మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పరీక్ష కిట్ ‘కరోష్యూర్’ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ‘నిషాంక్’

ప్రపంచంలోనే అతి చవుకైన ధరలో రూపొందించిన ఢిల్లీ ఐ.ఐ.టి.

మరింత ఆరోగ్యకరంగా, స్వావలంబనతో దేశాన్ని తీర్చిదిద్దాలని యువతకు ప్రధాని ఇచ్చిన పిలుపే స్ఫూర్తి
ప్రధాని దార్శనికతను సాకారంచేసే దిశగా ఈ పరీక్షా కిట్ ఒక ముందడుగని పేర్కొన్న పోఖ్రియాల్

Posted On: 15 JUL 2020 5:08PM by PIB Hyderabad

కోవిడ్-19 నిర్ధారణకోసం ప్రపంచంలోనే అతి చవుక ధరకు  అందుబాటులో ఉండే ఒక విలక్షణమైన కిట్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ 'నిషాంక్' ఢిల్లీలో ఆన్ లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఆర్.టి.-పి.సి.ఆర్. ప్రాతిపదికగా కరోష్యూర్ పేరిట రూపొందిన కిట్ ను  ఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (..టి.) రూపొందించింది. కిట్ కు భారతీయ వైద్య పరిశోధనా మండలి (.సి.ఎం.ఆర్.), భారతీయ ఔషద ఔషధ కంట్రోలర్ జనరల్ జనరల్  ఆమోదం కూడా లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

  సందర్భంగా మంత్రి పోఖ్రియాల్ మాట్లాడుతూ,..స్వావలంబనతో మన  దేశాన్ని తీర్చదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు స్ఫూర్తిగా కిట్ రూపుదిద్దుకుందని, ప్రధానమంత్రి  దార్శనికతను సాకారం చేసే దిశగా కిట్ ఒక ముందడుగని అభివర్ణించారు. వ్యాధి నిర్ధారణకు చవుకైన, విశ్వసనీయమైన పరీక్ష దేశానికి అవసరమని, అప్పుడే కరోనా మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కరోష్యూర్ కిట్ ఇతర పరీక్షా కిట్ల కంటే ఎంతో చవుకైదని మంత్రి అన్నారు. సృజనాత్మకమైన తమ పరిశోధన సహాయంతో దేశాన్ని ఆరోగ్యకరంగా, స్వావలంబనతో తీర్చిదిద్దాలని ప్రధాని తరచుగా యువతను ఉద్బోధ చేస్తూ ఉంటారని, ప్రత్యేకించి కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రధాని  విజ్ఞప్తి స్ఫూర్తిదాయంగా పనిచేసిందని పోఖ్రియాల్ అన్నారు. కిట్.ను అత్యధిక స్కోరుతో .సి.ఎం.ఆర్. ఆమోదించిందని, డి.సి.జి.. కూడా దీన్ని ఆమోదించిందని ఆయన అన్నారు.

  కరోష్యూర్ కిట్ రూపకల్పనలో ఢిల్లీ ..టి. పరిశోధకులు చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. కిట్ రూపకల్పన, తయారీలో పాలుపంచుకున్న వారందరికీ మంత్రి అభినందనలు తెలియజేశారు. కిట్.ను రూపొందించిన ఢిల్లీ ..టి. ప్రొఫెసర్ వివేకానందన్ పెరుమాల్.ను, పరిశోధక బృందాన్ని కూడా పోఖ్రియాల్ అభినందించారు. కిట్ ను రూపొందించిన బృందంలో పి.హెచ్.డి. పరిశోధక విద్యార్థులైన ప్రశాంత్ ప్రధాన్, అశుతోష్ పాండే, ప్రవీణ్ త్రిపాఠిలతో పాటు, డాక్టర్ అఖిలేశ్ మిశ్రా, డాక్టర్ పరుల్ గుప్తా, డాక్టర్ సోనం ధామీజా, ప్రొఫెసర్ మనోజ్ బి. మీనన్, ప్రొఫెసర్ బిశ్వజిత్ కుండూ, ప్రొఫెసర్ జోమ్స్ గోమ్స్ ఉన్నారు.

