రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఈనెల 14న జరిగిన భారత్‌-చైనా సైన్యం స్థాయి సమావేశం

Posted On: 16 JUL 2020 1:01PM by PIB Hyderabad

వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రస్తుత పరిస్థితులను పరిష్కరించడానికి.. సైన్యం, దౌత్య మార్గాల ద్వారా భారత్‌, చైనా చర్చలు జరుపుతున్నాయి.

    భారత్‌ వైపు ఉన్న చుషూల్‌లో, ఈనెల 14వ తేదీన భారత్‌, చైనా సైన్యాధికారుల మధ్య నాలుగో దశ చర్చలు జరిగాయి.

    సరిహద్దుల్లో మోహరించిన బలగాలను వెనక్కు తీసుకోవడానికి, ఈనెల 5వ తేదీన భారత్‌-చైనా ప్రత్యేక ప్రతినిధుల జరిగిన చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా ప్రస్తుత సమావేశం జరిగింది.

    మొదటి దశ సైన్యం ఉపసంహరణ ప్రగతిపై సీనియర్‌ కమాండర్లు సమీక్షించారు. పూర్తి ఉపసంహరణకు తీసుకోవలసిన తర్వాతి చర్యలపై చర్చించారు.

    సరిహద్దుల నుంచి సైన్యం ఉపసంహరణకు రెండు వర్గాలు సంపూర్ణ సమ్మతి తెలిపాయి. దౌత్య, సైనిక స్థాయిలో నిరంతర సమావేశాల ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లనున్నారు. 
 

***


(Release ID: 1639092) Visitor Counter : 247