విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ప్రతిష్టాత్మకమైన సి.ఐ.ఐ.-ఐ.టి.సి. పురస్కారాలు గెలిచిన ఎన్.టి.పి.సి.
స్థిరత్వానికి గుర్తింపుగా 2019 సంవత్సరానికి అవార్డులు
Posted On:
12 JUL 2020 4:35PM by PIB Hyderabad
దేశంలోనే అత్యధిక పరిమాణంలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్న జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థ (ఎన్.టి.పి.సి.) పనితీరుకు విశేషమైన గుర్తింపు లభించింది.కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్.టి.పి.సి. కార్పొరేట్ రంగంలో కనబరిచిన ప్రతిభావంతమైన పనితీరుకు గాను 2019వ సంవత్సరానికి అవార్డు లభించింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ..), ఐ.టి.సి. ఏర్పాటు చేసిన ఈ అవార్డును ఎన్.టి.పి.సి. సొంతం చేసుకుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) రంగంలో గణనీయమైన ఫలితాల సాధనకు ఎన్.టి.పి.సి.కి విశేషమైన ప్రశంస కూడా లభించింది.
తన పరిధిలోని విద్యుత్ కేంద్రాల సుస్థిర అభివృద్ధికోసం ఎన్.టి.పి.సి. ఎప్పుడూ కృషిచేస్తూ వస్తోంది. పైగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బాలికల సాధికారతా కార్యక్రమాన్ని ఎన్.టి.పి.సి. తన ప్రధాన పథకంగా చేపట్టింది. తన పరిధిలోని విద్యుత్ కేంద్రాల పరిసరాల్లో ఉంటున్న బడుగువర్గాల పాఠశాల విద్యార్థినుల బహుముఖ అభ్యున్నతి లక్ష్యంగా 4వారాల వ్యవధితో ఈ కార్యక్రమం నిర్వహించింది.
కాంట్రాక్ట్ కార్మికులకోసం కాంట్రాక్టర్స్ కార్మిక సమాచార నిర్వహణా వ్యవస్థను (సి.ఎల్.ఐ.ఎం.ఎస్.ను) కూడా ఎన్.టి.పి.సి. ప్రారంభించింది. కాంట్రాక్ట్ కార్మికులకు వారి పనికి తగిన వేతనాన్ని ప్రాజెక్ట్ స్థలంలోనే నెలాఖరు రోజునే చెల్లించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది. వివిధ సంస్థల సుస్థిర మనుగడ విధానాలకు, ప్రతిభావిశేషాలకు గుర్తింపుగా, సి.ఐ.ఐ.-ఐ.టి.సి అవార్డులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం 62,110 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనా సామర్థ్యం కలిగిన ఎన్.టి.పి.సి. గ్రూపు ఆధ్వర్యంలో 70 విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో 24 బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కంబైన్డ్ సైకిల్/లిక్విడ్ ఫూయెల్ ఆధారిత కేంద్రాలు 7,..హైడ్రో విద్యుత్ కేంద్రం ఒకటి, పునరుత్పాదక విద్యుత్ వనరుల ఆధారిత కేంద్రాలు 13, ఉన్నాయి. మరో 25 అనుబంధ విద్యుత్ కేంద్రాలు, ఉమ్మడి విద్యుత్ కేంద్రాలు కూడా ఎన్.టి.పి.సి. పరిధిలో పనిచేస్తున్నాయి.
***
(Release ID: 1638233)
Visitor Counter : 211