సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

హర్యానాలో 20వేల కోట్ల ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన గడ్కరీ

ఉద్భవిస్తున్న భారతీయ రహదారులుగా అభివర్ణన..హర్యానాలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి అవకాశం
తొలి రెండేళ్లలో రెండు లక్షల కోట్లమేర పనులు పూర్తి చేస్తామని ప్రకటన
చండీగఢ్, ఢిల్లీ విమానాశ్రయం మధ్య ప్రయాణ వ్యవధి 4గంటలనుంచి
2 గంటలకు తగ్గే అవకాశం
గత ఐదేళ్లలో రాష్ట్రంలో 29,406కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేసినట్టు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ప్రకటన
ఢిల్లీ, ముంబై ఎక్స్ ప్రెస్ వే వెంబడి పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధికోసం కలసి రావలసిందిగా హర్యానా ముఖ్యమంత్రికి గడ్కరీ సూచన

Posted On: 14 JUL 2020 5:06PM by PIB Hyderabad

కొత్త ఆర్థిక కారిడార్ ఏర్పాటులో భాగంగా హర్యానాలో దాదాపు 20వేల కోట్ల రూపాయల రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర రవాణా, రహదారులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం చేశారు. మరి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వెబ్ క్యాస్ట్ ఏర్పాటు ద్వారా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారుకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి రిటైర్డ్ జనరల్ వి.కె. సింగ్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రులు రావు ఇందర్ జిత్ సింగ్, కృష్ణపాల్ గుర్జార్, రత్తన్ లాల్ కటారియా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ఎస్.ఎస్. సాంధు, హర్యానా రాష్ట్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా హర్యానాలో వివిధ రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు...

334బి జాతీయ రహదారి, ఝజ్జర్ సెక్షన్ పరిధిలో,. రోహ్నా, హసన్ గఢ్ మధ్య 1,183కోట్ల విలువైన 35.45కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి.

71 జాతీయ రహదారి, జింద్ సెక్షన్ పరిధిలో పంజాబ్ నుంచి హర్యానా సరహద్దు వరకూ ఉన్న 70 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి. ఇందుకు 857కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

జింద్, కర్నాల్ మధ్య 85.36 కిలోమీటర్ల మేర రహదారిని 200కోట్ల రూపాయల ఖర్చుతో రెండు లేన్లుగా అభివృద్ధి చేశారు.

కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా హర్యానాలో వివిధ రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు..

152డి జాతీయ రహదారిలో ఇస్మాయిల్ పూర్ నుంచి నార్నాల్ వరకూ 227 కిలోమీటర్ల పొడవైన ఆరువరుసల కొత్త ఎక్స్ ప్రెస్ వే. 8 ప్యాకేజీల్లో నిర్మించే ప్రాజెక్టుకు 8,650కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు.

352డి జాతీయ రహదారి, గురుగ్రామ్ పటౌడీ-రేవాడి సెక్షన్ లో 1,524కోట్ల రూపాయల వ్యయంతో 46కిలోమీటర్ల నిడివితో నాలుగు వరుసల రహదారి.

928కోట్ల రూపాయల వ్యయంతో 14.4 కిలోమీటర్ల మేర రేవాడి బైపాస్ రోడ్డు నిర్మాణం

11 జాతీయ రహదారి, రేవాడీ- అటేలీ మండీ సెక్షన్ లో 1,057కోట్ల రూపాయల వ్యయంతో 30.45కిలోమీటర్ల మేర రహదారి

148, 11  జాతీయ రహదారికి 40.8 కిలోమీటర్ల మేర 6 వరుసల నార్నాల్ బైపాస్ రోడ్డు

11 జాతీయ రహదారిలో నార్నాల్ నుంచి అటేలీ మండీ సెక్షన్ కు 1,380 కోట్ల రూపాయలతో రోడ్డు.

