శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బయోటెక్నాలజీ డిపార్టమెంటు మద్దతుతో జైడుస్ రూపొందించి అభివృద్ది చేసిన, జై కోవ్ -డి, కోవిడ్19 వాక్సిన్ మొదటి ఒకటి, రెండు దశల అడాప్టివ్ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి
ఈ వాక్సిన్ కు సంబంధించి భద్రత, తట్టుకోగల సామర్ధ్యం, రోగనిరోధక శక్తిని ఈ అధ్యయనం అంచనా వేస్తుంది
Posted On:
16 JUL 2020 11:02AM by PIB Hyderabad
భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మద్దతుతో, వాక్సిన్ అన్వేషణ కార్యక్రమాన్ని నేషనల్ బయో ఫార్మా మిషన్ కింద చేపట్టడం జరిగింది. దీనిని బిఐఆర్ ఎసి అమలు చేస్తోంది. ఇది ప్రస్తుతం క్లినికల్ పరీక్షల దశకు చేరింది.
జైకోవ్-డి అనేది ప్లాస్‌మిడ్ డిఎన్ఎ వాక్సిన్. దీనిని జైడుస్ రూపొందించి, అభివృద్ది చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పాక్షికంగా దీనికి నిధులు అందించింది. ప్రస్తుతం ఈ వాక్సిన్‌కు సంబంధించి మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షలను ఆరోగ్యవంతులైన ప్రజలపై చేపడుతున్నట్టు బిఐఆర్ఎసి వెల్లడించింది. భారతదేశంలో మనుషులపై పరీక్షలు జరుగుతున్న , దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 తొలి వాక్సిన్ ఇది.
అడాప్టివ్ ఫేజ్ 1, ఫేజ్ 2 డోస్ పెంపు, బహుళ విధ అధ్యయనంలో ఈ వాక్సిన్ భద్రత, దీనిని తట్టుకునే సామర్ధ్యం, వాక్సిన్ కుగల రోగనిరోధక శక్తి వంటి వాటిని పరిశీలిస్తారు. వాక్సిన్‌ను పరీక్షల కోసం మనుషులపై ప్రయోగించడం ,2020 ఫిబ్రవరిలో కోవిడ్ వాక్సిన్ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత చేరిన కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు
బిఐఆర్ ఎ సి ఛైర్‌పర్సన్, డిబిటి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ,“ నేషనల్ బయోఫార్మా మిషన్ కింద, భారత ప్రభుత్వ డిపార్టమెంట్ ఆప్ బయోటెక్నాలజీ, కోవిడ్ -19కు దేశీయంగా సత్వర వాక్సిన్ తయారుచేసేందుకు జైడూస్ తో భాగస్వామ్యం వహించింది. దేశంలో కోట్లాదిమంది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి దేశానికి అవసరమైన వాక్సిన్ తయారీకి జైడూస్ తో ఈ భాగస్వామ్యం ఉద్దేశించినది. ఈ పరిశోధన ప్రయత్నాలు దేశంలో భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు నివారించడానికి అవసరమైన వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి పనికివస్తాయి. అలాగే దేశంలో కొత్త ఉత్పత్తుల తయారీ వాతావరణం కల్పించడానికి ప్రభుత్వ కృషిని పెంపొందించడంతోపాటు ,సమాజానికి అవసరమైన అంశాల విషయంలో చెప్పుకోదగిన మార్పుతీసుకురావడానికి ఇది ఉపకరిస్తుంది.” అని ఆమె అన్నారు.
“ ఆత్మ నిర్భర భారత్‌కు సంబంధించి ఇది కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం జైడూస్ దేశీయంగా అభివృద్ధి చేసిన వాక్సిన్‌కు సంబంధించి మనుషులపై పరీక్షలు చేపడుతున్నారు. ఈ వాక్సిన్ సానుకూల ఫలితాలు ఇవ్వగలదని మేం ఆశిస్తున్నాం. ప్రీ క్లినికల్ దశలో ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం ఇది సురక్షితమైనదని, రోగనిరోధక శక్తిని ప్రేరేపించగలదని, తట్టుకోగలస్థితిలో ఉందని తేలింది. భారతీయ శాస్త్రపరిశోధన రంగంలో ఇదొక పెద్ద ముందడుగు” అని ఆమె అన్నారు.
ఈ పరిణామాల గురించి మాట్లాడుతూ, జైడూస్ కాడిలా ఛైర్మన్ , పంకజ్ ఆర్. పటేల్, “ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం సాగిస్తున్న పోరాటంలో ఇది కీలక అడుగు. ఇది ప్రస్తుతం దేశం ఆరోగ్య రంగ సవాలును ఎదుర్కొవడానికి పనికి వస్తుంది.
కోవిడ్ 19ను నియంత్రించడానికి సురక్షితమైన, సమర్ధమైన వాక్సిన్ ను రూపొందించే అన్వేషణలో, బి.ఐ.ఆర్.ఎ.సి, భారతప్రభుత్వానికి చెందిన డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ అందించిన మద్దతుకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ” అని అన్నారు.
