పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఆవిష్క్రత ఆలోచనలతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

Posted On: 17 JUL 2020 2:30PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ 'ఉద్యమి ఉత్సవ్‌'లో పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణ, వ్యవస్థాపకత స్ఫూర్తిని వేడుకలా జరుపుకునే వర్చువల్ కార్యక్రమం ఇది. యువ పారిశ్రామికవేత్తల్లో ఆవిష్కరణ ఆలోచనలు పెంచడం, వాటిని స్టార్టప్‌లుగా ఆచరణలోకి తేవడం ద్వారా వారిని శక్తిమంతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

    ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ అయిన ఆత్మనిర్భర్‌ భారత్‌ గురించి శ్రీ ప్రధాన్‌ తన ప్రసంగంలో వివరించారు. కొవిడ్-19 సవాళ్లను అవకాశాలుగా మార్చడంలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర, స్వావలంబన, వసుదైక కుటుంబ స్ఫూర్తిని నిజం చేయడం వంటి అంశాల గురించి ప్రస్తావించారు. చుట్టూ ఉన్న సామాజిక, ఆర్థిక సవాళ్లను గుర్తించి వాటిని అవకాశాలుగా మార్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. అవి సుసంపన్నత, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం.., ఆవిష్కరణలు, వృద్ధి, స్వావలంబన భవిష్యత్‌ పథంలోకి దేశాన్ని నడిపించాలన్నారు. సంపద సృష్టితో పాటు సమాజానికి మంచి చేసే వ్యవస్థాపకత నిజమైన ఉద్దేశాన్ని అర్ధం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను మంత్రి కోరారు. ప్రపంచానికి ఆర్థిక ప్రయోజనం కల్పించే, అందరికీ అందుబాటులో ఉండే, స్థిరమైన, లాభదాయక నమూనాను రూపొందించడానికి వివిధ లక్ష్యాల మధ్య సమతుల్యం సాధించాలని పిలుపునిచ్చారు. 

    ఆవిష్కరణ, వ్యవస్థాపకత కోసం వర్ధమాన వ్యవస్థను నిర్మించటంలో, దేశీయ పారిశ్రామికవేత్తలకు అన్ని స్థాయుల్లో చేయూతనివ్వంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను శ్రీ ప్రధాన్ ప్రధానంగా వివరించారు.

***



(Release ID: 1639437) Visitor Counter : 149