రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వే 2030 నాటికి గ్రీన్ రైల్వేగా మారేందుకు నిర్దేశిత లక్ష్యంతో కృషి చేస్తోంది(కార్బన్ ఉద్గారాల పూర్తి తొలగింపు)
2023 నాటికి అన్ని బ్రాడ్‌గే్జ్‌మార్గాల విద్యుదీకరణకు కృషి
రైల్వే విద్యుదీకరణ గ్రిడ్‌కు పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ సరఫరా
40,000 ఆర్‌కెఎం లకు పైగా (63 శాతం బిజి రూట్ల) విద్యుదీకరణను పూర్తి చేసిన భారతీయ రైల్వే
2009-14 మధ్య 3,835 కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు మాత్రమే పూర్తి కాగా, 2014-20 మధ్య 18.605 కిలోమీటర్లు పూర్తయింది
కోవిడ్ మహమ్మారి కాలంలోనూ 365 కిలోమీటర్లమేర ప్రధాన అనుసంధాన పనులు చేపట్టడం జరిగింది.
100 మెగా వాట్లసౌరవిద్యుత్ ప్లాంట్లను 900 రైల్వే స్టేషన్‌లు, వివిధ భవనాల పైకప్పులపై ఏర్పాటు చేయడం జరిగింది. 400 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు వివిధ దశలలో అమలులో ఉన్నాయి.
భారతీయ రైల్వేలు,20 జిడబ్ల్యు స్థాపిత సామర్ధ్యంతో, భూ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 51 వేల హెక్టార్ల భూమి అందుబాటులో ఉంది.
1.7 మెగా వాట్ల ప్రాజెక్టును బినా వద్ద బి.హెచ్.ఇ.ఎల్ కొలాబరేషన్‌తో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది.
పవన విద్యుత్ రంగంలో, 103 మెగావాట్ల పవన విద్యుత్ ఆధారిత ప్లాంట్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. రాగల 2 సంవత్సరాల
Posted On:
13 JUL 2020 12:55PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలను 2030 నాటికి గ్రీన్ రైల్వేలుగా పరివర్తన చెందించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వశాఖ పలు ప్రధాన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు భూతాపాన్ని తగ్గించడమేకాక వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పనికి వస్తాయి.రైల్వేల విద్యుదీకరణ, లోకోమోటివ్‌లు, రైళ్లు, ఫిక్స్‌డ్ ఇన్‌స్టలేషన్ల ఇంధన సామర్ధ్యం పెంపు, , రైల్వే స్టేషన్లకు, ఇన్‌స్టలేషన్లకు గ్రీన్ సర్టిఫికేషన్, కోచ్‌లకు బయోటాయిలెట్ల బిగింపు, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం వంటివి కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తొలగించేందుకు రైల్వేలు చేపట్టిన వ్యూహంలో భాగంగా ఉన్నాయి.
భారతీయ రైల్వేలు 40,000 రూట్ కిలోమీటర్ల (ఆర్.కె.ఎం) విద్యుదీకరణను పూర్తి చేసింది. (63 శాతం బ్రాడ్ గేజ్ రూట్లు ) ఇందులో 18,605 కిలోమీటర్ల మార్గం విద్యుదీకరణ పనులు 2014-2020 మధ్య జరిగాయి. అంతకు ముందు కేవలం 3,835 కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు 2009-14 మధ్య కాలంలో జరిగాయి. 2020-21 సంవత్సరంలో 7000 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ లక్ష్యాన్ని భారతీయ రైల్వే నిర్దేశించుకుంది. బ్రాడ్‌గేజ్ నెట్ వర్క్ లోని అన్ని రూట్లను 2023 డిసెంబర్ నాటికి విద్యుదీకరించాలని రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. చిట్టచివరి మైలు వరకు అనుసంధానం, అక్కడక్కడా అనుసంధానత లేని చోట్ల దానిని పూర్తి చేయడం వంటి వాటిపై భారతీయ రైల్వేలు దృష్టిపెడుతున్నాయి. ఈ దృష్టితోనే కోవిడ్ మహమ్మారి సమయంలోనూ 365 కిలోమీటర్ల ప్రధాన అనుసంధాన పనులు చేపట్టడం జరిగింది.