జైకోవ్-డి గురించి:
ప్రీ క్లినికల్ దశలో ఈ వాక్సిన్ పలు రకాల జంతుజాతులైన చిట్టెలుకలు, ఎలుకలు, గినియా పందులు, కుందేళ్లలో జరిపిన పరీక్షలలో బలమైన వ్యాధినిరొధక స్పందనను గమనించడం జరిగింది. ఈ వాక్సిన్ ఉత్పత్తి చేసిన యాంటీబాడీలు, తీవ్రమైన వైరస్ రకాలను బలహీనం చేయడం జరిగింది. ఇది వాక్సిన్ కు గల రక్షణ శక్తిని సూచిస్తున్నది. కండరాల ద్వారా లేదా చర్మం ద్వారా ఈ వాక్సిన్ వినియోగంలో వాక్సిన్ రక్షణకు సంబంధించి టాక్సికాలజీ అధ్యయనంలో ఎలాంటి సమస్యలనూ గుర్తించలేదు. కుందేళ్లలో మానవులకు ఇచ్చే డోస్‌లో మూడు రెట్ల వరకూ సురక్షితమేనని, తట్టుకోగల శక్తి, వ్యాధినిరోధక శక్తి ఉన్నట్టు గుర్తించారు.
జైకోవ్ -డి వాక్సిన్‌తో కంపెనీ దేశంలో డిఎన్ఎ వాక్సిన్ ప్లాట్ ఫాం ను విజయవంతంగా ఏర్పాటు చేయగలిగింది. నాన్ రిప్లికేటింగ్, నాన్ ఇంటిగ్రేటింగ్ ప్లాస్మిడ్ ఆసక్తిగల జీన్ ను తీసుకెళ్లడం దీనిని సురక్షితమైనదిగా చేస్తున్నది. వెక్టర్ రెస్పాన్సు లేకపోవడం, ఏవిధమైన ఇన్‌ఫెక్షన్ కారక ఏజెంట్‌లు లేకపోవడం వల్ల ఈ ప్లాట్ ఫారం అతి తక్కువ బయో సేఫ్టీ నిబంధనలతో(బిఎస్ఎల్-1) వాక్సిన్ తయారీకి వీలు కలిగిస్తుంది. ఈ ప్లాట్‌ఫాం, మెరుగైన వ్యాక్సిన్ స్థిరత్వం ,తక్కువ కోల్డ్ చైన్ అవసరాన్ని సూచిస్తుంది, ఇది దేశంలోని మారుమూల ప్రాంతాలకు వాక్సిన్ రవాణాను సులభతరం చేస్తుంది. ఇంకా, వైరస్ పరివర్తన చెందితే వాక్సిన్‌ను రెండువారాలలో సవరించడానికి, ఇది మరింత రక్షణనిస్తుందని రుజువు చేయడానికి ఈ ప్లాట్‌ఫాం వేగంగా ఉపకరిస్తుంది.
నేషనల్ బయో ఫార్మామిషన్ , డిబిటి:
భారత ప్రభుత్వానికి చెందిన పరిశ్రమ- బోధన రంగాల కొలాబరేషన్‌తో డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించిన మిషన్ ఇది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బయో ఫార్మాసూటికల్స్ ను వీలైనంత త్వరగా అభివృద్ధిచేసేందుకు అన్వేషణ,పరిశోధనను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. దీని మొత్తం వ్యయం 250 మిలియన్ అమెరికన్ డాలర్లు . ఇందులో 50 శాతం నిధులు ప్రపంచబ్యాంకు సమకూరుస్తుంది. దీనిని బయోటెక్నాలజీ రిసెర్చి అసిస్టెన్సు కౌన్సిల్ (బిఐఆర్ ఎసి) అమలు చేస్తుంది. అందుబాటు ధరలో ఉత్పత్తులు దేశానికి అందించేందుకు , దేశ ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించినది.వాక్సిన్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్, బయోథెరాపిటిక్స్ వంటివి ఇందులో ముఖ్యమైనవి. దీనితోపాటు క్లినికల్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడం, దేశంలో టెక్నాలజీ ట్రాన్సఫర్ సామర్ధ్యాలు పెంచడం వంటివి కూడా ఉన్నాయి.
బిఐఆర్ ఎసి గురించి:
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చి అసిస్టెన్సు కౌన్సిల్ (బిఐఆర్ ఎసి) లాభాపేక్ష లేని , సెక్షన్ 8 , షెడ్యూలు బి కింద గల పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజ్. దీనిని భారత ప్రభుత్వ డిపార్టమెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ ఏర్పాటు చేసింది. బయోటెక్నాలజీ ఎంటర్ ప్రైజ్‌ను బలోపేతం చేసి సాధికారత కల్పించేందుకు ఒక ఇంటర్‌ఫేస్ ఏజెన్సీగా దీనిని ఏర్పాటు చేశారు. వ్యూహాత్మక పరిశోధన, వినూత్న ఆవిష్కరణలకు వీలు కల్పించడం, దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల అభివృద్ది అవసరాలు తీర్చడానికి దీనిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు https://birac.nic.in వెబ్‌సైట్ చూడవచ్చు.
జైడుస్ గురించి:
జైడుస్ కాడిలా , అంతర్జాతీయ ఫార్మాసూటికల్ కంపెనీ. ఇది సూక్ష్మ అణువుల ఔషధాలు, బయోలాజికల్ థెరాపిటిక్స్, వాక్సిన్లతో సహా విస్తృత శ్రేణి లో ఆరోగ్య సంరక్షణ చికిత్సకు ఉపయోగపడే వాటిని కనుగొని, అభివృద్ది, తయారు చేసి మార్కెట్‌చేస్తుంది.
(మరిన్ని వివరాలకు : డిబిటి, బిఐఆర్ ఎ సి కమ్యూనికేషన్ సెల్ ను సంప్రదించవచ్చు.
@DBTIndia @BIRAC_2012, www.dbtindia.gov.inwww.birac.nic.in)
***
(Release ID: 1639075)
Visitor Counter : 358