రక్షణ మంత్రిత్వ శాఖ
దేశ రక్షణకు అవసరమైన మూలధన సేకరణ అధికారాలను సాయుధ దళాలకు అప్పగించిన రక్షణ మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
15 JUL 2020 6:44PM by PIB Hyderabad
ఉత్తర సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న భద్రతా వాతావరణం మరియు మన సరిహద్దుల రక్షణ కోసం సాయుధ దళాలను బలోపేతం చేయవలసిన అవసరం నెలకొన్న నేపథ్యంలో.. ఈ రోజు (15వ తేదీ)'డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్' (డీఏసీ) ప్రత్యేక సమావేశం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షతన డీఏసీ సమావేశం జరిగింది. దేశ రక్షణ విషయమై అత్యవసర కార్యాచరణ అవసరాలకు సంబంధించిన దాదాపు రూ.300 కోట్ల వరకు విలువైన క్యాపిటల్ అక్వజిషన్ కేసుల్ని పరిష్కారించుకునే అధికారాన్ని సాయుధ దళాలకు డీఏసీ అప్పగించింది. ఈ నిర్ణయం వల్ల దేశ రక్షణకు అసరమైన మూలధన సేకరణ వేచి ఉండాల్సిన సమయం గణనీయంగా తగ్గనుంది. ఆరు నెలల్లోపే ఆర్డర్లు ఇవ్వడంతో పాటుగా.. ఒక సంవత్సరంలోపు ఆయా పనులు, సేవలకు సంబంధించి డెలివరీలు తీసుకునే అధికారాన్ని డీఏసీకి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
***
(रिलीज़ आईडी: 1638923)
आगंतुक पटल : 207