గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారి స్మార్ట్ సిటీ మిషన్, ఇండియా సైకిల్స్ 4 ఛేంజ్ ఛాలెంజ్ కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Posted On:
10 JUL 2020 8:53PM by PIB Hyderabad
స్మార్ట్ సిటీస్ మిషన్, ఇండియా సైకిల్స్ 4 ఛేంజ్ చాలెంజ్ కు రిజిస్ట్రేషన్లను 2020 జూలై 10 న ప్రారంభించింది. ఈ ఛాలెంజ్‌ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి 2020 జూన్ 25న ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన విషయాలు తెలియజేయడంతోపాటు , ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే నగరాలు దరఖాస్తు దాఖలు చేసేందుకు ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లో 450 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో స్మార్ట్ సిటీల సిఇఒలు, కమిషనర్లు, నగర పోలీసులు, పౌర సమాజ సంస్థలు, నిపుణులు, పౌరులు ఉన్నారు.
సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి ఉమ్మడి దార్శనికతను అభివృద్ధి చేసేందుకు నగరాలను వాటి పౌరులు, నిపుణులతో అనుసంధానం చేయడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. నగరాలు తాము అభివృద్ది చేసే ప్రణాళికలు అమలు చేసే క్రమంలో సిఎస్ఒలు నిపుణులు, వలంటీర్ల సహకారం తీసుకునేలా ప్రోత్సహిస్తారు. నగరాలు సమర్పించే ప్రతిపాదనలను అంచనా వేసేటపుడు, పౌరుల కొలాబరేషన్ ఎంతమేరకు ఉందన్నది ఒక కొలమానంగా చూస్తారు. ఈ విషయంలో నగరాలకు సహాయపడేందుకు వీలుగా, ఆన్‌లైన్ పోర్టల్ లో సిఎస్ఒలు, అర్బన్ డిజైనర్లు, ప్లానర్లు, విద్యార్థులు, ఇతర పౌరులు ఇలా తమ నగరాలతో కొలాబరేట్ కావాలని కోరుకునే వారు తమపేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫారమ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
నగరాలు ఈ ఛాలెంజ్ కు సంబంధించిన సమాచారం,https://smartnet.niua.org/indiacyclechallenge/ పోర్టల్ ద్వారా తెలుసుకుని , ఇండియా సైకిల్స్ 4 ఛేంజ్ చాలెంజ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో ఈ ఛాలెంజ్ కు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు పౌరులు, నిపుణులు, సిఎస్ఒ లు ఆయా నగర ప్రాజెక్టులతో కొలాబరేట్ కావడానికి ఆసక్తి వ్యక్తం చేయదలచుకున్న వారికి అవసరమైన రిజిస్ట్రేషన్ వివరాలు ఇందులో ఉంటాయి.
నగరాలకు దరఖాస్తుచేసుకునే అవకాశం:
స్మార్ట్ సిటీ మిషన్ కింద అన్ని నగరాలూ ఈ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులు, 5 లక్షలకు మించిన జనాభా కలిగిన అన్ని నగరాలు ఈ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు. ఈ ఛాలెంజ్ రెండు దశలలో ఉంటుంది. అర్హత కలిగిన అన్ని నగరాలు జూలై 10 వతేదీ నుంచి జూలై 21 వరకు తమ నగరాల పేర్లను రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తులను దాఖలు చేయవచ్చు.
ఈ ఛాలెంజ్ రెందు దశలలో ఉంటుంది. తొలిదశ అక్టోబర్ వరకు ఉంటుంది. ఇందులో నగరాలు సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు తీసుకోవడంపైన అలాగే దానిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయడంపైన దృష్టిపెట్టాలి. 2020 అక్టోబర్ లో వీటిలోంచి 11 నగరాలను ఎంపిక చేసి వాటికి కోటి రూపాయల అవార్డు ను బహుకరిస్తారు. అలాగే వారి వ్యూహాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు జాతీయ ,అంతర్జాతీయ నిపుణుల నుంచి స్టేజ్ 2 లో మార్గనిర్దేశం ఇప్పిస్తారు. ఇది మే 2021 వరకు ఉంటుంది.
