ఆర్థిక సంఘం

పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్నువిషయమై గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమావేశమైన - ఆర్థిక సంఘం.

మునిసిపాలిటీలకు 4 శాతం సంక్రమణ (ప్రాప్తి) పెంచాలని సిఫార్సు చేసిన - గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

Posted On: 17 JUL 2020 5:33PM by PIB Hyderabad

పట్టణ స్థానిక సంస్థల (యు.ఎల్.‌బి.ల) ఆస్తిపన్నుతో సహా వివిధ అంశాలపై, కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.యు.ఏ) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మరియు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో, పదిహేనవ ఆర్థిక సంఘం ఈ రోజు సమావేశం నిర్వహించింది.  2020-21 సంవత్సరానికి కమిషన్ చేసిన సిఫార్సుల్లో భాగంగా,  ఆస్తిపన్ను యొక్క ఫ్లోర్ రేట్లను తెలియజేయాలనీ, ఆ తరువాత ఆయా రాష్ట్రాల స్వంత జి.ఎస్.డి.పి. వృద్ధి రేటుతో సమానంగా ఆస్తి పన్ను సేకరణలో స్థిరమైన అభివృద్ధిని చూపించాలనీ, రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.   

ఈ విషయానికి ఉన్న ఆర్థిక ప్రాముఖ్యత నేపథ్యంలో మరియు ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సందర్భంలో,  సమర్థవంతమైన ఆస్తి పన్ను నిర్వహణలో రాష్ట్రాలు, పట్టణ స్థానిక సంస్థలకు సహాయపడటంతో పాటు, ప్రబలంగా ఉన్న తక్కువ అంచనా, అరుదైన సమాచారం, అసంపూర్ణ ఆస్తి రిజిస్టర్లు, విధాన లోపం, అసమర్థమైన పరిపాలన, మరియు ప్రగతిశీల, తేలికైన, అందరికీ సమానమైన పన్ను మదింపు విధానాలతో తగిన ఆర్థిక కడస్ట్రాల్ ద్వారా సరిదిద్దాలి వంటి వివిధ అంశాలపై కమిషన్ విస్తృతంగా చర్చలు జరిపింది. 

ఆస్తిపన్ను నిర్వహణకు సంబంధించి యు.ఎల్.‌బి.లకు ప్రధాన పాత్ర ఇచ్చి, ‘అనుకూల వాతావరణాన్ని’ సృష్టించడం మరియు ప్రభుత్వంలోని వివిధ సంవత్సరాల్లో విధుల యొక్క నకిలీ, అతివ్యాప్తి లేదా విచ్ఛిన్నతను తొలగించడం వంటి అంశాల చుట్టూ ఈ సమావేశం లో జరిగిన చర్చలు కేంద్రీకృతమయ్యాయి.   సంబంధిత సమాచారం సేకరణ, విలువ కట్టడం లేదా మదింపు చేయడం, పన్ను రేట్లు నిర్ణయించడం, పన్ను వసూలు చేయడం వంటి ఈ అంశాలన్నింటిపై అవసరమైన పర్యవేక్షణకు యు.ఎల్.‌బి.లను బాధ్యత వహించడంపై కూడా దృష్టి కేంద్రీకరించబడింది.

2020-2021 నుండి 2025-2026 వరకు 15వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రయోజనం కోసం గృహనిర్మాణం, పట్టాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా 15వ ఆర్ధిక సంఘానికి ఒక వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు, అనంతరం గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సవరించిన విజ్ఞాపన పత్రాన్ని కూడా అయన 15వ ఆర్ధిక సంఘానికి సమర్పించారు.  కొన్ని ఆర్థికేతర మరియు ఆర్థిక సిఫారసులతో సహా, మంత్రిత్వ శాఖ అనేక వరుస సిఫార్సులను చేసింది.

కమిషన్‌ కు మంత్రిత్వ శాఖ చేసిన ఆర్థికేతర సిఫార్సులలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి :

*     ఆస్తిపన్ను తప్పనిసరి పరిస్థితుల్లో మార్పు.

*     వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి నగరాలకు పరిసర గాలి నాణ్యత మంజూరు.

