రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

స్థానిక అవసరాలు తీర్చే హైవే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రధాన సాంకేతిక సంస్థల సహకారం, భాగస్వామ్యం కోరుతున్న ఎన్‌హెచ్‌ఏఐ

Posted On: 13 JUL 2020 7:47PM by PIB Hyderabad

ప్రపంచస్థాయి జాతీయ రహదారులను (ఎన్‌హెచ్‌) నిర్మించే ప్రయత్నంలో భాగంగా, దేశంలోని అన్ని ఐఐటీలు, నిట్‌లు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలతో ఎన్‌హెచ్‌ఏఐ సంప్రదింపులు జరుపుతోంది. సంస్థాగత సామాజిక బాధ్యతలో భాగంగా, స్వచ్ఛందంగా, ఆయా సంస్థల సమీపంలోని జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని కోరుతోంది.
దేశ రహదారి మౌలిక సదుపాయాల వృద్ధిలో విద్యార్థులు, అధ్యాపకుల మేధస్సును ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యం. అధ్యాపకులు, విద్యార్థులతో పాటు స్థానిక అవసరాలు, స్థలాకృతులు, వనరుల విషయంలో ఈ సంస్థలు మంచి గుర్తింపు కలిగి ఉన్నాయి. వీటిని రోడ్ల నిర్మాణానికి ముందు, నిర్మాణంలో, హైవేల విస్తరణల్లో ఉపయోగించుకోవచ్చు. నిర్ణయం తీసుకునే చొరవను విద్యార్థుల్లో ఈ వికేంద్రీకృత విధానం పెంపొందిస్తుంది. దీనితోపాటు తమంత తాముగా నేర్చుకోవడం, ఇంటర్న్‌షిప్ కోసం ఎంపిక, భవిష్యత్ పరిశోధన రంగాల వంటి అంశాల్లోనూ అవకాశం కల్పిస్తుంది. ఆయా సంస్థలు స్వీకరించిన విస్తరణలు ముఖ్యమైన సమాచారం పొందే మార్గాన్ని చూపుతాయి. ఇది.., హైవేల నాణ్యత, భద్రతతోపాటు, అధునాతన పరిశోధన కేంద్రం, సిమ్యులేషన్‌ వ్యవస్థల పరంగా సంస్థల స్థానిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

    సంబంధిత వర్గాలకు సౌలభ్యంతోపాటు, వాహన కదలికలు, రద్దీ, ప్రమాద కారక ప్రాంతాల తక్షణ గుర్తింపు వంటి స్థానిక సమస్యలను తగ్గించడానికి హైవేల విస్తరణ స్వీకరణ సాయపడుతుంది. ఈ అనుభవాలు.. వర్తమాన, భవిష్యత్‌ ప్రాజెక్టుల్లో స్థానిక అవసరాలను ఎన్‌హెచ్‌ఏఐ అవగాహన చేసుకోవడానికి తోడ్పడతాయి. దీనివల్ల నిర్వహణ, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడంతోపాటు, రహదారి పక్కనుండే సౌకర్యాలను వృద్ధిచేయడానికి వీలవుతుంది. హైవే ప్రయాణీకులకు స్నేహపూర్వక, ఉల్లాసభరిత ప్రయాణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

    పెద్ద సంఖ్యలో ఐఐటీలు, నిట్‌లు, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడానికి అంగీకరించాయి. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కార్యక్రమ ప్రారంభం, రహదారి మౌలిక సదుపాయాల్లో మెరుగైన సంస్కరణలు తీసుకురావడం కోసం ఆయా సంస్థలు, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య అవగాహన ఒప్పందాలు కుదురుతున్నాయి.

 

***

 



(Release ID: 1638418) Visitor Counter : 155