శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ పరీక్ష కిట్లలో ఉపయోగించే మాలెక్యులర్ ప్రోబ్స్‌ను ఆవిష్కరించిన జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ సంబంధిత సంస్థ

Posted On: 12 JUL 2020 1:39PM by PIB Hyderabad

వీఎన్‌ఐఆర్‌ బయోటెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌) ద్వారా ఆవిర్భవించిన సంస్థ. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌&టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర సంస్థ. కొవిడ్‌-19 పరీక్ష కిట్లలో ఉపయోగించే మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ "రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరేస్‌ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్‌)ను గుర్తించడానికి.., స్వదేశీ ఫ్లోరోసెన్స్ ప్రోబ్స్‌, పాలిమరేస్‌ చైన్ రియాక్షన్ (పీసీఆర్‌) మిశ్రమాన్ని ఈ సంస్థ ఆవిష్కరించింది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన, బెంగళూరులోని బయో-ఇన్నోవేషన్‌ సెంటర్‌ (బీబీసీ)లో వీఎన్‌ఐఆర్‌ బయోటెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆవిర్భవించింది.

    వీఎన్‌ఐఆర్‌ సహ వ్యవస్థాపకులైన ప్రొ. టి.గోవిందరాజు, డా.మెహర్‌ ప్రకాశ్‌ కలిసి ఆర్‌టీ-పీసీఆర్‌ గుర్తింపు కోసం ఫ్లోరోసెన్స్‌ ప్రోబ్స్‌, పీసీఆర్‌ మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఈ మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ను కొవిడ్‌-19 పరీక్ష కిట్లలో ఉపయోగిస్తారు. ఒక మామూలు పీసీఆర్‌ ఆధారిత పరీక్ష కిట్‌లో మూడు ముఖ్య భాగాలైన ఒలిగోలు, ఎంజైమ్‌లు, మాలెక్యులర్‌ ప్రోబ్స్ ఉంటాయి. వీటిలో మొదటి రెండు మనదేశంలో కొంతవరకు లభిస్తాయి, మరికొంత దిగుమతి అవుతాయి. అయితే కొవిడ్‌ పరీక్షల్లో ఉపయోగించే మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ను మాత్రం దిగుమతి చేసుకుంటారు. పీసీఆర్‌లో విస్తరణను గుర్తించడానికి మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ను ఉపయోగిస్తారు. మాలెక్యులర్‌ ప్రోబ్స్ కోసం సింథసిస్ ప్రోటోకాల్స్‌ను వీఎన్‌ఐఆర్‌ సంస్థ ఆవిష్కరించింది. ఇది పీసీఆర్‌ ఆధారిత కొవిడ్‌ పరీక్షలో ఉపయోగపడుతుంది.

    పరిశోధనశాలలు లేదా కొన్ని అవసరాలకే పరమాణు నిర్ధరణ పరీక్షలు పరిమితమయ్యాయి. అత్యుత్తమ స్థాయి పరమాణు నిర్ధరణ పరీక్షలను అవసరమైతే పూర్తి జనాభాకు నిర్వహించేలా, ప్రత్యేక సమస్యను కొవిడ్‌-19 తెచ్చిపెట్టింది. కొవిడ్‌ పరీక్షల స్థాయిని బట్టి, పరీక్ష కిట్ల భాగాల విషయంలో స్వావలంబన సాధించడం చాలా ముఖ్యం. ఎంజైములు, ఓలిగోల అవసరాన్ని భారతీయ ఉత్పత్తిదారులు కొంతవరకు తీరుస్తుండగా, మూడో భాగమైన మాలెక్యలర్‌ ప్రోబ్స్‌పై వీఎన్‌ఐఆర్‌ దృష్టి పెట్టింది.
    "ఆర్‌టీ-పీసీఆర్‌ ఆధారిత కొవిడ్‌ పరీక్షలకు ఉపయోగించే ప్రోబ్స్‌, ఇప్పటివరకు దిగుమతి చేసుకుంటున్న ముఖ్యమైన కొత్త ఉత్పత్తుల అభివృద్ధిలో మన ప్రాథమిక విజ్ఞాన వృద్ధికి చక్కటి ఉదాహరణ. ఇది ఒక్క వైరస్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇతర వైరస్‌లకు వేగంగా పరమాణు నిర్ధరణ వృద్ధి చేయడానికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది" అని డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అశుతోష్‌ శర్మ చెప్పారు.
 
    పరమాణు పరిశోధన అభివృద్ధి అనేది.., అణువు, దాని లక్ష్యం, రసాయనాల లభ్యత, ప్రతి సంశ్లేషణ స్థాయిలో వచ్చే ఫలితాలను అనుకూలపరచడం వంటి వాటిని అర్ధం చేసుకోవడం ద్వారా, కర్బన రసాయన శాస్త్రం నుంచి వచ్చిన పరిణామం. పరమాణు పరిశోధన అభివృద్ధి కోసం, వినూత్న సింథటిక్ మార్గాలను ఉపయోగించి మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ను వృద్ధి చేయడానికి, వీఎన్‌ఐఆర్‌ తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించింది.
    
    ఈ ఏడాది మార్చిలో, మిగతా ప్రపంచంతోపాటు, వీఎన్‌ఐఆర్ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. అయితే, కొవిడ్‌ సమస్యను పరిష్కరించడానికి, ఇంట్లోనే గడిపిన సమయాన్ని వీఎన్‌ఐఆర్ బృందం ఉపయోగించుకుంది.

    "ప్రస్తుతం సాగుతున్న పరిశోధనలతోపాటు, కొత్త పరిశోధనలు, అభివృద్ధిపై పెట్టుబడి పెట్టడం, స్టార్టప్‌ సంస్థగా మాకు భారం. ఆ సవాలును మేం స్వీకరించాం. కొవిడ్‌ పరీక్షల్లో అతి ముఖ్యమైన ప్రోబ్స్‌ ఆవిష్కరణ కోసం మా బృందం తీవ్రంగా కష్టపడింది. 'మేక్‌ ఇన్‌ ఇండియా', 'ఆత్మనిర్భర్‌ భారత్‌' కార్యక్రమాలను అనుసరించి, కొవిడ్‌ పరీక్షల్లో స్వావలంబనకు మా ప్రయత్నం దోహదం చేస్తుంది. మాకు తెలిసినంతవరకు మరే ఇతర భారతీయ సంస్థ మాలెక్యులర్‌ ప్రోబ్స్‌ను తయారు చేయడంలేదు." అని ప్రొ. టి.గోవిందరాజు తెలిపారు.
 

***



(Release ID: 1638224) Visitor Counter : 189