రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు, అక్షరాల రంగులను స్పష్టంగా తెలియపరిచేందుకు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ
Posted On:
16 JUL 2020 3:53PM by PIB Hyderabad
‘వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాహన రిజిస్ట్రేషన్ సంబంధిత
మార్క్‌ల కేటాయింపునకు సంబంధించిన సంగ్రహవలోకనం’ అనే అధ్యాయంలో ఉన్న క్రమరాహిత్యాలను సరిదిద్దేందుకు గాను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ నెల 14న ఎస్ఓ 2339(ఈ) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో పట్టిక రూపంలో వివిధ తరగతులు మరియు వాహన వర్గాలకు చెందిన బండ్లకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ ప్లేట్ల రంగు, అక్షరాల రంగులను స్పష్టంగా తెలియజేసింది. వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు, ఆంగ్ల అక్షరాలు సంఖ్యల రంగుల విషయమై మరింత స్పష్టతను ఇచ్చేందుకు మాత్రమే తాజాగా ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అంతేగాని రిజిస్ట్రేషన్ ప్లేట్ల విషయమై సరికొత్త నిబంధనలు ఏవీ ఇందులో సూచించబడలేదు. ఇంతకు ముందు, జూన్ 12వ తేదీ 1989లో
వెలువరించిన మోటారు వాహనాల చట్టం, 1988 (1988 లో59) లోని ఎస్.ఓ. 444 (ఈ) సెక్షన్ 41 లోని సబ్ సెక్షన్ (6) కింద వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆయా వాహనాల రిజిస్ట్రేషన్‌కు వేర్వేరు గుర్తును మంత్రిత్వ శాఖ సూచించింది. ఆ తరువాత నవంబర్ 11, 1992న మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎస్ఓ 827(ఈ) నోటిఫికేషన్ ద్వారా వాహన ప్లేట్లపై ఉండే
ఆంగ్ల అక్షరాలు, అంకెలు మరియు వివిధ తరగతులు మరియు వాహనాలను సూచించేలా రిజిస్ట్రేషన్ ప్లేట్లకు రంగులను ఖరారు చేస్తూ కేంద్రం ఎస్.ఓ. 444 (ఈ) నోటిఫికేషన్‌ను సవరించింది. దీనికి తోడు రవాణా మంత్రిత్వ శాఖ
13/12/2001 నాటి జీఎస్ఆర్ 901 (ఈ) ద్వారా రవాణా, రవాణేతర వాహనాల
రిజిస్ట్రేషన్ ప్లేట్ యొక్క రంగును సూచించింది. అయితే ‘వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తులు ఒక సంగ్రహావలోకనం’ అనే అధ్యాయంలో జూన్ 12, 1989న ఎస్.ఓ. 444(ఈ) ద్వారా చేసిన పలు సవరణలు కొన్నింటిని ఆయా ప్రాంతాలలో పరిగణనలోకి తీసుకోకుండా వదలి వేసినట్టుగా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దీనివల్ల కొంత అస్పష్టతలు గుర్తించబడ్డాయి. దీంతో ఈ విషయమై మరింతగా స్పష్టతను ఇచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
***
(Release ID: 1639101)
Visitor Counter : 179