*     ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సరఫరా మొదలైన వాటితో సహా నగరాలు వాటి అవసరం మరియు ప్రాధాన్యత ప్రకారం పనిని చేపట్టడం కోసం - టైడ్ గ్రాంట్లు. 

*     ప్రజారోగ్య మౌలిక సదుపాయాల కోసం యుఎల్‌బిలకు ప్రత్యేక నిధులతో సహా, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా చర్యలకోసం కేంద్ర పన్నుల్లో 9.4 శాతం.

*     ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, నియంత్రణ బోర్డు ఏర్పాటు, ఖాతాల ఆడిటింగ్ వంటి పట్టణ సంస్కరణల కొనసాగింపు.

*     86 నగర సమూహాలలో ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్ప్రేరక జోక్యం, ఇందులో దేశవ్యాప్తంగా 3,331 నగరాలు ఉన్నాయి, పౌర సేవల పంపిణీని మెరుగుపరచడానికి మరియు ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి భాగస్వామ్య మునిసిపల్ సేవలను అమలు చేయడం వంటివి.

కమిషన్‌ కు మంత్రిత్వ శాఖ చేసిన ఆర్థిక సిఫార్సులలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి :

*     మునిసిపాలిటీల వనరుల అంతరాన్ని తగ్గించడం - మునిసిపల్ స్థాయి వనరులకు గ్రాంట్లలో గణనీయమైన పెరుగుదల మరియు మునిసిపాలిటీలకు కనీసం నాలుగు రెట్లు సంక్రమణ (ప్రాప్తి)ని  పెంచడం.

*     ఖాతాల మెరుగైన నిర్వహణ కోసం గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద 213 కోట్ల రూపాయల వ్యయంతో  ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయడం. 

*     450 కోట్ల రూపాయల వ్యయంతో సంస్థాగత సామర్థ్యాల నిర్మాణం. 

విజ్ఞాపన పత్రంలో మంత్రిత్వ శాఖ పేర్కొన్న అంశాలు (సంగ్రహంగా) : 

*     పట్టణ మునిసిపల్ సంస్థలకు కేటాయింపులో పెంపు : 87,143 కోట్ల రూపాయల నుంచి 3,48,575 కోట్ల రూపాయలు. 

*     మునిసిపల్ ఖాతాలను రాష్ట్ర మరియు కేంద్ర ఖాతాలతో సమన్వయం చేయడం మరియు సమగ్రపరచడం : ఇందుకు అవసరమైన నిధులు 213 కోట్ల రూపాయలు. 

*     86 నగర సమూహాలలో సొంత ఆదాయాల పెంపు, మునిసిపల్ రుణాలు మరియు భాగస్వామ్య మునిసిపల్ సేవలు :  ఇందుకు అవసరమైన నిధులు 450 కోట్ల రూపాయలు. 

*     ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు పట్టణ ప్రజారోగ్య మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక గ్రాంట్.

*     ఎమ్.ఓ.ఈ.ఎఫ్. & సి.సి. కి మిలియన్ + నగరాలలో పరిసర గాలి నాణ్యతను నియంత్రించడానికి ప్రత్యేక గ్రాంట్.

6 రాష్ట్రాల (గుజరాత్, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్) నుండి ప్రాంతీయ ప్రాతినిధ్యంతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సలహా సంఘం ఏర్పాటు గురించి కూడా మంత్రిత్వ శాఖ కమిషన్‌కు తెలియజేసింది.  ఈ సలహా సంఘానికి అవసరమైన సహకారం అందించడానికి ఈ 6 రాష్ట్రాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శులతో ఒక సారధ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు.  ఆస్తిపన్ను క్షేత్ర స్థాయి అధ్యయనం కోసం జనాగ్రహ ను  నియమించడం జరిగింది.  చట్టాలు, విధానాలు మరియు క్షేత్ర స్థాయి కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులను గుర్తించడం జరిగింది. 

2020-2021 నుండి 2025-2026 వరకు తమ నివేదికలో ప్రభుత్వానికి తుది సిఫారసు చేసేసమయంలో మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సిఫార్సులు మరియు సమస్యలను పరిశీలిస్తామని కమిషన్ హామీ ఇచ్చింది.

*****



(Release ID: 1639472) Visitor Counter : 174