వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
బలమైన, స్థితిస్థాపక, ‘‘ ఆత్మా నిర్భర్ భారత్ ’’ కోసం, వాణిజ్య సంస్థలకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది: శ్రీ పియూష్ గోయల్
బొంబాయి వాణిజ్య మండలి 184వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించిన - వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి.
Posted On:
13 JUL 2020 2:11PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రపంచాన్ని మార్చింది, కాని భారతీయ ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఈ సంక్షోభానికి లొంగలేదనీ, స్థితిస్థాపకత యొక్క ప్రత్యేకమైన లక్షణంతో నిలబడి, పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడానికి ఇవి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తున్నాయనీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు మరియు రైల్వేల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీ లో పేర్కొన్నారు.
దేశంలో అతిపురాతనమైన సంస్థల్లో ఒకటైన, బొంబాయి వాణిజ్య మరియు పరిశ్రమల మండలి 184వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో, ఆఫీసు బేరర్లు మరియు సభ్యులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ, భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మరియు భారతదేశంలో కోవిడ్ పరిస్థితులతో పోరాడటానికి సిద్ధంగా ఉండటానికి, పి.పి.ఈ. లను ఉత్పత్తి చేయడం, ఐ.సి.యు. పడకలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ఐసోలేషన్ సదుపాయాలు, మాస్కులు, ఇతర పి.పి.ఈ.ల తయారీలో భారతీయ పరిశ్రమలు మరియు వాణిజ్య సంస్థల పాత్రను ప్రశంసించారు. భారతదేశం ఇప్పుడు పిపిఇలను ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ లాక్ ప్రారంభమైన పరిస్థితుల్లో, సరకు రవాణా, విద్యుత్తు వినియోగం పెరగడంతో, భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోంది. సహేతుకమైన స్థాయి నిర్వహణ కార్యక్రమాలతో తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎగుమతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కు ముందు మరియు కోవిడ్ తరువాత ప్రపంచాలు భిన్నంగా ఉంటాయనీ, కోవిడ్ తరువాత ఉత్తమమైన ప్రపంచానికి మనం సిద్ధమవుతున్నామని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ అనంతర ప్రపంచంలో, భారతదేశం ఒక దేశంగా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని, ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, అధిక ఆర్థిక వ్యవస్థల కోసం ప్రయత్నించడం, సరకు రవాణా విధానాలు, పోటీ ధర మరియు వినూత్న పద్దతులను ఉపయోగించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని శ్రీ గోయల్ సూచించారు. వృద్ధిని పెంపొందించడానికి, ఎక్కువ ఉపాధి అవకాశాలతో యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, ప్రపంచంతో బలంగా నిమగ్నమవ్వడానికి, ప్రపంచానికి తలుపులు మూసివేయకుండా, భారతదేశాన్ని స్వయం సమృద్ధి “ఆత్మ నిర్భర్ భారత్” గా రూపొందించడానికి ప్రభుత్వం మరియు వాణిజ్య సంస్థలు కలిసి పనిచేయాలని, ఆయన పేర్కొన్నారు.
ఆటో విడి భాగాలు, తోలు ఉత్పత్తులు, ఔషధాలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తుల వంటి నిర్దిష్ట రంగాలలో ప్రత్యేకత కలిగిన మన భారతీయ పరిశ్రమలు భారతీయ తయారీని ప్రోత్సహించే భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. "వ్యాపార సూచికలను సులభతరం చేయడానికి మరియు సరళీకృతం చేయడానికి, పరిశ్రమల కోసం ఏక గవాక్ష అనుమతులు మరియు స్వీయ-నియంత్రణ నిర్మాణాలకు బలమైన యంత్రాంగాన్ని నిర్మించడానికి అనువుగా చేసే ప్రయత్నాలకు సహాయం చేయడానికి మరియు సహకరించడానికి బొంబాయి వాణిజ్య, పరిశ్రమల మండలిని నేను ఆహ్వానిస్తున్నాను" అని శ్రీ పియూష్ గోయల్ చెప్పారు.
బలమైన, స్థితిస్థాపక భారతదేశ నిర్మాణానికి, వాణిజ్య సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించవలసిన అవసరం ఉందని, శ్రీ గోయల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని పురాతన వాణిజ్య సంస్థలలో ఒకటిగా ఉన్న బొంబాయి వాణిజ్య, పారిశ్రామిక మండలి 184వ సర్వ సభ్య సమావేశం ఒక ముఖ్యమైన సంఘటనగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని యువత యొక్క అపారమైన సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించగలదని ఆయన తమ ప్రసంగాన్ని ముగిస్తూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పరీక్షా సమయాల్లో 130 కోట్ల మంది భారతీయుల స్థితిస్థాపకతను శ్రీ గోయల్ ప్రశంసించారు.
*****
(Release ID: 1638355)
Visitor Counter : 235