రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కు ముందు, జాతీయ పర్మిట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారీ చేసే సమయంలో ఫాస్టాగ్ వివరాలు సేకరించాల్సిందిగా ఎన్ ఐసి ని కోరిన కేంద్ర రోడ్డురవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ.
సులభతర కమ్యూనకేషన్, రవాణాకు వీలు కల్పించడంతోపాటు , ఈ చర్య కోవిడ్ ను అదుపుచేసేందుకు ఉపకరిస్తుంది.
ఎన్ఇటిసి ని వాహన్ తో అనుసంధానం పూర్తి అనుసంధానం సాధించడం జరిగింది.
Posted On:
12 JUL 2020 10:12AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వాహనాలను రిజిస్టర్ చేసే సమయంలో ,లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ సమయంలో ఫాస్టాగ్ (FASTag) వివరాలను నమోదు చేసేవిధంగా చూడాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ మంత్రిత్వశాఖ ఒక లేఖను ఎన్.ఐ.సి కి రాసింది. దీని కాపీలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది.నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఎన్.ఇ.టి.సి)ని వాహన్ పోర్టల్ తో అనుసంధానం చేయడం పూర్తి అయిందని అది ఎపిఐ తోపాటుగా మే 14న ప్రత్యక్షంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. వాహన్ వ్యవస్థ ప్రస్తుతం ఫాస్టాగ్ లపై పూర్తి సమాచారాన్ని విఐఎన్, విఆర్ ఎన్ లద్వారా సేకరిస్తున్నది.
అలాగే, కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు , నేషనల్ పర్మిట్ కింద నడుస్తున్న వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేటపుడు ఫాస్టాగ్ వివరాలను సేకరించేలా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది.
ఎం, ఎన్ కేటగిరీల కొత్త వాహనాలను అమ్మేటపుడే వాటికి ఫాస్టాగ్ అమర్చడాన్ని 2017లో తప్పనిసరి చేశారు. అయితే దానిని బ్యాంక్ ఖాతాతో అనుసంధాన చేయడం లేదా దానిని యాక్టివేట్ చేయడాన్ని ప్రజలు పక్కనపెడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తారు. ఫాస్టాగ్‌ను అమర్చడం వల్ల, వాహనాలు జాతీయరహదారుల ఫీ ప్లాజాల ను దాటి వెళుతున్నపుడు, ఫాస్టాగ్ చెల్లింపులకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియంను అది వాడుకుంటుంది. దీనితో నగదు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ వాడకం, దీనిని ప్రోత్సహించడం వల్ల జాతీయ రహదారుల టోల్ ప్లాజాలవద్ద కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు తగ్గించడానికి ఎంతగానో వీలుంటుంది.
ఈ పథకానికి సంబంధించి మంత్రిత్వశాఖ 2017 నవంబర్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
(Release ID: 1638142)
Visitor Counter : 237