శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘మేక్ ఇన్ ఇండియా’ పై శ్వేతపత్రం విడుదల చేసిన డాక్టర్ హర్షవర్ధన్: కోవిడ్-19 అనంతరం నెలకొన్న పరిస్థితులపై టిఫాక్ శ్వేతపత్రం

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్త సంక్షోభం,.. అయితే ఈ సవాలుకు పరిష్కారం మాత్రం స్థానికంగానే తయారుకావాలి : డాక్టర్ హర్షవర్ధన్
ఆర్థికవ్యవస్థకోసం అభివృద్ధి పథంకోసం ఈ శ్వేతపత్రాన్ని మార్గదర్శకంగా వినియోగించుకోవాలని పారిశ్రామిక వర్గాల మిత్రులకు,
పరిశోధనా, విధాన నిర్ణాయక సంస్థలకు డాక్టర్ హర్షవర్ధన్ వినతి
‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్యంకోసం సాంకేతిక పరిజ్ఞానానికి సత్వర ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసిన శ్వేతపత్రం

Posted On: 10 JUL 2020 6:26PM by PIB Hyderabad

   కోవిడ్ 19 అనంతరం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా పథకం కింద దృష్టిని కేంద్రీకరించవలసిన అంశాలతో ఒక శ్వేతపత్రాన్ని  కేంద్ర సైన్స్, టెక్నాలజీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, భూమి అధ్యయన శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేశారు. క్రియాశీలకమైన ఔషధ తయారీ రంగానికి సంబంధించిన అంశాలు, సాంకేతికపరమైన సన్నద్ధత, సవాళ్లు అన్న అంశంపై కూడా శ్వేతపత్రాన్ని హర్షవర్ధన్ విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞాన సమాచారం, అంచనా మండలి (టిఫాక్-TIFAC) తయారు చేసిన శ్వేతపత్రాన్ని ఢిల్లీలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. టిఫాక్ పాలకమండలి అధ్యక్షుడు డాక్టర్ వి.కె. సారస్వత్, టిఫాక్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ సంజయ్ సింగ్, సైంటిస్ట్జి’,  టిఫాక్ ఆర్థిక, పరిపాలనా విభాగాల ఇన్ చార్జి అధికారి ముకేశ్ మాథుర్ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

 

  ప్రపంచ స్థాయి సవాళ్లకు స్థానిక పరిష్కారాలు అన్న కొత్త సూత్రం ద్వారా సాంకేతిక, విధానపరమైన అంశాలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశం సన్నద్ధపడుతున్న ప్రస్తుత తరుణంలో శ్వేపత్రాన్ని తీసుకురావడం హర్షదాయకమని డాక్టర్ హర్షవర్ధన్ సందర్భంగా అన్నారు. సకాలంలో శ్వేతపత్రాన్ని తెచ్చిన టిఫాక్.ను ఆయన అభినందించారు. జాతీయ ఆర్థిక పుననిర్మాణ మార్గంలో అనేక అంశాలు ఉన్నాయని అన్నారు. సంప్రదాయేతర వ్యూహాలు, వ్యవసాయం, ఎలెక్ట్రానిక్స్, ఆరోగ్యంసమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీతయారీ రంగాల్లో కొత్తతరహా అంతర్జాతీయ భాగస్వామ్యాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానికి ఉద్దీపన వంటి అంశాలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పరిపుష్టమయ్యేలా చేసేందుకు శ్వేతపత్రాన్ని మార్గదర్శకంగా వినియోగించుకోవాలని పారిశ్రామిక రంగం మిత్రులను, పరిశోధనా, విధాన నిర్ణాయక సంస్థను తాను కోరుతున్నట్టు ఆయన చెప్పారు.

  కోవిడ్-19 సంక్షోభం కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో భారత్ చాలావరకు విజయవంతమైందని డాక్టర్ హర్షనర్ధన్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలోమేక్ ఇన్ ఇండియాపథకం కింద తయారీ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఇపుడు మనకు తగిన అవకాశం వచ్చిందని, తగిన సాంకేతిక పరిజ్ఞానం, విధానపరమైన సంస్కరణలు, కీలకమైన రంగాలపై దృష్టిని కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అభివృద్ధికి దారితీసే మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను పెంచడం, పారిశ్రామికీకరణ, సరఫరా వ్యవస్థను పటిష్టపరచడం, వస్తు సేవలకు గిరాకీని సృష్టించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వవలసి ఉందని మంత్రి అన్నారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం ప్రపంచ స్థాయి సమస్య కావచ్చని అయితే, ఇందుకు పరిష్కారాలు మాత్రం స్థానికంగానే, దేశీయంగానే రూపొందించుకోవలసి ఉందని అన్నారు.

