రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత వైమానిక దళ అమ్ములపొదిలోకి రఫేల్‌

Posted On: 20 JUL 2020 8:10PM by PIB Hyderabad

తొలి దశకు చెందిన ఐదు భారత వైమానిక దళ రఫేల్‌ యుద్ధ విమానాలు ఈ నెల చివరి నాటికి అందనున్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి, ఈనెల 29 తేదీన అంబాలా వైమానిక దళ స్థావరంలో ఇవి వైమానిక దళంలో చేరతాయి. ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదు. ఆగస్టు మధ్యలో 'చివరి చేరిక కార్యక్రమం' ఉంటుంది. అప్పుడు మీడియా మొత్తాన్నీ అనుమతిస్తారు.

    ఈ యుద్ధ విమానంపై, దీనిలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థపై ఐఏఎఫ్‌ పైలెట్లు, క్షేత్ర సిబ్బంది సమగ్ర శిక్షణ పొందారు. వీటిని నడిపేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు. వీటి రాక తర్వాత, ఈ విమానాలను సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి దింపేందుకు ప్రయత్నిస్తారు. 

***



(Release ID: 1640072) Visitor Counter : 234