నౌకారవాణా మంత్రిత్వ శాఖ

కేరళలోని కొచ్చిన్ ఓడ‌రేవులో గ‌ల‌ వల్లర్పాడమ్ టెర్మినల్‌ని భారత్‌లోనే తొలి ట్రాన్స్-షిప్మెంట్ హబ్‌గా అభివృద్ధిప‌రిచే అంశాన్ని స‌మీక్షించిన శ్రీ మాండవియా

Posted On: 15 JUL 2020 1:48PM by PIB Hyderabad

కొచ్చిన్ ఓడరేవులోని వల్లర్పాడమ్ టెర్మినల్‌ అభివృద్ధి కార్యకలాపాల అంశాన్ని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ మన్సుఖ్ మాండవియా
ఈ రోజు సమీక్షించారు. భారత్‌లోనే ఇది మొదటి ట్రాన్స్-షిప్మెంట్ పోర్ట్‌గా చెప్ప‌బ‌డుతోంది. దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను డీపీ వరల్డ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ కేంద్రాన్ని భార‌త దేశ‌పు ట్రాన్స్-షిప్మెంట్ హబ్ గాను.. మొత్తం ద‌క్షిణాసియా ప్రాంతంలోనే మేటి హ‌బ్‌గా నిల‌పాల‌న్న స్వ‌ప్నాన్ని సాకారం చేసే విష‌యంలో ఎదుర‌య్యే వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు గాను కావాల్సిన వ్యూహా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

 

vallar


ట్రాన్స్-షిప్మెంట్ హబ్ అంటే..
ట్రాన్స్-షిప్మెంట్ హబ్ అంటే సంబంధిత ఓడరేవు వద్ద ఉండే ఒక టెర్మినల్, ఇది స‌రుకు ర‌వాణా కంటైనర్లను నిర్వహిస్తుంది, తాత్కాలికంగా వాటిని నిల్వ చేసుకొని తదుపరి గమ్యం కోసం ఇతర నౌకలకు బదిలీ చేస్తుంది. ఈ స‌మీక్ష సంద‌ర్భంగా మంత్రి శ్రీ మాండవియా మాట్లాడుతూ.. “ భార‌తీయ ఓడ‌రేవు ద్వారానే భార‌త స‌రుకు ట్రాన్స్-షిప్మెంట్ జరిపేందుకు వీలుగా ఈ టెర్మిన‌ల్‌ను మేము అభివృద్ధి చేస్తున్నాము. ఈ దిశ‌గా వల్లర్పాడమ్ టెర్మినల్ యొక్క వివిధ సమస్యలను పరిష్కరించడం షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తొలి ప్రాధాన్యత.” అని అన్నారు.  
హ‌బ్‌గా మార్చేందుకు అన్నిహంగులు..
స్థానికంగా వల్లర్పాడమ్ టెర్మినల్ అని పిలువబడే 'కేర‌ళా కొచ్చి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్-షిప్మెంట్ టెర్మినల్' (ఐసీటీసీ) భారత ప‌శ్చిమ తీరప్రాంతంలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయ‌బ‌డి ఉంది. మేటి ట్రాన్స్-షిప్మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని హంగుల‌ను ఈ టెర్మిన‌ల్‌ క‌లిగి ఉంది. అవేమిటంటే..:

-అంతర్జాతీయ సముద్ర మార్గాల సామీప్యతకు సంబంధించి ఇది మిగ‌తా భారత నౌకాశ్రయాల కంటే కూడా ఉత్తమంగా వ్య‌వ‌స్థీకృత‌మై ఉంది;

-ఇది అన్ని భారతీయ ఫీడర్ పోర్టుల నుండి కనీసం సగటు నాటికల్ దూరంలో ఉంది;

-ముంద్రా నుంచి కోల్‌క‌తా వ‌ర‌కు ఇది వెస్ట్ & ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలోని అన్ని ఓడరేవులకు బహుళ వారపు ఫీడర్ కనెక్షన్లతో మేటి కనెక్టివిటీని కలిగి ఉంది;

-ఇది భారతదేశంలోని ముఖ్య అంత‌ర్‌పోష‌క మార్కెట్లకు సామీప్యాన్ని కలిగి ఉంది;

-ఇది పెద్ద నౌకలను నిర్వహించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. అవసరానికి అనుగుణంగా దీనిని విస్త‌రించేందుకు గాను కావాల్సిన‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

దీంతో కొచ్చిన్ పోర్ట్ యొక్క వల్లర్పాడమ్ షిప్ టెర్మినల్‌ను దక్షిణ భారతదేశానికి అతి ముఖ్య‌మైన సింహద్వారం గాను మరియు దక్షిణ ఆసియాలోనే ప్రముఖ ట్రాన్స్-షిప్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించబడింది.

                               

******


(Release ID: 1638766) Visitor Counter : 247