  డాక్టర్ వి.కె. సారస్వత్ మాట్లాడుతూ,.దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషించే ఐదు రంగాలకు శ్వేతపత్రం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞాన రంగం ఉద్దీపన, వివిధ రంగాల అభివృద్ధికి విధానపరమైన, సాంకేతిక పరమైన సిఫార్సులతో శ్వేతపత్రాన్ని రూపొందించారని ఆయన అన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు అవసరమైన నమూనాలను, జాతీయ ప్రాధాన్యత, సాంకేతిక పరిపుష్టి ప్రాతిపదికగా ఉన్న ముఖ్యమైన రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను విధానపత్రం సూచించిందని డాక్టర్ సారస్వత్ చెప్పారు.

   విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగాల విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, ఎక్కువ ప్రాధాన్యం ఉన్న రంగాల అభివృద్ధికి సంబంధించిన, సాంకేతిక పరిజ్ఞాన అంశాలను శ్వేతపత్రంలో  పొందుపరిచారని అన్నారు. కోవిడ్-19 అనంతరం అభివృద్ధిని వేగవంతం చేసే వ్యూహాలను కూడా శ్వేతపత్రంలో పేర్కొన్నారని చెప్పారు. వివిధ రంగాలవారీగా ప్రస్తుతం తయారవుతున్న నివేదికలు ఆర్థిక వ్యస్థ ప్రగతికి ఎంతో విలువైన వనరులు కాగలవని అన్నారు.

   టిఫాక్ కార్యనిర్వాహక డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్ శ్రీవాత్సవ శ్వేతపత్రంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భారతీయ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని, అంచనా వేయడానికి శ్వేతపత్రం ఉపకరిస్తుందని అన్నారు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు అకస్మాత్తుగా కలిగిన తీవ్రమైన నష్టాలను తొలగించగలిగేలా  విధాన నిర్ణయ కర్తలకు (భారతప్రభుత్వానికి), ప్రజలకు తగిన మార్గదర్శకత్వాన్ని శ్వేతపత్రం అందించగలదని అన్నారు. స్వావలంబన కొత్త మంత్రంగా ఆర్థికాభివృద్ధిని సాధించేందకు శ్వేతపత్రం దోహదపడుతుందన్నారు.

  వివిధ రంగాల్లో అభివృద్ధికి గల మార్గాలను, అవకాశాలను, మార్కెట్ ధోరణులను, ఐదు రంగాల్లో గల అవకాశాలను శ్వేతపత్రం పొందుపరిచింది. దేశానికి కీలకంగా పరిగణిస్తున్న ఆరోగ్య రక్షణ, యంత్రభాగాలు, సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, తయారీ రంగం, ఎలెక్ట్రానిక్స్, వంటి రంగాల్లో అభివృద్ధికి అవకాశాలను శ్వేతపత్రం వివరించింది. సరఫరా-గిరాకీ, స్వయం సమృద్ధి, భారీ ఎత్తున ఉత్పత్తి సామర్థ్యం ప్రాతిపదికగా అవకాశాలను వివరించింది. ప్రజారోగ్య రంగం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం, ప్రపంచ సంబంధాల్లో విధానపరమైన ప్రత్యామ్నాయాలను శ్వేతపత్రం గుర్తించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నవీన యుగం సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై అవకాశాలను కూడా వివరించింది. ముఖ్యమైన రంగాల్లో టెక్నాలజీ క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు, టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు రంగాలు చాలా కీలకమవుతాయి. ఇజ్రాయిల్, జర్మనీ వంటి దేశాలతో సహకారం ఇచ్చిపుచ్చుకోవడానికి, సాంకేతిక ప్రాతిపదికన తగిన వేదికలు ఏర్పాటు చేసుకోవడానికి శ్వేతపత్రం దోహదపడుతుంది. “ఆత్మనిర్భర్పథకం కింద భారత్ కు స్వావలంబన దిశగా మార్గదర్శకత్వం వహించేందుకు శ్వేతపత్రం సిఫార్సులు ఉపకరిస్తాయి. వివిధ రంగాల ఉత్పాదనా ప్రక్రియల మధ్య ఉన్న పరస్పర సంబంధాల ప్రాతిపదికగా  ఆయా రంగాల్లో ఉత్పత్తి, ఆదాయం పెంచేందుకు గల అవకాశాలను కూడా శ్వేతపత్రం సూచించింది.

 

 

    


(Release ID: 1637856) Visitor Counter : 320