్ లెస్ టైర్) జరిగినప్పుడు మరమ్మతుకు ఈ కిట్ ఉపయోగపడుతుంది. టైర్‌పై పంక్చర్ జరిగిన ప్రదేశంలో ఎయిర్‌సీల్‌తో పాటుగా ప్రత్యేక రసాయన లేపనంను టైర్ లోకి పోయడం వల్ల అందులో ఏర్పడిన రంధ్రం మూసుకుంటుంది.టైర్ రిపేర్ కిట్ మరియు టీపీఎంఎస్ అందుబాటులో ఉన్నట్టయితే సదరు వాహనాల్లో అదనపు టైర్ల అవసరం తొలగించబడుతుంది. దీంతో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం విద్యుత్ వాహనాలలో బ్యాటరీలను ఉంచడానికి ఎక్కువ స్థలాన్ని అనుమతిస్తుంది. భద్రతా గ్లాస్‌కు ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా గ్లేజింగ్‌ను చేర్చుకోవడం ఐచ్చికమని సూచించడమైనది. అయితే వీటికి కూడా అంతకు ముందు భద్రతా గ్లాసు మాదిరిగానే దృశ్య ప్రసారం శాతం వెనుక కిటికీలకు (70%) మరియు సైడ్ విండోస్ (50%) ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం, ద్విచక్ర వాహనాల స్టాండ్‌లు అంశం ఇందులో నియంత్రించబడలేదు. వీటికి సంబంధించి ఏఐఎస్ ప్రమాణాలు ఇప్పటికే సూచించబడినందున.. వీటి నియంత్రణ విషయాన్ని ఇందులో జోడించలేదు. దీనికి తోడుగా.. సీఎంవీఆర్ కింద ద్విచక్ర వాహన బాహ్య అంచనాల అవసరాలకు సంబంధించి ఎలాంటి ప్రమాణం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఇది ఇప్పుడు పాదచారులకు మరియు కదిలే వాహనంతో కాంటాక్ట్ రైడర్‌కు లేస్రేషన్లను తగ్గించేలా సూచించబడింది. పరీక్షా పరికరంతో కాంటాక్ట్ చేసే అన్ని రకాల పాయింట్లు కనీసం సూచించిన వ్యాసార్థంతో లేదా మృదువైన పదార్థంతో తగిన విధంగా తయారు చేయబడాలని తాజా ప్రమాణం సూచిస్తుంది. ద్విచక్ర వాహన ఫుట్ రెస్ట్‌కు సంబంధించి ఉండాల్సిన తగిన ప్రామాణికాలలో నోటిఫై చేయబడ్డాయి. ద్విచక్ర వాహనాలలో పిలియన్ రైడర్ విస్తరణ సౌకర్యం అనుమతించేందుకు ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేయడమైనది. పిలియన్ రైడర్ స్థలం వెనుక ఒక వేళ తేలికపాటి కంటైనర్ ఉంచబడినట్టయితే వాటికి సంబంధించిన కొలతలు మరియు స్థూల వాహన బరువుకు (వాహన తయారీదారు ద్వారా పేర్కొన్నది మరియు పరీక్షా ఏజెన్సీ ఆమోదించినట్లు) ప్రమాణాలను సూచించడమైనది. సాగుకు వాడే వ్యవసాయ ట్రాక్టర్ కోసం మెకానికల్ కప్లింగ్ వ్యవస్థను ఐచ్ఛిక వస్తువుగా అందించినట్లయితే వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ సూచించబడినాయి.
***
(Release ID: 1640470)
Visitor Counter : 211