రక్షణ మంత్రిత్వ శాఖ
"మేక్ ఇన్ ఇండియా"కు అతిపెద్ద ప్రోత్సాహం; టి-90 యుద్ధ ట్యాంకుల కోసం 1512 మైన్ ప్లౌగ్‌ల తయారీకి 'బీఈఎంఎల్'తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం
Posted On:
20 JUL 2020 6:21PM by PIB Hyderabad
'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యంతో, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదంతో, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)తో రక్షణ శాఖ సేకరణల విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. టి-90 ఎస్/ఎస్‌కే యుద్ధ ట్యాంకుల కోసం 1512 మైన్ ప్లౌగ్ (ఎంపీ)ల తయారీకి, రూ.557 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఒప్పందం కుదిరింది. ఎంపీల తయారీలో కనీసం 50 శాతం దేశీయ ముడిసరుకు ఉండాలన్నది ఒప్పందంలో భాగం.
భారత టి-90 యుద్ధ ట్యాంకులకు ఈ మైన్ ప్లౌగ్‌లను అమరుస్తారు. మైన్స్ ఉన్న ప్రాంతాల్లో సంచరించేటప్పుడు, ట్యాంకుల గమనాన్ని ఇవి సులభతరం చేస్తాయి. యుద్ధ ట్యాంకుల మోహరింపులు అనేక రెట్లు పెరుగుతాయి. మైన్ల బారిన పడకుండా, శత్రు భూభాగం లోపలకు చొచ్చుకెళ్లి దాడులు జరిపే పరిధి మెరుగవుతుంది.
ఈ 1512 మైన్ ప్లౌగ్‌ల అమరిక 2027 నాటికి పూర్తి కావాలన్నది ప్రణాళిక. వీటి చేరికతో, భారత సైన్య యుద్ధ సామర్థ్యం మరింత మెరుగవుతుంది.
(Release ID: 1640010)
Visitor Counter : 277