పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
అగ్నిమాపక కార్యకలాపాల స్వల్పకాలిక కోర్సు ప్రవేశ ప్రక్రియను ప్రారంభించిన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ
ఆరునెలల కాలవ్యవధి గల ఈ కోర్సు17 ఆగస్టు ,2020 న ప్రారంభం కానుంది.
Posted On:
15 JUL 2020 1:10PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో గల భారతదేశంలోని ఏకైక ఏవియేషన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (ఆర్ జి ఎన్ఎ యు). ఈ యూనివర్సిటీ వృత్తివిద్యా కోర్సు అయిన ప్రాధమిక అగ్నిమాపక కోర్సుకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఆసక్తిగల విద్యార్థులు తమ వివరాలను gmraa.contact@gmrgroup.in మెయిల్ కు పంపి నమోదు చేసుకోవాలి.
రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ , యాక్టింగ్ వైస్‌ఛాన్సలర్ శ్రీ అంబెర్ దూబే మాట్లాడుతూ, “ విమానయాన రంగంలో అగ్నిమాపక చర్యలు ఎంతో కీలకమైనవి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల విస్తరణతో , ఈ రంగంలో శిక్షణపొందిన ప్రొఫెషనల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. మా కోర్సు ద్వారా మేము ఈ రంగంలో భవిష్యత్ డిమాండ్‌ను తట్టుకునేవిధంగా నైపుణ్యంగల ప్రొఫెషనల్స్‌ను తయారు చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
బేసిక్ ఫైర్ ఫైటర్స్ ఆరు నెలల కాలపరిమితి గల సర్టిఫికెట్ కోర్సు. అగ్నిమాపక రంగంలో తమ కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కోర్సును జి.ఎం.ఆర్ ఏవియేషన్ అకాడమీతొ కలిసి నిర్వహిస్తున్నారు.
పూర్తి ఎయిర్ కండిషన్డ్ తరగతి గదులు, లైబ్రరీ, హాస్టళ్ళు కలిగిన ప్రపంచస్థాయి ప్రమాణాలు గల శిక్షణ కేంద్రంలో వీరికి శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు నిజజీవిత ఘటనల అనుభవాన్నితెలియజెప్పేదుకు ప్రత్యక్ష అగ్నిమాపక శిక్షణను నిపుణులు యాక్టివ్ రన్‌వైపై ఇస్తారు. పైలట్ కాడెట్‌లు,విమానాశ్రయ నిర్వహణకు సంబంధించిన నిపుణులు కూడా వాస్తవ పని పరిస్థితులకు అనుగుణంగా అగ్నిమాపక అంశాల గురించి వారికి తెలియజేయనున్నారు. ప్రముఖ ఎయిర్‌పోర్టు ఆపరేటర్లతో కలిసి క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశాలను కూడా యూనివర్సిటీ ఆఫర్‌చేస్తోంది.
అర్హత: శారీరకంగా, మానసికంగా దృడంగా ఉన్న 18 సంవత్సరాలు నిండిన పురుషుడు లేదా మహిళా అభ్యర్ధులు ,10+2 పరీక్ష పాసైనవారు ఈ ప్రవేశ ప్రక్రియకు దరఖాస్తు చేసుకోవచ్యు. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ ఉండాలి. పురుష అభ్యర్థులు 165 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండాలి. అభ్యర్థులు ఎల్.ఎం.వి, హెచ్.ఎంవి డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి, ఇంగ్లీషు బాగా అర్థం చేసుకొనగలవారై ఉండాలి.
ప్రస్తుత కోర్సు 2020 ఆగస్టు 17 నుంచి 14 ఫిబ్రవరి 2021 వరకు ఉంటుంది.
రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ గురించి:
రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (ఆర్‌జిఎన్ఎయు) భారతదేశంలోని మొట్టమొదటి , ఏకైక ఏవియేషన్ యూనివర్సిటీ. దీనిని రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ చట్టం 2013 కింద ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో ఏర్పాటు చేశారు. విమానయాన రంగంలోని వివిధ ఉపవిభాగాలతో సహా అన్ని రంగాల కార్యకలాపాలు, యాజమాన్యానికి సంబంధించి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు విమానయాన శాస్త్రాలు,బోధన, శిక్షణ,పరిశోధనను ప్రోత్సహించడం అందుకు వీలుకల్పించడం రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యం. భారతీయ ఏవియేషన్ పరిశ్రమ లో నైపుణ్యాల కొరతకు సంబంధించిన అంతరాన్ని పూడ్చేందుకు ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం మూడు కోర్సులను నిర్వహిస్తున్నది. ఇవి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం, మూడోది సర్టిఫికేట్ కోర్సుఇన్ బేసిక్ ఫైర్ ఫైటింగ్. ఈ విశ్వవిద్యాలయం పలు ఇడిపిలు, ఎండిపిలను ఇప్పటికే ఈ రంగంలో ఉన్న మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఏవియేషన్ ప్రొఫెషనళ్ళ కోసం నిర్వహిస్తుంది. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించిన మరిన్ని వివరాలను www.rgnau.ac.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
***
(Release ID: 1638765)
Visitor Counter : 136