నీతి ఆయోగ్

భారత్-అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంలో సుస్థిర వృద్ధి మూలం ముఖ్య విజయాలు, కార్యాచరణ ప్రణాళిక

Posted On: 21 JUL 2020 7:16PM by PIB Hyderabad

భారత్ అమెరికా దీర్ఘకాల ఇంధన సహకారాన్ని కలిగి ఉన్నాయి. 2017 జూన్ లో, గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ ఎనర్జీ పార్టనర్‌షిప్ (ఎస్‌ఇపి) ప్రకటన ద్వారా ద్వైపాక్షిక ఇంధన సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను బలోపేతం చేశారు. దీనిపై మొదటి మంత్రిత్వ స్థాయిల సమావేశం 2018 ఏప్రిల్‌లో జరిగింది. చమురు-వాయువు, విద్యుత్-ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక-సుస్థిర వృద్ధి: ఇవి భారత్-అమెరికా వ్యూహాత్మక శక్తి భాగస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి వ్యవస్థకు నీతి ఆయోగ్, యుఎస్ఎయిడ్ సహ అధ్యక్షులుగా ఉన్నాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇంధన కార్యదర్శి డాన్ బ్రౌలెట్ సంయుక్తంగా అధ్యక్షతన 2020 జూలై 17 న జరిగిన ఎస్ఈపి మంత్రిత్వ స్థాయి సంభాషణ సందర్భంగా సుస్థిర వ్యవస్థల కీలక విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ మూల వ్యవస్థ మూడు కేంద్రక ప్రాంతాలు: విద్యుత్ డేటా నిర్వహణ; విద్యుత్ మోడలింగ్; తక్కువ కార్బన్ టెక్నాలజీల ప్రచారం లో సహకరించడానికి భారతీయ, అమెరికన్ పరిశోధకులు, నిర్ణయాలు తీసుకునే అధికారులను ఒకచోట చేర్చుతుందని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి, సుస్థిర అభివృద్ధి వ్యవస్థ ఇండియా కో-చైర్ డాక్టర్ రాకేశ్ సర్వాల్ పేర్కొన్నారు: . సుస్థిర వృద్ధి వ్యవస్థ మూడు రంగాలలో గణనీయమైన పురోగతిని గుర్తించారు. 

ఎనర్జీ డేటా మేనేజ్‌మెంట్: ఆన్‌లైన్‌లో, ఎపిఐ ఇంటిగ్రేషన్ ద్వారా డేటా ఇన్‌పుట్‌ను అందించడంతో 2015 లో ప్రారంభించిన ఇండియా ఎనర్జీ డాష్‌బోర్డ్ పునరుద్ధరించారు. ఈ కసరత్తుకి మరింత ఊతం ఇవ్వడానికి, ఇంధన అవసరాలు, సరఫరా రంగాలపై  నీతి ఆయోగ్ ఎనిమిది ఉప సమూహాలను రూపొందించింది. ధృఢమైన ఇంధన డాష్‌బోర్డ్‌ను రూపొందించడానికి భారత్-యుఎస్ ఏజెన్సీలు సహకరిస్తాయి.
ఎనర్జీ మోడలింగ్: ఇంధన-నీరు మధ్య బంధం, రవాణా రంగం డీకార్బరైజేషన్ పై నిర్వహించిన రెండు కసరత్తులు కీలక అంశాలను వెల్లడించాయి, విధాన పరమైన సలహాలను అందించాయి. నీతి ఆయోగ్, యుఎస్ఎయిడ్ సంయుక్తంగా 2020 జులై 2న ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరంను  ప్రారంభించాయి. ఈ ఫోరమ్ అమెరికా-భారత పరిశోధకులు, నాలెడ్జ్ పార్టనర్స్, మేథావులు, జాతీయ అంతర్జాతీయ, మోడలింగ్, దీర్ఘకాలిక ఇంధన ప్రణాళిక కసరత్తు కోసం ప్రభుత్వ సంస్థలు, విభాగాలను భాగస్వామ్యం చేస్తుంది.
తక్కువ కార్బన్ సాంకేతికతలు: భారతదేశంలో తక్కువ కార్బన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి సంబంధిత ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థల ద్వారా పాల్గొనడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

సుస్థిర వృద్ధి వ్యవస్థ సమావేశం గురించి ఆసియా బ్యూరో, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్, ఈ వ్యవస్థ యుఎస్ కో-చైర్, డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ జేవియర్ పిడ్రా మాట్లాడుతూ, ఇంధన డేటా మేనేజ్‌మెంట్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇరుపక్షాల ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ఇంధన డేటా లభ్యత, ప్రాప్యత, యుఎస్ ఏజెన్సీలతో మరింత లోతైన సహకారంతో అనుగుణ్యత. సస్టైనబుల్ గ్రోత్ వ్యవస్థ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మోడలింగ్ ఫోరంతో సహకారాన్ని సులభతరం చేయడం ద్వారా ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరం కు  మద్దతు ఇస్తుంది. ఫోరమ్ క్రింద ఇంధన పర్యావరణ నిర్ణయాధికారానికి మద్దతుగా కొత్త బహుళ-బృంద ఉమ్మడి పరిశోధన అధ్యయనాలను ప్రారంభిస్తుంది.

కోవిడ్ -19 మానవ స్ఫూర్తికి, మన దేశాల మధ్య భాగస్వామ్యానికి సవాలుగా నిలిచిందని గుర్తించారు.  ఏదేమైనా, సవాళ్లు ఎల్లప్పుడూ కొత్త మార్గాలను రూపొందించడానికి, వినూత్న పరిష్కారాలను కనుగొనటానికి అవకాశాలను కల్పిస్తాయి. భారత్-అమెరికా ప్రయోజనాల కోసం స్థిరమైన వృద్ధి వ్యవస్థల క్రింద ఉత్తమ పద్ధతులు, కొత్త పరిష్కారాలను పంచుకోవడంపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. ఇది భారత్-అమెరికా మధ్య విజయవంతమైన వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి వేదికగా నిలిచింది.

*****



(Release ID: 1640297) Visitor Counter : 209