ఆర్థిక మంత్రిత్వ శాఖ

సిబిడిటి 2020 జూలై 20 నుండి 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను స్వచ్ఛందంగా వర్తింపజేయడంపై ఈ-ప్రచారాన్ని ప్రారంభించనుంది

Posted On: 18 JUL 2020 6:23PM by PIB Hyderabad

2020 జూలై 20, సోమవారం నుండి పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను స్వచ్ఛందంగా పాటించడంపై ఈ-ప్రచారాన్ని ప్రారంభించడానికి ఆదాయపు పన్ను శాఖ సిద్ధం అయింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్స్ దాఖలు చేయని వారు , రాబడిలో వ్యత్యాసాలు / లోపం కలిగి  ఉన్న మదింపుదారులు / పన్ను చెల్లింపుదారుల లక్ష్యంగా  2020 జూలై 31 తో ముగిసే 11 రోజుల ప్రచారం చేపట్టాలని సంకల్పించింది.

ఆదాయపు పన్ను శాఖలో  అందుబాటులో ఉన్న పన్ను / ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ధృవీకరించుకునే పన్ను చెల్లింపుదారులకు తగు అవకాశం కలిపించాలని, ముఖ్యంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి అస్సెస్సీలకు, స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడానికి జరుగుతున్నది ఈ ప్రయత్నం. తద్వారా వారు నోటీసు అందుకోవడం, వారి వివరాలు సునిశిత పరిశీలనకు వెళ్లడాన్ని నివారించాలన్నదే ఉద్దేశం. 

పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసం ఈ ఈ-ప్రచారం నడుస్తోంది. ఈ-ప్రచారం కింద, ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన పన్ను చెల్లింపుదారులకు వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించడానికి ఐటి శాఖ వివిధ వనరులు...స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ లావాదేవీల (ఎస్ఎఫ్టి), టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టిడిఎస్), పన్ను వసూలు వద్ద మూలం (టిసిఎస్), విదేశీ చెల్లింపులు (ఫారం 15 సిసి) మొదలైనవాటిని వినియోగిస్తుంది. జిఎస్‌టి, ఎగుమతులు, దిగుమతులు, సెక్యూరిటీలు, ఉత్పన్నాలు, వస్తువులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు. 

అస్సెస్మెంట్ ఇయర్ 2019-20 (2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది) కోసం రిటర్నులు దాఖలు చేయని అధిక విలువ కలిగిన లావాదేవీలతో కొంతమంది పన్ను చెల్లింపుదారులను డేటా విశ్లేషణ గుర్తించింది. దాఖలు చేయని వారితో పాటు, రిటర్న్ దాఖలు చేసిన వారి మరొక విభాగం కూడా గుర్తించారు, వీరు చేసిన దాఖలులో అధిక విలువ లావాదేవీలు వారి ఆదాయపు పన్ను రిటర్న్‌కు అనుగుణంగా కనిపించలేదు.

కాబట్టి ఈ-ప్రచారం వల్ల పన్ను చెల్లింపుదారులు వారి అత్యధిక విలువ గల లావాదేవీల వివరాలను కూడా సంబంధిత పోర్టల్ లో పొందవచ్చు. అలాగే ఆన్ లైన్ లోనే వారి స్పందన ను  తగు ఆప్షన్ ని ఎంపిక చేశాయికుని తెలియ జేయవచ్చు. ప్రతిస్పందన ను ఆన్ లైన్ లో దాఖలు చేస్తున్నారు కాబట్టి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. 

అస్సెస్మెంట్ సంవత్సరం 2019-20 (2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంవత్సరానికి సంబంధించి) ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడం కానీ, రివైజ్ చేయడానికి కానీ చివరి తేదీ 2020 జులై 31వ తేదీ. పన్ను చెల్లింపు దారులు తమ సౌలభ్యం, ప్రయోజనం కోసం ఈ-ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఆదాయపు పన్ను విజ్ఞప్తి చేసింది. 

****



(Release ID: 1639698) Visitor Counter : 244