ఇండియా సైకిల్స్ 4 ఛేంజ్ ఛాలంజ్ దార్శనికత:
కోవిడ్ -19 మహమ్మారి ని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగత రవాణా విధానాల అవసరం పెరిగే అవకాశం ఉంది.ఇటీవల ఐటిడిపి ఇండియా ప్రోగ్రాం నిర్వహించిన సర్వే ప్రకారం నగరాలలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత సైకిల్ వాడకం 50 నుంచి 60 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. సైకిల్ వాడకం పెరుగుదల హరిత ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఉపయోగపడుతుంది. సైక్లింగ్ మౌలికసదుపాయాలలో పెట్టుబడుల వల్ల , తొలుత పెట్టిన పెట్టుబడులకన్న 5.5 రెట్లు ఆర్థిక వ్యవస్థలు ప్రయోజనం పొందుతాయి. స్వల్ప దూరాలకు సైకిల్ వాడకం వల్ల ఏటా భారత ఆర్థిక వ్యవస్థకు 1.8 ట్రిలియన్ల రూపాయల మేరకు ప్రయోజనం కలుగుతుంది.
భారతీయ నగరాలలో సైక్లింగ్ ప్రోత్సాహక చర్యలు:
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భారతీయ నగరాలు సైకిళ్లవాడకాన్ని ప్రోత్సహించే దిశగా పనిచేయడం ప్రారంభించాయి. కోల్‌కతా నగరం, ప్రత్యేక సైకిల్ కారిడార్‌ను ప్రతిపాదించింది. ఇందుకు కోల్‌కతా నగరం, నాలుగు నెలలలో రోడ్ సర్వే నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి ప్రారంభిస్తారు. గువాహతిలో , గ్రీన్ లేన్ ఫౌండేషన్, గౌహతికి చెందిన బైసికిల్ మేయర్, పెడల్ ఫర్ ఛేంజ్ ల మద్దతుతో నగరంలో సైకిల్ ప్రయాణానికి సంబంధించి అత్యుత్తమ మార్గాలపై ఓటు వేయాల్సిందిగా కోరుతూ పౌరుల అభిప్రాయాలను సేకరించే సర్వే నిర్వహిస్తోంది. దీనిని ఈ సవాలులో చేరుస్తారు.
“ నగరాలు అత్యంత నాణ్యతకలిగిన రవాణా వ్యవస్థలు అభివృద్ధి చేసుకోవడంలో సహకరించడానికి గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. ఇది ఆయా నగరాల ప్రజలకు సుస్థిర రవాణా ప్రత్యామ్నాయాలను కలిగిస్తుంది. సురక్షితంగా, ఆనందంగా ప్రతి ఒక్కరూ సైకిల్‌పై వెళ్ళగలిగేలా దార్శనికతతో పనిచేయాల్సిందిగా అన్ని నగరాలను నేను కోరుతున్నాను ”
-- హర్దీప్ సింగ్ పూరి
సహాయ మంత్రి (స్వతంత్ర )
గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ
“ దేశవ్యాప్తంగా సైకిల్ పై ప్రయాణానికి అనువైన నగరాలను తీర్చిదిద్దే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఇండియా సైకిల్స్ 4 ఛేంజ్ ఛాలంజ్‌ను ప్రారంభించడం గర్వకారణంగా మేం భావిస్తున్నాము. కోవిడ్ -19 నుంచి కోలుకోవడానికి, రవాణా రంగానికి సంబంధించి హరిత రికవరీకి సైక్లింగ్ ఉపకరిస్తుంది. ఇది, మన నగరాలలో చురుకైన , సుస్థిర, సమర్ధమైన రవాణాకు బంగారు బాట వేయనుంది”
--దుర్గా శంకర్ మిశ్రా,ఐఎఎస్
కార్యదర్శి,
గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ
(Release ID: 1637970)
Visitor Counter : 179