వ్యవసాయ మంత్రిత్వ శాఖ
జూలై 16 వరకు 3.5 లక్షల హెక్టార్లలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు
- రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రామ్‌సర్ ప్రాంతంలో ఈ రోజు హెలికాప్టర్ ద్వారా
మిడుతల నిరోధక ఆపరేషన్ చేపట్టిన ఐఏఎఫ్
Posted On:
17 JUL 2020 5:17PM by PIB Hyderabad
ఈ ఏడాది ఏప్రిల్ 11 నుండి జూలై 16 వరకు మిడుతల నియంత్రణ సర్కిల్ కార్యాలయాలు (ఎల్‌సీఓ) ద్వారా రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాలందు 1,76,055 హెక్టార్ల ప్రాంతంలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు జరిగాయి. గత గురువారం వరకు (16వ తేదీ వరకు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో 1,76,026 హెక్టార్లలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు జరిగాయి.
2020 జూలై 16, 17 మధ్య రాత్రి తొమ్మిది జిల్లాల్లోని 23 ప్రదేశాలలో మిడుతల నియంత్రణ కార్యకలాపాలు జరిగాయి. బార్‌మెర్, జోధ్‌పూర్, బికనీర్, నాగౌర్, చురు, ఝున్‌ఝునూ, సికార్, జలోర్ మరియు రాజస్థాన్‌కు చెందిన సిరోహి మరియు గుజరాత్‌లోని కచ్ జిల్లా ఎల్‌సీఓల ద్వారా ఈ కార్యకలాపాలు జరిగాయి.
అంతేకాకుండా, సంబంధిత రాష్ట్ర వ్యవసాయ శాఖలు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో 2 ప్రదేశాలలో మరియు రాజస్థాన్‌లోని పాలి జిల్లాలోని 01 ప్రదేశాలలో జూలై 16, 17 మధ్య రాత్రి మిడుతల చిన్న సమూహాలపై మరియు చెల్లాచెదురు అయిన మిడుతలకు వ్యతిరేకంగా నియంత్రణ కార్యకలాపాలను నిర్వహించాయి.
ఈ రోజు ఐఏఎఫ్‌కు చెందిన హెలికాప్టర్ రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రామ్‌సర్ ప్రాంతంలో మిడుతల వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టింది.
(ఎ) రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని దంగియావాస్‌లోని బిసాల్‌పూర్ వద్ద ఈ నియంత్రణ ఆపరేషన్
(బీ) ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని పురాన్‌పూర్ వద్ద డ్రోన్ ఆధారిత నివారణ చర్యలు
(సీ) రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని డీచూ, థాడా వద్ద నియంత్రణ ఆపరేషన్
(డీ) రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని దంగియావాస్‌లో ఈ నియంత్రణ ఆపరేషన్ చర్యలు
(ఈ) రాజస్థాన్‌లోని బికనీర్‌లోని నోఖా వద్ద మృతిచెందిన మిడుతలు
(ఎఫ్) రాజస్థాన్ లోని చుర్‌లోని అమర్సర్ వద్ద మృతిచెందిన మిడుతలు
ఈ రోజు (17.07.2020) అపరిపక్వ గులాబీ మిడుతలు మరియు వయోజన పసుపు మిడుతలు రాజస్థాన్‌లోని బార్మెర్, జోధ్‌పూర్, బికనీర్, నాగౌర్, చురు,
ఝున్‌ఝునూ, సికార్, జలోర్ మరియు సిరోహి జిల్లాలలోను గుజరాత్‌లోని కచ్ జిల్లాలోను మరియు ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాల్లోను చురుకుగా ఉన్నాయి.
***
(Release ID: 1639457)
Visitor Counter : 168