352 జాతీయ రహదారిపై 1,207 కోట్ల రూపాయల వ్యయంతో జింద్-గోహనా మధ్య 40.6కిలోమీటర్ల మేర (ప్యాకేజీ-1 గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్)

352 జాతీయ రహదారి, గోహనా-సోనేపట్ సెక్షన్ లో 1,502కోట్ల వ్యయంతో 38.23 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రోడ్డు

334 బి జాతీయ రహదారిలో భాగంగా ఉత్తరప్రదేశ్-హర్యానా సరిహద్దునుంచి రోహా వరకూ 1,509 కోట్ల రూపాయల వ్యయంతో 40.47కిలోమీటర్ల మేర 4వరుసల రోడ్డు.

 

కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా హర్యానాలో వివిధ రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, హర్యానా ఉపముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా.

    సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, ప్రాజెక్టులన్నీ హర్యానా ప్రజలకు భారీ ప్రయోజనం కలిగిస్తాయని, హర్యానాలోని వివిధ ప్రాంతాలకు,, హర్యానానుంచి పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అనుసంధానం సులభతరం అవుతుందని అన్నారు.

    రహదారి ప్రాజెక్టులతో పెద్ద నగరాల్లో ఇరుకైన రోడ్లకు వాహనాల రద్దీనుంచి ఊరట లభిస్తుందని, ప్రయాణ వ్యవధికూడా తగ్గిపోతుందని కేంద్రమంత్రి అన్నాారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవడానికి ప్రస్తుతం నాలుగు గంటలు పడుతుండగాఇపుడు రెండు గంటలకు తగ్గుతుందని అన్నారు. ప్రాజెక్టులవల్ల ప్రయాణ వ్యవధి, ప్రయాణ వ్యయం ఆదా అవుతుందని, హర్యానా వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాజెక్టులు ఊతం ఇస్తాయని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ అన్నారు. ప్రభుత్వం మొదటి రెండేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తవుతాయని అన్నారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగంగా, వంద లక్షల కోట్ల రూపాయల మేర మౌలిక సదుపాయాల అభివృద్ధిని సాధించాలన్న ప్రధానమంత్రి లక్ష్యాన్ని గడ్కరీ సందర్భంగా ప్రస్తావించారు. హర్యానా రాష్ట్ర ప్రజలు జీవ ఇంధన పంటలను వేసే అంశాన్ని పరిశీలించాలని, వారు బహుముఖంగా అభివృద్ధి చెందడానికి ఇది తోడ్పడుతుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఉపాధికోసం జనం సామూహికంగా వలస వెళ్లడాన్ని అరికట్టవచ్చని అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే, ట్రాన్స్ హర్యానా ఆర్థిక కారిడార్, గురుగ్రామ్-రేవాడి-అటేలీ-నార్నాల్ ప్రాజెక్టులు ఉద్భవిస్తున్న కొత్త భారతీయ రహదారులకు ప్రతీకలని కేంద్రమంత్రి అభివర్ణించారు. వీటితో హర్యానాలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని అన్నారు.

   రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకోసం భూసేకరణలో తగిన తోడ్పాటు అందించాలని హర్యానా ముఖ్యమంత్రికి గడ్కరీ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి రిటైర్డ్ జనరల్ వి.కె. సింగ్ తో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవచ్చని గడ్కరీ సూచించారు. ఎక్స్ ప్రెస్ వే రహదారుల వెంబడి,.. ప్రత్యేకించి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే రహదారి వెంబడి పారిశ్రామిక క్లస్టర్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజీలు, ఖాదీ అభివృద్ధి వంటి పథకాల కోసం జరిగే కృషిలో చేతులు కలపాలని ఆయన హర్యానా ముఖ్యమంత్రిని కోరారు. విషయంలో అన్ని విధాలా సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి గడ్కరీ హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ ద్వారా 5కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని కేంద్ర మంత్రి చెప్పారు. ఇందుకోసం ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థను ప్రస్తుతం ఉన్న స్థాయినుంచి సంవత్సరానికి 88వేల కోట్ల రూపాయల స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి అన్నారు.