కోవిడ్ సమయంలో ముంబాయి- హౌరా వయా అలహాబాద్ మార్గంలో కట్ని-సత్నా సెక్షన్ (99 రూట్ కిలోమీటర్లు)ను హౌరాకు ప్రత్యామ్నాయ రూట్ కల్పించే విధంగా చేపట్టారు. అలాగే, ఇండోర్-గునా- బినా మార్గంలోని పచోరె-మాక్సి మార్గాన్ని (88 ఆర్.కె.ఎం) మాక్సి-భోపాల్- బినా కు ప్రత్యామ్నాయ రూట్‌గా చేపట్టారు. హౌరా,సీల్దా- ఎస్.వి.డి కత్రా వయా పాట్నా రూట్‌లో భగల్పూర్- శివనారాయణ్ పూర్ (45 ఆర్.కె.ఎం) సెక్షన్ ను ప్రారంభించారు. కారైకల్ పోర్టు ను తమిళనాడు,ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన బొగ్గు, ఎరువులు, స్టీలు ప్లాంటులను అనుసంధానం చేసే దిశగా, ఈరోడ్, కోయంబత్తూరు, పాల్‌ఘాట్ లకు పోర్టు అనుసంధానతను కల్పిస్తూ తిరువారూరు-కారైకాల్ పార్టు (46 ఆర్.కె.ఎం) సెక్షన్‌ను ప్రారంభించారు.
సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వే ఎన్నో చర్యలు తీసుకుంది. పైకప్పుపై సౌరపలకలు ఏర్పాటు చేయడం ద్వారా (డవలపర్ నమూనా)500 మెగా వాట్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు భారతీయ రైల్వే కృషి చేస్తోంది. ఇప్పటివరకు 100 మెగా వాట్ల సౌరవిద్యుత్ యూనిట్లను రైల్వేకిచెందిన వివిధ భవనాలు, 900 రైల్వేస్టేషన్లపై ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నది. 400 మెగా వాట్ల ఉమ్మడి సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది. 245 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సంబంధించి టెండర్లు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఈ ప్లాంటులను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. దీనితోపాటు భారతీయ రైల్వేలు భూ ఆధారిత సౌర విద్యుత్ కేంద్రాలనుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రైళ్ళునడిచేందుకుకు వినియోగించడానికి ప్రయత్నిస్తున్నది. భారతీయ రైల్వేలకు 51 వేల హెక్టార్ల భూమి అందుబాటులో ఉంది. ఇందులో 20 గిగావాట్ల భూ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను నేరుగా కేంద్ర, రాష్ట్ర గ్రిడ్‌లకు 25 కెవి ఎసి ట్రాక్షన్ వ్యవస్థ ద్వారా అందించవచ్చు. భారతీయ రైల్వే కిచెందిన సంయుక్త రంగ కంపెనీ రైల్వే ఎనర్జీ మేనేజ్‌మెంట్‌కంపెనీ లిమిటెడ్ (ఆర్.ఇ.ఎం.సి.ఎల్) (49 శాతం ఈక్విటీ), ఆర్.ఐ.టి.ఇఎస్ లిమిటెడ్ (51 శాతం ఈక్విటీ)ని ఈ భూ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాల్సిందిగా కోరడం జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని బినా వద్ద 1.7 మెగా వాట్ల ప్రాజెక్టును భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్) కొలాబరేషన్‌తో ఇప్పటికే ఏర్పాటుచేయడం జరిగింది. ప్రస్తుతం ఇది విస్తృత పరీక్షల దశలో ఉంది. ప్రపంచంలో ఈ తరహా సౌర విద్యుత్ కేంద్రాలలో ఇది మొదటిది.