    ప్రస్తుత సంక్షోభ సమయంలో చవుకైన కరోష్యూర్ కిట్ దేశానికి ఎంతో సహాయకారిగా కాగలదని, దేశ రాజధాని ప్రాంతంలో ఉన్న న్యూటెక్ మెడికల్ డివైసెస్ సంస్థ కిట్ ను తయారు చేసిందని పోఖ్రియాల్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సంక్షోభ సమయంలో దేశ ప్రయోజనాల కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రముఖ విద్యాసంస్థ, ఒక ప్రైవేటు కంపెనీతో కలసికట్టుగా పనిచేసిందని మంత్రి అన్నారు. అధీకృత టెస్టింగ్ లేబరేటరీల్లో పరీక్షల నిర్వహణకు కిట్ అందుబాటులో ఉంటుందని, కిట్ ఆవిష్కరణతో కోవిడ్-19 ఆర్.టి-పి.సి.ఆర్. పరీక్షా వ్యయం గణనీయంగా తగ్గుతుందని ఆయన అన్నారుఆర్.టి.పి.సి.ఆర్ ప్రధాన ధర 399 రూపాయలని, ఆర్.ఎన్.. ఐసొలేషన్, లేబరేటరీ చార్జీలు కలుపుకున్నా ఒక్కో పరీక్షకయ్యే ఖర్చు చాలా చవుకగా ఉంటుందని, మార్కెట్లో అందుబాటులో ఉన్న కిట్లకు అయ్యే ఖర్చుకంటే ఇది చాలా తక్కువని మంత్రి అన్నారు. తమ కోవిడ్ కిట్ ను తయారు చేయడానికి పది కంపెనీలకు ఢిల్లీ ..టి. లైసెన్స్ ఇచ్చిందని కేంద్రమంత్రి చెప్పారు.

  మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే మాట్లాడుతూ, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో, విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకమైన పరిస్థితుల్లో తక్కువ ధరలో నిర్ధారణ పరీక్ష కిట్ ను ఢిల్లీ ..టి. రూపొందించడం ఎంతో గొప్ప విషయమని, దీన్ని అతి తక్కువ వ్యవధిలో అందుబాటులోకి తేవడం గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సృజనాతకత, ఔత్సాహిక పరిశోధన  ఎంతో కీలకమైనవని, ..టి.ల్లో రెండు లక్షణాలు పెంపొందాయని సంజయ్ ధోత్రే అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో కూడా సృజనాత్మకతకు, కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి తగిన వాతావరణాన్ని కల్పిస్తున్నారని అన్నారు.

  గ్రామీణాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానానికి నలబై ఏళ్లుగా కేంద్రస్థానంగా ఉంటోన్న ఢిల్లీ ..టి.,.గ్రామీణ జీవితాల అభ్యన్నతికి  కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ధోత్రే అన్నారు. సృజనాత్మకత, ఔత్సాహిక పరిశోధనా కార్యకలాపాలకు తగిన జ్ఞానతృష్ణ, సామర్థ్యం యువతరానికి ఉందని, సరైన వాతావరణం, తగిన వనరులు కల్పించి వారిని కార్యోన్ముఖం చేస్తే సరిపోతుందని, విషయంలో ..టి.లు ఎంతో గొప్ప కృషిచేస్తున్నాయని మంత్రి అన్నారు.

   ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే మాట్లాడుతూ,..రియల్ టైమ్ పి.సి.ఆర్. ఆధారిత పరీక్ష కిట్ కు .సి.ఎం.ఆర్. ఆమోదం పొందిన తొలి విద్యాసంస్థగా ఢిల్లీ ..టి. ఘనతను సాధించిందని అన్నారు. వందశాతం కచ్చితత్వంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య పరిశోధనా సంస్థలో పరీక్షా కిట్ తయారైందని ఆయన అన్నారు. సమాజ శ్రేయస్సుకోసం ఢిల్లీ ..టి. చేసిన కృషిని ఆయన అభినందించారు.

 ఢిల్లీ ..టి. డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు మాట్లాడుతూ, అతి చవుకైన కోవిడ్ పరీక్షా కిట్ రూపకల్పన, తయారీలో కేంద్రం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్యమంత్రిత్వ శాఖలనుంచి, .సి.ఎం.ఆర్.నుంచి అందిన సహాయానికి ఢిల్లీ ..టి. కృతజ్ఞతతో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశానికి, ప్రపంచానికి సహాయంగా, కోవిడ్-19పై తమ పరిశోధన ఇకపై కూడా కొనసాగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.

*****.



(Release ID: 1638874) Visitor Counter : 237