  రహదారుల నిర్మాణంపై తమ ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించినందుకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కేంద్రమంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. హర్యానాలో పరిశ్రమలు, వాణిజ్యంపై ప్రాజెక్టులు సానుకూల ప్రభావం చూపగలవని ఆయన అన్నారు. హర్యానాలో భారీ స్థాయి రహదారుల వ్యవస్థ, రవాణా సదుపాయాల కారణంగానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని  అన్నారు. గత ఐదేళ్ల కాలంలో హర్యానాలో 29,406కిలోమీటర్ల నిడివితో రహదారులను అభివృద్ధి చేశామని, మెరుగుపరిచామని మనోహర్లాల్ చెప్పారు. ప్రమాదాలను నివారించడానికి రాష్టంలోని అన్ని రైల్వే క్రాసింగ్స్ వద్ద  రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జీలు నిర్మాణంకోసం బడ్జెట్లో కేటాయింపులు జరిగినట్టు చెప్పారు.

  కేంద్రమంత్రి రిటైర్డ్ జనరల్ వి.కె.సింగ్ మాట్లాడుతూ,..జాతీయ. రహదారుల ప్రాజెక్టుల అమలుతో హర్యానాలో బహుముఖ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రేవాడీ సిటీలో వాహనాల రాకపోకల రద్దీకి ఊరట కలిగించేందుకు రేవాడీ బైపాస్ ప్రాజెక్టును సిటీ రింగ్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని ఆయన హర్యానా ముఖ్యమంత్రికి సూచించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ఎస్.ఎస్. సాంధు మాట్లాడుతూ, తమ సంస్థ హర్యానాలో 37వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టినట్టు చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకోసం భూసేకరణకు తగిన తోడ్పాటు అందించాలని ఆయన హర్యానా ముఖ్యమంత్రిని కోరారు.

   2014 సంవత్సరంలో హర్యానాలో జాతీయ రహదారుల మొత్తం నిడివి 2,050కిలోమీటర్లు. అది 3,237కిలోమీటర్లకు పెరిగింది. జాతీయ రహదారిపై జనసాంద్రత కూడా దేశంలోని ఇతర ముఖ్యమైన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగానే ఉంది. హర్యానాలో నాలుగు ప్రధాన జాతీయ రహదారి కారిడార్లు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా జింద్-గోహ్నా-సోనేపట్ రహదారిని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా చేపట్టి  అభివృద్ధి చేస్తున్నారు. కొత్తగా చేపట్టే రెండు ప్రాజెక్టుల్లో..అంబాలా-కోట్పుత్లీ మధ్య 304 కిలోమీటర్ల ప్రాజెక్టు, గురుగ్రామ్ రేవాడీ-నార్నాల్ ద్వారా రాజస్థాన్ సరిహద్దు వరకూ 132 కిలోమీటర్ల రహదారి ఉన్నాయి. వీటితో పాటుగా,..హర్యానా పరిధిలో ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో పలు ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో..లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 1,350కిలోమీటర్ల మేర ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే,..30వేల కోట్ల రూపాయల వ్యయంతో  అమృత్ సర్-కత్రా మధ్య 600కిలోమీటర్ల మేర చేపట్టే ఎక్స్ ప్రెస్ వే,..8వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే 30 కిలోమీటర్ల ద్వారకా ఎక్స్ ప్రెస్ వే,..1,630కోట్ల రూపాయల వ్యయంతో గురుగ్రామ్-సోహ్నా మధ్య 21 కిలోమీటర్ల రహదారి,..28 కిలోమీటర్ల అంబాలా రింగ్ రోడ్డు, 30 కిలోమీటర్ల కర్నాల్ రింగ్ రోడ్డు ఉన్నాయి. వీటికి అదనంగా,..410 కిలోమీటర్ల నిడివితో ఇతర జాతీయ రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించారు. వీటికి వచ్చే ఏడాది నిధులు మంజూరవుతాయి. రానున్న రెండు మూడేళ్లలో 60వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 1,550కిలోమీటర్ల మేర రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లను అభివృద్ధి చేయనున్నారు. మొత్తంలో 12,వేల కోట్ల రూపాయలను హర్యానాలోని భూ యజమానులకే నష్టపరిహారంగా పంపిణీ చేయబోతున్నారు.

 


(Release ID: 1638603) Visitor Counter : 222