యు పి ఎస్ సి

సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ (ఈఎక్స్‌ఈ) లిమిటెడ్‌ శాఖపర పోటీ పరీక్ష, 2020

Posted On: 13 JUL 2020 8:57PM by PIB Hyderabad

ఈ ఏడాది మార్చి 1వ తేదీన యూపీఎస్సీ నిర్వహించిన సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ (ఈఎక్స్‌ఈ) లిమిటెడ్‌ శాఖపర పోటీ పరీక్ష, 2020 రాత విభాగం ఫలితాల ఆధారంగా, క్రింద ఇచ్చిన రోల్‌ నంబర్ల అభ్యర్థులు తదుపరి శరీరదారుఢ్య, వైద్య పరీక్షలకు అర్హత సాధించారు. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఒక అభ్యర్థి పరీక్ష (రోల్‌ నం.0800651) ఫలితాన్ని ప్రకటించలేదు.

    అర్హత పొందిన అభ్యర్థులకు శరీరదారుఢ్య, వైద్య పరీక్షలను ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎఫ్) తెలియజేస్తుంది. దీనికి సంబంధించి ఏ అభ్యర్థి అయినా ఎలాంటి సమాచారం అందుకోలేకపోతే వారు తక్షణం సీఐఎస్‌ఎఫ్‌ అధికారులను సంప్రదించాలి.

    అభ్యర్థుల తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత 30 రోజుల్లోగా, అభ్యర్థుల మార్కులు, పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అంటే, యూపీఎస్సీ ఇంటర్వ్యూ తర్వాత 30 రోజుల్లో యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ఉంచుతారు. 
    ఒకవేళ అభ్యర్థుల చిరునామాలో మార్పులు ఉంటే సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి తెలియజేయాలి. సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయ చిరునామా:  డీజీ, సీఐఎస్‌ఎఫ్‌, బ్లాక్‌ నం.13, సీజీవో కాంప్లెక్స్‌, లోధి రోడ్‌, న్యూదిల్లీ-110003.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.


(Release ID: 1638433) Visitor Counter : 150