తొలుత, భూ ఆధారిత సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి భారతీయ రైల్వే మూడు దశలలో 3 గిగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులను చేపట్టింది. తొలిదశలో 1.6 గిగా వాట్ల సామర్ధ్యానికి 2020 ఏప్రిల్ 29న డవలపర్ నమూనాలో, రైల్వే ప్లాట్లలో ఓపన్ యాక్సస్ రాష్ట్రాలలో టెండర్లు పిలిచారు. రెండవ దశలో నాన్ ఓపెన్ యాక్సెస్ రాష్ట్రాలలో రైల్వే ప్లాట్లలో 400 మెగావాట్ల సామర్ద్యంగల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆర్.ఇ.ఎం.సి.ఎల్ యాజమాన్య నమూనాలో (కాప్టివ్ వినియోగం) అభివృద్ది చేయనున్నారు. ఇందుకు టెండర్లను 2020 జూన్ 16న జారీచేశారు. ఇక మూడవ దశలో 1 గిగావాట్ సామర్ధ్యానికి రైల్వే ట్రాక్‌ల వెంబడి డవలపర్ నమూనాలో రైల్వేప్లాట్లలో ఓపెన్ యాక్సెస్ రాష్ట్రాలలలో ఏర్పాటు చేస్తారు. ఇందుకు 2020 జూలై 1న టెండర్లు పిలిచారు.
పవన విద్యుత్ రంగంలో , 103 మెగా వాట్ల పవన ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇందులో 26 మెగావాట్ల యూనిట్ రాజస్థాన్ లో(జైసల్మేర్), 21 మెగావాట్ల యూనిట్ తమిళనాడులో, 56.4 మెగావాట్ల యూనిట్ మహారాష్ట్ర (సాంగ్లి) లో ఉన్నాయి. రాగల 2 సంవత్సరాలలో తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలలో 200 మెగా వాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను భారతీయ రైల్వే ఏర్పాటు చేయనుంది.
వాతావరణ మార్పులను అదుపు చేయడంలో తన పాత్రను గుర్తించిన భారతీయ రైల్వే పలు హరిత కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో రైల్వే స్టేషన్లు, రైల్వే భవనాలను నూరు శాతం ఎల్.ఇ.డి వెలుగులతో నింపే కార్యక్రమం ఒకటి. భారతీయ రైల్వే 7 ఉత్పత్తి యూనిట్లు, 39 వర్కుషాపులు, 6 డీజిల్ షెడ్లు, 1 స్టోర్సు డిపార్టెమంటుకు సిఐఐఐనుంచి గ్రీన్ సర్టిఫికేషన్‌ను పొందింది. 14 రైల్వే స్టేషన్లు, 21 ఇతర భవనాలు, క్యాంపస్‌లు కూడా గ్రీన్ సర్టిఫికేట్ పొందాయి. ఇదికాక 215 రైల్వే స్టేషన్లు ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇఎంఎస్) ఐఎస్ఒ 14001 సర్టిఫికేషన్ పొందాయి.
మొత్తం 505 జతల రైళ్ళను హెడ్ ఆన్ జనరేషన్ (హెచ్.ఒ.జి) గా మార్చివేయడం జరిగింది. దీనివల్ల 70 మిలియన్ లీటర్ల డీజిల్ అంటే ఏడాదికి సుమారు 450 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. రైల్వే కి చెందిన మొత్తం 8 ప్రొడక్షన్ యూనిట్లు, 12 వర్కుషాపుల ఇంధన సమర్ధత అధ్యయనాలు సిఐఐతో గల ఎం.ఒ.యు కింద పూర్తి అయ్యాయి. ఫలితంగా ఇంధన సమర్ధతలో 15 శాతం మెరుగుదల కనిపించింది.
హరిత కార్యకలాపాల కింద రైల్వే 69 ,000 కోచ్‌లలో 2,44,000 బయోటాయిలెట్లను బిగించింది.
***
(Release ID: 1638313)
Visitor Counter : 357
Read this release in:
Punjabi
,
Marathi
,
Odia
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese